venkataramana
-
టీడీపీ నేత కారు బీభత్సం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు.. మైలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొడుకు.. టీడీపీ నేత ఉయ్యూరు వెంకటరమణ శనివారం బెజవాడలో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో కారును నడిపి రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు.. తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ నందమూరినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాలివీ..మద్యం మత్తులో.. మహిళతో కారు నడిపిస్తూ?మైలవరం నియోజకవర్గం జి.కొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు కొడుకు వెంకటరమణ తన ఏపీ 16 ఈఎఫ్ 4979 కారులో విజయవాడ నుంచి తన ఇంటికి శనివారం మధ్యాహ్నం బయల్దేరాడు. సింగ్‌నగర్ ఫ్లైఓవర్ దిగి నందమూరినగర్ సాయిబాబా గుడి దాటిన తరువాత కారు వేగాన్ని పెంచి వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డు వెంబడి ఉన్న బడ్డీకొట్టును ఢీకొని ఆ పక్కనే ఉన్న తోపుడు బండ్ల వైపు దూసుకువెళ్లి 20 అడుగుల ఎత్తుకు ఎగిరి చివరకు స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఈ ఘటనలో అక్కడే తోపుడు బండిపై శనక్కాయలు అమ్ముకుంటున్న నందమూరినగర్ తోటవారి వీధికి చెందిన పీకా కోటేశ్వరరావు (49) అనే చిరువ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు నడిపింది ఓ మహిళ అని, పోలీసులు వచ్చేసరికి ఆమెను తప్పించి వెంకటరమణను చూపుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.నిందితులను చూస్తుంటే వారు మద్యం సేవించినట్లుగా ఉన్నారని.. అతివేగంతో ఆ మహిళ కారును నడపడంవల్లే ఈ ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. ఇక నిందితులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని.. చికిత్స నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి పంపామని సింగ్‌నగర్ సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితులు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని, కారు నడిపింది మహిళ కాదు తానే అని నిందితుడు వెంకటరమణ చెబుతున్నాడని ఆయన చెప్పారు. అయితే కారు ఎవరు నడిపారు.. ప్రమాదం ఎలా జరిగిందనే అంశాలకు సంబంధించి సంఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని.. అవి వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. నిందితుడిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు.. నిందితుడు వెంకటరమణను తప్పించేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
సైబర్ నేరగాళ్లే ఎంపీడీవో ఉసురు తీశారు!
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్‌ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది. సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
ఎంపీడీవో అదృశ్యం విషాదాంతం
పెనమలూరు/నరసాపురం/కోనేరుసెంటర్(మచిలీపట్నం)/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యం ఘటన చివరికి విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని విజయవాడలోని మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో మంగళవారం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఈ నెల 15వ తేదీన ఎంపీడీవో అదృశ్యం కాగా... ఆయన సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సిగ్నల్ ఆధారంగా మధురానగర్ వంతెన వద్ద నుంచి ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేశారు.ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ వంతెనకు 200 మీటర్ల దూరంలో పిచ్చిమొక్కల అడుగుభాగాన కుళ్లిపోయిన దశలో వెంకటరమణారావు మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరులో వెంకటరమణారావు అంత్యక్రియలు నిర్వహించారు.పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. కాగా, ఒత్తిళ్ల వల్లే వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు శవపంచనామా సందర్భంగా తెలిపారు. మాధవాయిపాలెం ఫెర్రీ సొమ్ము రూ.55లక్షల బకాయి కారణంగా మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరసాపురం ఎంపీడీవో కుటుంబానికి న్యాయం చేస్తాం: పవన్ నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు మరణం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచి్చన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.