Vikas Raj
-
మరికొన్ని గంటలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే. కంటోన్మెంట్ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 65.67శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు.. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక్కో హాల్లో 24 టేబుల్స్ ఉంటాయి. మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు. చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన.. ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు. పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్ లెక్కింపును ప్రారంభిస్తారు. అదే సమయంలో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు. ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్‌లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం ఆద్యంతం ఉత్కంఠగా కౌంటింగ్ కొనసాగనుంది. కౌంటింగ్, ఫలితాల సరళిని https://results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
ఎల్లుండే ‘లోక్‌సభ’ కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10వేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 4న జరిగే లోక్‌సభ ఓట్ల లెక్కింపుతోపాటు 2న జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని.. ఇందులో 50 శాతం సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. మూడంచెల భద్రత మధ్య ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఒక కౌంటింగ్ కేంద్రం ఉంటుందని.. ఒక కేంద్రంలో 24 టేబుల్స్ ఉంటాయని వికాస్‌రాజ్ తెలిపారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 28 టేబుల్స్ అవసరమవడంతో.. రెండు హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. ఇప్పటివరకు 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని.. ఇంకా ఈటీపీబీఎస్ (ఎ ల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం)లు వస్తున్నాయని, కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలలోపు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యపై కౌంటింగ్ రోజే స్పష్టత వస్తుందన్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులులోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లను) నియమించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. లెక్కింపు కోసం ఒక టేబుల్‌కు ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత మధ్య తరలిస్తామని.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుల అను మతి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారని.. కౌంటింగ్ హాల్లో, మీడియా సెంటర్ వద్ద ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తా మని తెలిపారు. ఆదివారం జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాం ఆవరణలో జరుగుతుందని వికాస్‌రాజ్ వెల్లడించారు. -
కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్: సీఈవో వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ అవుతాయన్నారు. తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని సీఈవో వెల్లడించారు.34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఈవో పేర్కొన్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది -వికాస్ రాజ్
-
TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లో నిక్షిప్తమైంది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచే వడివడిగా..: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. గడువు ముగిసే సమయానికల్లా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీనితో సాయంత్రం 7 గంటల తర్వాత కూడా సుమారు 1,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వికాస్‌రాజ్ వివరించారు. 115 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సమస్యలు వస్తే.. వాటిని మార్చామని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదన్నారు. వాతావరణం సహకరించడంతో.. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. దీనితో రోజంతా పోలింగ్ కొనసాగింది. ఉదయమే వడివడిగా ప్రారంభమై రోజంతా స్థిరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతం, 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం, సాయంత్రం 5 గంటలకల్లా 61.16 శాతానికి, రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతానికి పోలింగ్ పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్ నమోదైంది, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి గత లోక్‌సభ ఎన్నికలన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. వందల కొద్దీ ఫిర్యాదులు పోలింగ్ రోజైన సోమవారం నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్‌కు 415, టోల్ ఫ్రీ నంబర్‌కు 21, సీ–విజిల్ యాప్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ రోజు జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి 38 కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా కొన్ని ఫిర్యాదులపై పరిశీలన జరుగుతోందని, కేసుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉండదని.. ఈ క్రమంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసిన ఓ అభ్యర్థి (బీజేపీ అభ్యర్థి మాధవీలత)పై కేసు నమోదు చేశామని చెప్పారు. జహీరాబాద్, నిజామాబాద్‌లలో జరిగిన ఘటనపై సైతం కేసులు పెట్టామన్నారు. ఎన్నికలకు సంబంధించి మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.330 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో రెండో అంచె, స్థానిక పోలీసులతో మూడో అంచె బందోబస్తు నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలాగా పెట్టాలనుకుంటే.