అన్నోన్ నంబర్ల నుంచి ఫోన్లు.. సంబంధం లేని ఖాతాలకు డబ్బులు బదిలీ!కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ తెలియకపోవడంతో ఆయన ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అన్ నోన్ నంబర్ల నుంచి వెంకటరమణారావుకు ఫోన్లు వచి్చనట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరికి, హైదరాబాద్‌కు చెందిన ఒకరికి, మరికొన్ని గుర్తుతెలియని ఖాతాలకు ఆన్లైన్లో ఎంపీడీవో డబ్బులు బదిలీ చేసినట్లు వెలుగుచూసింది.అయితే, మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో రూ.55 లక్షలు బకాయి ఉండగా, తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిన వెంకటరమణ కొంత నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో జమ చేశారని చెప్పారు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
పెళ్లింట విషాదం
భూత్పూర్: పెళ్లి జరిగి వారం రోజులు గడవక ముందే, పసుపు పారాణి ఆరకముందే ఆ ఇంట చావు డప్పు మోగింది. వివాహ రిసెప్షన్ అనంతరం వధువు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడుతో సహా ముగ్గురు చనిపోగా, షాక్‌కు గురైన వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద హైవేపై చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా... ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నంబూరి వెంకటరమణ, వాణి దంపతులకు అనూష ఒక్కగానొక్క కూతురు. ఈమెకు ఈ నెల 15న హైదరాబాద్‌కు చెందిన పవన్సాయితో అనంతపురంలో వివాహం కాగా హైదరాబాద్‌లోని పవన్‌సాయి ఇంట్లో రెండురోజుల కిందట రిసెప్షన్ నిర్వహించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కారులో అనంతపురానికి తిరుగు ప్ర యాణమయ్యారు. నంబూరు వెంకటరమణ(55), కూ తు రు అనూష, అల్లుడు పవన్‌సాయి(25), డ్రైవర్ చంద్ర (27) ప్రయాణిస్తున్న కారు అన్నాసాగర్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్‌టెక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రాడ్‌ను బలంగా ఢీకొని 10 ఫీట్ల వరకు గాలిలో ఎగిరి చెట్టును ఢీకొంది. దీంతో వెంకటరమ ణ, పవన్‌సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. అనూష తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. నంబూరు వెంకటరమణ నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్ఐగా పనిచేస్తున్నారు. కళ్ల ముందే తండ్రి, భర్త మృత్యువాత.. కారు ముందు సీట్లో కూర్చున్న తండ్రి వెంకటరమణ, పక్కనే కూర్చున్న భర్త పవన్ మృతి చెందడంతో అనూష షాక్‌కు గు రైంది. ప్రమాద విషయాన్ని వెనకాల కారులో వస్తున్న తల్లి వాణికి ఫోన్లో చెప్పి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. అతివేగమే కారణం.. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో కారు వేగం 120– 140 కిలోమీటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
కోరుట్లలో దారుణ హత్య!
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో అనుమల్ల వెంకటరమణ (54) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో నివాసముండే అనుమల్ల వెంకటరమణ డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తాడు. పట్టణ శివారులోని అర్బన్ కాలనీలోనూ వెంకటరమణకు ఓ ఇల్లు ఉండటంతో అక్కడి వాళ్లకు ఇచ్చిన రుణాల వసూలుకు ప్రతిరోజూ సాయంత్రం కాలనీకి వెళ్తాడు. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీలో డబ్బులు వసూలు చేసుకుని మోటార్ సైకిల్‌పై వెళుతుండగా, అదే కాలనీలో ఉంటున్న వాసాల రఘు (32) అనే యువకుడు వెంటపడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ, వీపు భాగాల్లో గాయాలతో వెంకటరమణ కింద పడిపోయాడు. కిందపడిపోయిన వెంకటరమణపై రఘు మరోసారి కత్తితో దాడిచేయడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం రఘు మోటార్‌సైకిల్‌పై పరారయ్యాడు. దాడికి పాల్పడిన సమయంలో రఘును అడ్డుకోవాలని వెంకటరమణ స్థానికులను ప్రాధేయపడినా.. రఘు బెదిరింపులతో వారు దగ్గరకు రాలేకపోయారు. కాగా, హత్యకు గురైన వెంకటరమణకు కాలనీలో ఉన్న ఓ మహిళతో పరిచయం ఉన్నట్లు సమాచారం. అనంతరం సదరు మహిళ బంధువుతోనూ సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేసినట్టు.. ఈ క్రమంలోనే వెంకటరమణకు, రఘుకు మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వెంకటరమణను హత్యచేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
నిర్మల్ బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులకు మానసిక, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆర్ట్ఫీషెయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ ప్లాట్ ఫాం యాప్‌పై అవగాహన కల్పించారు. ఇటీవల అక్కడ వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యల ఘటనలపై ‘ఎందుకలా చనిపోతున్నారు..’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌పేజీలో గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించి సంగతి తెలిసిందే. ఈమేరకు వర్సిటీ వర్గాలు స్పందించాయి. ప్రముఖ మానసిక నిపుణులు అమెరికాకు చెందిన డాక్టర్ మైక్, బిట్స్‌పిలానీ ప్రొఫెసర్ మోహన్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ వెంకటరమణ ఏఐ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానసిక స్థితిపై.. విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఏఐ బేస్డ్ యాప్ బాగా ఉపయోగపడుతుందని అమెరికా మానసిక నిపుణుడు మైక్ అన్నారు. ఈ యాప్ ద్వారా అడిగే 17 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాటిని నిపుణుల విశ్లేషణ, సంప్రదింపుల తర్వాత విద్యారి్థకి ఏ మోతాదులో మానసిక సహాయం చేయాలనేది నిర్ణయిస్తామన్నారు. విశ్లేషణాత్మక డేటా, నిపుణుల అనుభవం ద్వారా వారికి సహాయం అందిస్తామని చెప్పారు. బిట్స్ పిలానీ ప్రొఫెసర్ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
రమణీయం.. ఛాయాచిత్రం
గుంటూరు మెడికల్: నాడి పట్టి రోగాలను నయం చేయటంలో నిత్యం బిజీగా ఉండే గుంటూరుకు చెందిన ఓ వైద్యుడు వైల్డ్ ఫొటోగ్రఫీలో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుని గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒకపక్క జనరల్ ఫిజీషియన్‌గా రోగుల ప్రాణాలు కాపాడుతూ.. మరో పక్క అడవుల్లో సంచరించే క్రూర మృగాల కదలికలను తన కెమెరాతో క్లిక్‌మనిపించి బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వారి ఏఆర్పీఎస్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 22 ఎంట్రీలు ఈ ఫెలోషిప్‌కు పోటీపడగా కేవలం నాలుగు మాత్రమే సొసైటీ ఆమోదం పొందాయి. వాటిలో భారత దేశం నుంచి ఫెలోషిప్ పొందిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ నరేంద్ర వెంకటరమణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏఆర్పీఎస్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తిగా డాక్టర్ వెంకటరమణ రికార్డు సృష్టించారు. ఏడేళ్లుగా కెమెరాతో గురి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్‌పై చిత్రీకరించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు లభించింది. డాక్టర్ వెంకటరమణ ఏడు సంవత్సరాలు మూడు తరాలకు చెందిన 80 పులుల ఫొటోలు తీసి అంతర్జాతీయ పోటీలకు పంపించగా, న్యాయ నిర్ణేతలు ఆ ఫొటోలకు మంత్ర ముగ్ధులై ఆయనకు సాహస ఫొటోగ్రఫీకి అవార్డు ప్రకటించారు. డాక్టర్ వెంకటరమణ గత 15 ఏళ్లుగా వన్య ప్రాణుల చాయాచిత్రాలు తీసేందుకు ఆఫ్రికా, కెన్యా, టాంజానియా దేశాలతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని వన్య ప్రాణుల కేంద్రాలను సందర్శించి, జంతువుల జీవన విధానం, వివిధ దశల్లో వాటి పెరుగుదల, కలిసి మెలిసి జీవించే దృశ్యాలు, వేటాడే దృశ్యాలు తీశారు. చిన్ననాటి నుంచే ఆసక్తి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తండ్రి డాక్టర్ గోపాలరావు రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దీంతో ఒక పక్క తండ్రి మాదిరిగా వైద్యుడు అవ్వాలనే లక్ష్యంతో డాక్టర్ కోర్సు అభ్యసిస్తూనే 2000 సంవత్సరం నుంచి ఫొటోగ్రఫీలో సైతం మెలకువలు నేర్చుకున్నారు. కర్నాటకు చెందిన డీఎన్ఏ పెరుమాళ్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ మోహన్‌దాస్‌ల వద్ద శిష్యుడిగా చేరి వైల్డ్ ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నాడు. ఏడాదికి ఒకసారి ప్రకృతితో మమేకం అయ్యేందుకు అడవులకు వెళ్లి జంతువులు, పక్షుల ఫొటోలను తన కెమెరా కళ్లతో బంధిస్తున్నారు. చేతితో చిత్రాలు గీసే కల్చర్ ఆర్ట్‌లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. గిటారు, కీబోర్డు, డ్రమ్స్, వాయించడంతోపాటు ఫ్లూట్తో పలు గీతాలను ఆలపించడంతో సైతం నైపుణ్యం ఉంది. అందుకున్న డిగ్రీలు, అవార్డులు... ఫొటోగ్రఫీలో