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని సవాల్ చేస్తూ 45రోజుల్లోగా కోర్టులో ఎలక్షన్ పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం. మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు! ఓటేసేందుకు హైదరాబాద్–సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు మళ్లీ బద్ధకించారు. రాత్రి 12 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల మేరకు.. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ స్థానం పరిధిలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత సికింద్రాబాద్ పరిధిలో 48.11 శాతం, మల్కాజ్గిరి పరిధిలో 50.12 శాతం, చేవెళ్ల పరిధిలో 55.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్ పరిధిలో 74.54 శాతం పోలింగ్ నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. దీనికితోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచడంతో.. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు. నేడు ‘పరిశీలకుల’ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీలు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సంబంధిత రిసెప్షన్ కేంద్రంలో అందజేస్తారు. అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రికి ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తారు. ఫారం–17సీ, ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఎన్నికల పరిశీలకుడు ఈ అంశాలను ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారులను పంపించివేస్తారు. ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. కొన్నిచోట్లలోని రిసెప్షన్ కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్‌లు ఉండగా.. మరికొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలా ఉన్న చోట కేంద్ర బలగాల భద్రత నడుమ జీపీఎస్ సదుపాయమున్న వాహనాల్లో ఈవీఎంలను తరలించి భద్రపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్ బృందాలు.. రిసెప్షన్ సెంటర్‌కు వచ్చి, అప్పగింత ప్రక్రియ పూర్తి చేసే సరికి.. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల వరకు పట్టే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాధారణ పరిశీలకులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, ప్రిసైడింగ్ అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులు, డైరీలను తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారిస్తారని వివరించారు. ఏదైనా ప్రాంతంలో రిపోలింగ్ అవసరం ఉంటే.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. -
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్‌రాజ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌పై మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.ఇక రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. -
ఇక మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడింది. గత నెల రోజులుగా హోరెత్తిన లౌడ్ స్పీకర్లు, మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ నెల 13న సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. శనివారం సాయంత్రం నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని, ఎక్కడా నలుగురుకి మించి గూమికూడి ఉండరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు.బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధంబల్క్ ఎస్ఎంఎస్లతో పాటు టీవీ చానళ్లు, రేడియో, ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రసారంపై నిషేధం అమల్లోకి వచ్చిందని వికాస్‌రాజ్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం వరకు వెల్లడించరాదన్నారు. శనివారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను వెల్లడించారు. సోమవారం జరగాల్సిన పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామన్నారు.ఎక్కడికక్కడ గట్టి నిఘాపోలింగ్కి ముందురోజు ఆదివారం రాత్రి వేళల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీని అడ్డుకోవడం తమకు కీలకమని, ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచామని, అన్ని ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.320 కోట్లు విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సీ–విజిల్ యాప్, ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో మొత్తం 8600 కేసులు నమోదు చేయగా, అందులో 293 కేసులు నగదుకి సంబంధించినవి, 449 కేసులు ఐపీసీ, 7800 కేసులు మద్యానికి సంబంధించినవి అని వివరించారు. పోస్టర్ బ్యాలెట్లో అభ్యర్థిని చూడాలి..ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం మినహా మిగిలిన 16 లోక్‌సభ స్థానాల పరిధిలో రెండు, లేదా మూడు బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లు గందరగోళానికి గురికావద్దని, పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శనకు ఉంచిన పోస్టర్ బ్యాలెట్లో తాము ఓటేయాల్సిన అభ్యర్థిని ముందే గుర్తించాలని వికాస్‌రాజ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.88లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని, వీరిలో 20,163 మంది ఇంటి వద్ద నుంచే ఓటేశారన్నారు. రాష్ట్రంలో తక్కువ పోలింగ్ జరిగే 5వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడి ప్రజలు ఓటేసేలా చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాలుండగా, అందులో 9900 సమస్యాత్మకమైనవి అని, అక్కడ కేంద్ర బలగాలు, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.సోమవారం ఉదయం 5.30 కి మాక్పోల్సోమవారం ఉదయం 5.30 గంటలకు పోలింగ్ కేంద్రంలో మాక్‌పోల్ నిర్వహిస్తారని, అభ్యర్థుల ఏజెంట్లు అందరూ అందుబాటులో ఉండాలని వికాస్‌రాజ్ సూచించారు. మాక్‌పోల్/పోలింగ్ నిర్వహించేటప్పుడు ఈవీఎంలు పనిచేయకపోతే సెక్టోరల్ అధికారులు వచ్చి మారుస్తారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో ఇద్దరు, ముగ్గురు ఈసీఐఎల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలకు పోలీసుల భద్రతతో పాటు వాటి కదలికలను జీపీఎస్ ద్వారా జిల్లా కలెక్టర్లు నిరంతరం సమీక్షిస్తారన్నారు.కచ్చితమైన పోలింగ్ శాతం తెలిసేది మరుసటి రోజే..పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి అంచనా పోలింగ్ శాతాన్ని అందిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసాక సాయంత్రం 6 గంటలకు మొత్తం పోలింగ్ శాతంపై తొలి అంచనాను, రాత్రి అయ్యాక సవరించిన అంచనాలను ప్రకటిస్తామన్నారు. మరుసటి రోజు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడిస్తామన్నారు.విద్వేష ప్రసంగాలపై దాటవేత ధోరణి..ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర బీజేపీ నేతలు విద్వేష ప్రసంగాలు చేశారని, ప్రచారంలో చిన్నపిల్లలను వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు వికాస్‌రాజ్ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ప్రత్యేకంగా ఒక్కో ఫిర్యాదు విషయంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం తన వద్ద ఇప్పుడు లేదన్నారు. రాజకీయ పార్టీల నుంచి మొత్తం 92 ఫిర్యాలొచ్చాయని, ఇద్దరు వ్యక్తులపై ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఫిర్యాదుల విషయంలో రాజకీయ పార్టీలకు నోటిసులు జారీ చేశామని, వివరణ కోసం వారు మరికొంత సమయం కోరినట్టు తెలిపారు.లోక్‌సభ ఎన్నికల్లో వాడనున్న ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు – 84,577+ 20వేలు రిజర్వ్కంట్రోల్ యూనిట్లు – 35,809+ 10వేల రిజర్వ్వీవీప్యాట్స్ – 35,809 + 15వేలు రిజర్వ్పోలీసుల బందోబస్తుకేంద్ర బలగాలు –160 కంపెనీలుపొరుగు రాష్ట్రాల నుంచి హోంగార్డులు, ఇతర బలగాలు– 20వేల మందిరాష్ట్ర పోలీసులు 60వేల మందిఇతర రాష్ట్ర యూనిఫార్మ్ సర్వీసుల సిబ్బంది– 12 వేల మంది -
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు (మే13)న అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని తెలిపారు.బందోబస్తు కోసం కేంద్ర బలగాలతో పాటు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని వికాస్‌రాజ్ వెల్లడించారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశామని, తనిఖీలకు సంబంధించి 8 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న సీఈవో వికాస్‌రాజ్.. పోలింగ్ సమయం దగ్గర పడటంతో నిఘా మరింత పెంచామని తెలిపారు. -
11న సాయంత్రం 5 నుంచి మద్యం బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు.. అంటే ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించిన నేపథ్యంలో ఆ మేరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని సైతం పొడిగించాలని అబ్కారీ శాఖను ఆదేశించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో.. ఆ రోజు సైతం మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డ్రైడే అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
సెలవుల్లోనే రోడ్‌షోలు: సీఈఓ వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే రోడ్‌షోలకు సెలవు రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే వేళల్లో నిర్వహించేందుకు మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో రోడ్‌షోలపై నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో అనుమతి ఇవ్వబోమన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్ సెంటర్లు, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో కూడా రోడ్‌షోలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సోమవారం తన కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వికాస్‌రాజ్ మీడియాకు వివరించారు. రెండున్నరేళ్లలో 30 లక్షల ఓట్లు తొలగింపు గత డిసెంబర్లో రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో 12 లక్షల కొత్త ఓటర్లు నమోదవగా.. 8,58,491 ఓటర్లను తొలగించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 30లక్షల ఓట్లను తొలగించామన్నారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో బోగస్ ఓట్లున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ నిర్వహించారని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోగస్ ఓట్ల తొలగింపు నిరంతర ప్రక్రియగా జరుగుతోందన్నారు. ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త ఓటరుగా నమోదు కోసం ఏప్రిల్ 15లోగా ఫారం–6 దరఖాస్తు చేసుకున్న వారందరికీ లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాకే ఓటర్ల చిరునామా మార్పు(ఫారం–8), తప్పుల దిద్దుబాటు(ఫారం–7) దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈసారి 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచి ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. లెక్కలు చూపకుంటే స్వాధీనం.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సరైన లెక్కలు లేకుండా రూ.50వేలకు మించిన నగదు తీసుకెళ్లరాదని వికాస్‌రాజ్ సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిననాటి నుంచి ఇప్పటివరకు రూ.243 కోట్లు విలువైన నగదు/సరుకులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. మార్చి 1 నుంచి ఆదివారం వరకు రూ.21.63 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇటీవల నామినేటెడ్ పదవుల్లో నియామకమైన చైర్పర్సన్లు పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చా? అనే అంశంపై నిబంధనలను పరిశీలించాక తెలియజేస్తామన్నారు. ఈ–పేపర్లకు ఇచ్చే ప్రకటనలకు సైతం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సర్టిఫికేషన్ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పలు గణాంకాలను విడుదల చేశారు. -
రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదు: CEO వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో సీఈఓ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోసం లక్షా 80 వేల సిబ్బంది అవసరమని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8,58,491 ఓట్లు తొలగించామని అన్నారు. పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారన్నారు. ke\\రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉంటే.. 8 లక్షల కొత్త యువ ఓటర్లు ఉన్నారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ తరువాత రోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ ఓటింగ్ కొత్త సాప్ట్ వేర్ ద్వారా ఈసారి నిర్వహిస్తున్నాం. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయింది. EVM లు సిద్ధంగా ఉన్నాయి. రిజర్వ్ కూడా ఉంచాం. 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్స్ ఉండాలి లేదంటే సీజ్ చేస్తారు. ఫిర్యాదులు c - విజిల్ app లేదా 1950కి ఫిర్యాదు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్ ద్వారా తీసుకోవాలి. 7 లక్షల ఓటర్ కరెక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నికల తరువాత చేశాంము. చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి. రోడ్ షో లు సెలవు రోజుల్లోనే.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షో లకు అనుమతి లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి లేదు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్‌లకు అనుమతి లేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాసెస్ జరుగుతోంది...షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. -
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం: వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్ చేశారు. కాగా, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం. జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్ విజయవంతంగా నిర్వహించాం. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు. -
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజ్ భవన్ కు వికాస్ రాజ్
-
నిధులు మళ్లిస్తున్నారు.. భూములు మార్చుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కింద పంపిణీ చేయాల్సిన నిధులను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని, హైదరాబాద్ శివారు జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జి.నిరంజన్, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కర వేణుగోపాల్, రోహిణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుబంధు నిధుల పంపిణీ ఆగిపోయిందని, ఈ నేపథ్యంలో ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేల కోట్లను తమకు ఇష్టమైన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ వినతిపత్రంలో తెలిపారు. అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూముల హక్కు రికార్డులను ధరణి పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల బినామీల పేరిట మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాల్లో సరైన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా కట్టడి చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు. నాలుగు అంశాలపై వినతిపత్రం ఇచ్చాం: ఉత్తమ్ సీఈవో వికాస్‌రాజ్‌ను కలసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు నిధుల మళ్లింపు, అసైన్డ్ భూముల రికార్డుల మార్పిడికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని సీఈఓకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. అలాగే తమ పార్టీ నుంచి గెలిచే వారి ఎలక్షన్ సర్టిఫికెట్లను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరామని తెలిపారు. పాతబస్తీలో రిగ్గింగ్ జరిగిందని, దీనికి సంబంధించి సీసీటీవీ రికార్డులున్నాయని, ఈ రికార్డుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని వెల్లడించా రు. ఈనెల 4వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయంపై స్పందిస్తూ, కేబినెట్ ఎందుకు పెడుతున్నారో తమకు తెలియదని, రాజీనామాను ఇచ్చేందుకు ఈ సమావేశం నిర్వహించి ఉండవచ్చని, విషయం తెలియకుండా మాట్లాడలేమని ఉత్తమ్ చెప్పారు. -