డాక్టర్ వెంకటరమణ నైపుణ్యాన్ని గుర్తించిన అమెరికా దేశంలోని పలు సంస్థలు డిగ్రీలను అందజేశాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఏఆర్పీఎస్, అమెరికాకు చెందిన ఎంఐఐసీఎస్, ఈయూఎస్పీఏ, ఆ్రస్టేలియాకు చెందిన ఏఏపీఎస్, ఇండియాకు చెందిన ఏఐఐపీసీ సంస్థలు, అసోసియేట్ ఆఫ్ ఇంటర్నేషన్ కొలీగ్స్ సొసైటీ, అసోసియేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఫొటోగ్రఫీ అకాడమీ, ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ కొలీగ్స్ సొసైటీ ఫొటోగ్రఫీలో మాస్టర్ డిగ్రీలను, ఫెలోషిఫ్లను అందించాయి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఢిల్లీ, కేరళ సొసైటీ బెటర్ ఆర్ట్ ఫౌండేషన్, ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ, పలు జాతీయ సంస్థల నుంచి 15కు పైగా అవార్డులను, ఇంటర్నేషనల్ యాక్సిటెన్సీ 200లకు డాక్టర్ వెంకటరమణ అవార్డు అందుకున్నారు. -
కీచక తండ్రికి మరణించే దాకా జైలుశిక్ష
బంజారాహిల్స్: కన్నకూతురికి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి ఆమె నిద్రపోయాక కొంతకాలంపాటు అత్యాచారానికి పాల్పడిన కీచక తండ్రికి న్యాయస్థానం మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చింది. కుటుంబ పెద్ద జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. 2003లో వివాహమైన ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. సొంత జిల్లాలోని బంధువుల ఇంట్లో కొడుకు 8వ తరగతి చదువుతుండగా కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటూ 9వ తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. 2021 జూలై 16న కూతురు తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోగా ఆందోళన చెందిన తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కూతురిని నిలదీయగా తండ్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి నిద్రపోయాక అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది. నిద్రలోంచి లేచి చూసుకుంటే తన ఒంటిపై బట్టలుండేవి కావని, ఒళ్లంతా నొప్పులు ఉండేవని వివరించింది. ఓసారి మద్యం మత్తులో ఇంటికొచ్చి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో భయపడి మిన్నకుండిపోయానని రోదించింది. ఈ ఉదంతంపై బాధితు రాలి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడు వెంకటరమణను అరెస్టుచేసి నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. వెంకటరమణపై పక్కా ఆధారాలు సమర్పించారు. వాదనలు విన్న జడ్జి అనిత శుక్రవారం వెంకటరమణను దోషిగా తేల్చి అతనికి మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
జనసేనకు కుప్పం ఇన్చార్జి రాజీనామా
సాక్షి, కుప్పం: జనసేన కుప్పం ఇన్చార్జి మద్దిరాల వెంకటరమణ తన పదవికి, పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను కుప్పం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చూస్తుంటే పీఏసీ కమిటీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (అమరావతిపై విచారణకు తిరస్కరించిన సీజేఐ) -
మాజీ ఎమ్మెల్యే తనయుడి వీరంగం
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మండలంలోని మాతల గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు సాగర్ తన అనుచురులతో కలిసి వీరంగం సృష్టించాడు. వైఎస్సార్సీపీ వర్గీయులతోపాటు ఇద్దరు గ్రామ వలంటీర్లపై మూకుమ్మడిగా మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ వర్గీయులు కలమట శ్రీరాములు, పప్పలు తిరుపతిరావులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సామాజిక భవనంలో గ్రామ సచివాయం ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు భవనానికి రంగులు వేసేందుకు వెళ్లిన కార్మికులతోపాటు కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన అనుచరులతో కలిసి అడ్డుకున్నాడు. భవన నిర్మాణానికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం చెల్లించనందున రంగులు వేయవద్దంటూ అడ్డుకున్నాడు. కులం పేరుతో ధూషించి దర్భాషలాడాడు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇది కొట్లాటకు దారి తీసింది. వైఎస్సార్సీపీ వర్గీయులు కలమట శ్రీరాములు, పప్పల తిరుపతిరావు, గ్రామ వలంటీర్లు గుంట రూపశంకర్, బూరాడ నాగరాజు, మజ్జి రాజశేఖర్లపై దాడి చేశారు. ఈ మేరకు పాలకొండ డీఎస్పీ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. గ్రామంలో శాంతిభద్రత దృష్ట్యా ప్రత్యేక బలగాలు పహారా కాస్తున్నాయి. టీడీపీ శ్రేణులు కలమట సాగర్, రేగేటి సూర్యారావు, రమేష్, యుగంధర్, వినోద్, రామారావు, జగదీష్, భాస్కరరావు గంగివలస తేజేశ్వరరావు కలమట చంద్రరావుతోపాటు 14 మందిపై గుంట రూపశంకర్ ఫిర్యాదు చేశాడు. ప్రతిగా టీడీపీకి చెందిన కాని తవిటయ్య వైఎస్సార్సీపీకి చెందిన కలమట శ్రీరాములు, కాగితపల్లి వెంకటేష్, రమేష్‌లతోపాటు 18 మందిపై ఫిర్యాదు చేశాడు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఎస్ఐ బాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్పందించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి సంఘటనపై ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొత్తూరు చేరుకున్న ఎస్పీ మాతల సంఘటనపై ఆరా తీశారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటుకు సహకరించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ మాతల ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. కొత్తూరు సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇరువర్గాలు అట్రాసిటీ కేసులు పెట్టుకున్నందున దర్యాప్తు చేయాలని పాలకొండ డీఎస్పీకి ఆదేశించామన్నారు. మాతలలో పికెటింగ్ ఏర్పాటు చేయాలని సీఐకు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాల్లో తగాదాలు రాకుండా ముందస్తుగా ఎస్ఐలు రాత్రిబస చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అంతకుముందు కొత్తూరు, పాతపట్నం సర్కిల్ పరిధిలో నేరాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో సీఐలు ఎల్ఎస్ నాయుడు, రవికుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఆ రిటైర్డ్ కండక్టర్ది హత్యేనా..?
-
శాప్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు
-
ఏపీ గ్రూప్1 తొలి ర్యాంకర్‌తో ముఖాముఖి
-
వైకల్యం ఓడింది..ఆశయం గెలిచింది
ఆమె చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. నడిచేందుకు కాళ్లు సహకరించలే. చదివేందుకు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించలే. పేదరికంలో పుట్టిన ఆడబిడ్డగా అష్టకష్టాలు పడింది. అయినా జంకలే. పట్టుదల, ఆత్మస్థైర్యంతో..ఉన్నత కోర్సులు పూర్తి చేసింది. కసితో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొలువు కొట్టి ఆదర్శ బోధనతో తనలాంటి ఎందరికో స్ఫూర్తి నింపుతోంది. టేకులపల్లి: మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న చింత వెంకటరమణ దివ్యాంగురాలు అయినప్పటికీ..ఎంతో ఆత్మవిశ్వాసంతో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. బహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతగుంపు గ్రామానికి చెందిన చింత వెంకన్న, గురువమ్మ దంపతుల పెద్ద కుమార్తె ఈమె. పుట్టుకతోనే పోలియో సోకడంతో అంగవైకల్యం బారిన పడ్డారు. పేద కుటుంబం కావడంతో 1–10 తరగతి వరకు కురవిలో హాస్టల్లో ఉండి చదువుకున్నారు. బయ్యారం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపు చదివారు. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువులకు నేరుగా కళాశాలలో చేరడం కష్టంగా భావించి..దూరవిద్య (ఓపెన్)లో ఎంఏ తెలుగు కోర్సు, అనంతరం 2008–09లో బీఈడీ పూర్తి చేశారు. 2013లో నిర్వహించిన ఏజెన్సీ డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో అదే సంవత్సరం ఆగస్టులో విధుల్లో చేరి..ఇప్పటి వరకు విజయవంతంగా బోధిస్తున్నారు. బోధనలోనూ ప్రత్యేకమే.. ఓ కర్ర సాయంతో నడుచుకుంటూ..తరగతి గదికి వస్తారు. తనకు కేటాయించిన క్లాసుల్లో ఎంతో శ్రద్ధగా బోధిస్తోంది. పుస్తక జ్ఞానమే కాకుండా..సమాజంలోని కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, సామాజిక అంశాలను కూడా నేర్పుతున్నారు. మాతృభాష అయిన తెలుగులో విద్యార్థులు ఎవరూ వెనుకబడి ఉండకుండా ప్రోత్సహిస్తున్నారు. పద్యాలు అలవోకగా చెబుతూ..పిల్లల చేత సాధన చేయిస్తున్నారు. పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెబుతూ విశేష ప్రతిభను చాటుతున్నారు. చేతి రాత కూడా అందంగా ఉండేలా మెళకువలను బోధిస్తూ తీర్చిదిద్దుతున్నారు. మొక్కవోని దీక్షతో, ధైర్యంగా ముందుకు సాగుతున్న వెంకటరమణ ఇటీవలె ఓ అనాథ అయిన సారయ్యను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వైకల్యం ఉందని దిగాలు చెందొద్దని, తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని..సాధన చేయాలని ఆమె సూచిస్తున్నారు. -
జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి
అనంతపురం మెడికల్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎంపీహెచ్ఈఓ, సీహెచ్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా మెడికల్ సిబ్బంది, వైద్యులు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి లార్వా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ, మునిసిపల్ సిబ్బందిని కలుపుకుని సమన్వయంతో పని చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలని తెలిపారు. జ్వర బాధితులుంటే తక్షణం సమీప పీహెచ్‌సీలకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే, శనివారం పరిసరాల పరిశుభ్రత దినంగా పాటించాలన్నారు. అంటు వ్యాధుల నివారణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి చేపట్టే మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, డీఐఓ పురుషోత్తం, పీఓడీటీటీ సుజాత, డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్ కన్సల్టెంట్లు రితీశ్ బజాజ్, దిలీప్‌కుమార్, డీఎంఓ దోసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలోని కమలానగర్లో నివాసం ఉంటున్న వెంకటరమణ (40) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణ ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా భార్యతో మనస్పర్థలు ఉన్నాయి. భార్య ఇటీవల ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపంతో వెంకటరమణ ఆదివారం స్టూడియోలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి, అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు. వన్‌టౌన్ ఎస్ఐ రంగడు కేసు నమోదు చేసుకున్నారు. -
కూలీ ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన వెంకటరమణ (38) అనే కూలీ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మహమ్మద్ రఫి తెలిపిన మేరకు.. వెంకటరమణ తాడిపత్రి ప్రాంతానికి వెళ్లి కొంతకాలంగా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టడంతో అతడు తాగుడుకు బానిసయ్యాడు. మహాశివరాత్రి సందర్భంగా బసంపల్లిలోని మేనమామ ఇంటికి వచ్చాడు. ఆరోగ్యం బాధిస్తుండటంతో మనస్తాపానికి గురైన వెంకటరమణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం పురుగుమందు తాగాడు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి అతడిని ధర్మవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వెంకటరమణకు భార్య వాసవితో పాటు కుమారుడు ఉన్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
- రైలు పట్టాలపై యువకుడి మృతదేహం - తన కొడుకు హత్య చేశారంటూ తల్లి ఫిర్యాదు కదిరి టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతి చెంది రైలు పట్టాలపై శవమై కన్పించాడు. అయితే తన కొడుకును ఎవరో హత్య చేసి ఇక్కడ పడవేశారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి తల్లి, రైల్వే పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కందికుంట వెంకటనారాయణమ్మ కాలనీకి చెందిన వెంకటరమణ (27), లక్ష్మి దంపతులు. వెంకటరమణ భార్య నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. దీంతో స్వప్న అనే మరో యువతితో సహజీవనం సాగించేవాడు. అయితే స్వప్న ఇదివరకే సౌదీకి వెళ్లి నాలుగు నెలల క్రితం ఇక్కడికి వచ్చింది. కాగా స్వప్నకు చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల పాస్‌పోర్టు విషయమై కూడా ఇద్దరూ గొడవలు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు రాజీచేసి పంపారు. అయితే అంతలోనే ఏం జరిగిందో.. ఏమో కాని వెంకటరమణ మృతదేహం గురువారం అదే కాలనీ సమీపంలోని రైలు పట్టాలపై పడి ఉంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా రైల్వే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మృతుడి తల్లి సరోజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకటరమణ మృతికి గొడవలే కారణమా లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే తల్లి మాత్రం ఇది హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
లాడ్జీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక శివాలయం వీధిలోని ఓ లాడ్జిలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అతను లాడ్జీలో మంచం తీసుకొని నిద్రపోయాడని, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చూడగా మంచంలోనే చనిపోయినట్లు లాడ్జీ నిర్వాహకులు చెబుతున్నారు. లాడ్జీ రిజిష్టర్‌లో అతని పేరు వెంకటరమణ, ఈశ్వరరెడ్డినగర్ అని చెప్పినట్లు వారు తెలిపారు. టూ టౌన్ ఎస్ఐ మంజునాథరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రిజిష్టర్‌లో రాసి ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు ఈశ్వరరెడ్డినగర్కు వెళ్లి విచారణ చేయగా, అతనికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదు. అతను నిత్యం బేల్దారి పనికి వస్తుంటాడని, తనది కర్నూలు జిల్లాలోని నంద్యాల స్వస్థలమని చెప్పేవాడని మరో బేల్దారి చెప్పాడు. ఈ మేరకు మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. ఇతనికి సంబంధించిన బంధువులు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ మంజునాథరెడ్డి తెలిపారు. -
పీఎస్ఎల్వీ సీ 35 విజయంలో సూర్యాపేట వాసి
సూర్యాపేట : పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగం విజయవంతంలో సూర్యాపేట పట్టణానికి చెందిన శాస్త్రవేత్త చెరుకుపల్లి వెంకటరమణ కీలక భాగస్వామ్యంతో సూర్యాపేట ప్రతిష్ట అంబరాన్నింటింది. సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ35 కోసం పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన చెరుకుపల్లి లింగయ్య – సరోజినిల పెద్ద కుమారుడు వెంకటరమణ సహకారం అందించారు. మారిషస్ భూ కేంద్రంలోని రాకెట్ ట్రాకింగ్ ద్వారా ముఖ్యమైన డేటాను శ్రీహరికోటకు అందించారు. గతంలో పీఎస్ఎల్వీ సి30 ప్రయోగ సమయంలో కూడా అతడు అల్కాటారా నుంచి టెలియాస్–1 ఉపగ్రహ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య వెంకటరమణ సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల (నెం – 2)లో విద్యనభ్యసించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఈస్ట్ మారెడుపల్లిలో ట్రిపుల్ ఈ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అనంతరం లక్నోలోని అంతరిక్ష కేంద్రంలో 15 సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నారు. కాగా వెంకటరమణను రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో జిల్లా వాసి భాగస్వామి కావడం సంతోషించదగ్గ విషయమని మంత్రి అన్నారు. -
కమలాపురం ఎమ్మెల్యే సహా పలువురిపై అక్రమ కేసులు
వైఎస్సార్ జిల్లా: కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సహా 9 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. తన తండ్రిని కిడ్నాప్ చేశారంటూ.. రవీంద్రనాథ్ రెడ్డిని సొసైటీ సభ్యుడు వరపుత్రుని కుమారుడు వెంకటరమణ ఆశ్రయించాడు. కానీ, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ నేతలే తమ తండ్రి వరపుత్రుడిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కొడుకు వెంకటరమణతో టీడీపీ నాయకులు కేసు పెట్టించారు. ఆ కేసును వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
నాన్నా.. అమ్మ ఎక్కడికి వెళ్లింది!
తణుకు(పశ్చిమగోదావరి) : వారం రోజులుగా తమ ఇంటి ఆవరణలో పోలీసు బూట్ల చప్పుళ్లు.. ప్రముఖులు, రాజకీయ నాయకుల పరామర్శలు.. తనను చూసి అయ్యో పాపం అంటున్న ఇరుగు పొరుగు.. ఇదంతా ఆ మూడేళ్ల చిన్నారికి వింతగా ఉంది. తన తల్లి కొన్ని రోజులుగా ఎందుకు కనిపించడం లేదేంటి? తనను లాలించి గోరుముద్దలు తినిపించే అమ్మ ఏమైంది? ఇవే ఆ చిన్నారి ప్రశ్నలు. వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుమారుడు మూడేళ్ల కార్తీక్ మాత్రం అమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న కార్తీక్ తన తల్లిపై బెంగతో జ్వరం బారిన పడ్డాడు. అమ్మ ఊరెళ్లింది ఇదిగో వచ్చేస్తుంది అని నమ్మిస్తున్న కుటుంబ సభ్యులు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిందనే విషయం చెప్పలేక సతమతమవుతున్నారు. కేసు విచారణలో పోలీసులకు సహకరించేందుకు అతని తండ్రి నాగపవన్‌కుమార్ పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావటంతో ఇంటి దగ్గర ఉన్న నానమ్మ వెంకటరమణ ఆ చిన్నారిని సాకుతోంది. టీవీలో తన తల్లి కనిపించిన ప్రతిసారి అమ్మా అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ అమ్మ కావాలని మారాం చేస్తుండటం చూస్తున్న వారి కళ్లూ చెమర్చుతున్నాయి. -
దొంగతనం నేరం మోపి కొట్టి చంపారు..
పెంటపాడు(పశ్చిమగోదావరి): దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టటంతో ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం పట్టణానికి చెందిన దిరిశాల వెంకటరమణ(45) పెంటపాడులోని ఓ ఆయిల్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఇటీవల మిల్లులో సామగ్రి మాయమవుతుండటంతో వెంకటరమణనే దొంగిలించాడని అనుమానించారు. దీంతో తోటి కార్మికులు కొందరు అతనిని తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా అస్వస్థతకు గురైన అతడిని ఏలూరులోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బుధవారం సాయంత్రం చనిపోయాడు. కాగా, అతనికి మతిస్థిమితంగా లేదని స్థానికులు చెబుతున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
బంపర్ ఆఫర్..!
డోన్ : అర్టీసీ అధికారులు.. వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏకంగా మూడేళ్ల పాటు ఎలాంటి అద్దెలు లేకుండా ప్యాపిలి బస్టాండ్‌లో దుకాణాలను కేటాయించారు. ఇదే అదునుగా చేసుకొని మరి కొందరు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మూడేళ్లుగా సుమారు రూ.5 లక్షల వరకు ఆర్టీసీ నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్యాపిలి బస్టాండులో 15 దుకాణాలు ఉన్నాయి. ఇందులో బస్టాండ్‌లో ఉన్న రెండు దుకాణాలతోపాటు 14, 12, 10వ నంబర్ల షాపులు అద్దెలు చెల్లిస్తున్నాయి. ఇక మిగిలిన తొమ్మిది దుకాణాలు బస్టాండుకు ఎదురుగా ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డు ముఖానికి ఉన్నాయని, వ్యాపారాలు జరగడం లేదని తాము అద్దెలు చెల్లించలేమని వ్యాపారులు చెప్పడంతో ఆర్టీసీ అధికారులు గుడ్డిగా తల ఊపారు. అనధికార షాపులకు అధికారుల అండ: టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిలో ప్యాపిలికి చెందిన వెంకటేశ్వర్లకు 0.65 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ 18.07.2013న ఆదేశాలుజారీ చేశారు. అదే విధంగా వెంకటరమణకు, తిమ్మారెడ్డి అనే వ్యక్తికి కూడా దుకాణాలు కేటాయించారు. వీరు తమ సొంత ఆదాయం కోసం కేటాయించిన స్థలంలోనే మరిన్ని షాపులను నిర్మించి సబ్‌లీజుదారులకు ఇచ్చారు. నిబంధనలకు మేరకు సబ్‌లీజ్ ఇవ్వడం సరికాదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో 02.06.14వ తేదీన లెసైన్సు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా వెంకటరమణ, తిమ్మారెడ్డికి చెందిన షాపులను కూడా రద్దు చేశారు. దీంతో తమకు అన్యాయం జరిగిందని ఆయా దుకాణదారులు కోర్టును ఆశ్రయించడంతో వాటినన్నంటినీ సీజ్ చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అనధికార షాపులను నడుపుతున్నారు. వీటి నిర్వాహకులకు డోన్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అండ ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగి తన భార్యను పోస్టల్ ఆర్డీ ఏజెంటుగా నియమించుకొని.. వ్యాపారుల వద్ద నుంచి వేలకువేల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి ప్యాపిలి బస్టాండులో బినామీ పేరుతో ఒక దుకాణాన్ని దక్కించుకొని సబ్లీజుకు ఇచ్చాడు. ఆ దుకాణం లెసైన్సు రద్దు అయినప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక డిపో మేనేజర్ జయచంద్రను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.