బీఆర్ఎస్పై విజిలెన్స్ నిఘా? ఈసీకి ఫిర్యాదు
-
రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడంతోనే సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్న ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో దాదాపు అన్ని పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. శుక్రవారం వికాస్‌రాజ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా చోట్ల సాయంత్రం 5 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా.. అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడిన వారందరికీ నిబంధనల ప్రకారం ఓటేసే అవకా శం కల్పించామని వికాస్‌రాజ్ వివరించారు. అందువల్ల ఆయాచోట్ల రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ జరిగిందని, అధికారులు ఈవీఎంలు, ఇత ర సామగ్రిని సర్దుకుని రిసెప్షన్ కేంద్రాలకు చేరు కునే సరికి మరింత ఆలస్యమైందని చెప్పారు. రిసె ప్షన్ కేంద్రాల్లో ఈవీఎంలకు ప్రాథమిక తనిఖీలు నిర్వహించి, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. ప్రాథమిక స్రూ్కటినీ తర్వాతే 70.6 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రాథమి కంగా అంచనాకు వచ్చామని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు కూర్చుని అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తుది స్రూ్కటినీ నిర్వహిస్తున్నారని వివరించారు. చాంద్రాయణగుట్ట సహా ఇతర స్థానాల్లో రిగ్గింగ్ జరిగినట్టు వచ్చిన ఫిర్యా దుల మేరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. స్క్రూటి నీ ముగిశాకే కచ్చితమైన పోలింగ్ శాతంతోపాటు రిగ్గింగ్ ఆరోపణల్లో నిజానిజాల పై స్పష్టత వస్తుందని.. ఆయా అంశాల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ప్రశాంతంగా పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్‌రాజ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలన్నీ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నట్టుగా ధ్రువీకరించుకున్నామ ని వివరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు.158పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆయాచోట్ల కొత్త ఈవీఎంలను పెట్టి పోలింగ్ నిర్వహించామని.. దీనివల్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 45 నిమిషాల వరకు ఆలస్యమైందని అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్ వివరించారు. నాగార్జున సాగర్ అంశానికి ఎన్నికలతో సంబంధం లేదు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సగభాగాన్ని ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న ఘటనకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. డీప్ ఫేక్, ఇతర తప్పుడు ప్రచారాల ఆరోపణలపై సోషల్ మీడియాలోని 120 లింక్‌లను తొలగించామన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై విశ్లేషణ జరుపుతామన్నారు. డబ్బులు పంచుతూ కొందరు అభ్యర్థులు, వారి బంధువులు పట్టుబడిన ఘటనలపై స్పందిస్తూ.. రాష్ట్ర మంత్రులపై కేసులు నమోదయ్యాయని, రికార్డు స్థాయిలో 13వేలకుపైగా కేసులు పెట్టామని వికాస్‌రాజ్ వివరించారు. భారీగా పెరిగిన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని వికాస్‌రాజ్ తెలిపారు. 16,005 మంది 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు, 9,459 మంది దివ్యాంగ ఓటర్లు, 1.80 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ రిజర్వ్డ్ బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. 500కుపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 14+14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. మిగతా స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. 119 స్థానాలకు సంబంధించి 1,766 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయని.. వీటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ ఉంటాయని వివరించారు. ఉదయం 10.30 కల్లా లీడ్‌పై స్పష్టత కౌంటింగ్‌లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తర్వాత ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని వికాస్‌రాజ్ తెలిపారు. ఒకవేళ పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడితే.. సమాంతరంగా ఈవీఎం ఓట్ల లెక్కింపూ మొదలవుతుందన్నారు. ఉదయం 10.30 గంటలకల్లా కౌంటింగ్‌లో ముందంజలో ఉన్న అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని వికాస్‌రాజ్ అంచనా వేశారు. కొన్ని స్థానాల్లో అధిక పోలింగ్ జరగడం, చాలాచోట్లలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్ 70.66 శాతం'!
గడప దాటని సిటీ చెంతనే పోలింగ్ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు. క్రితంసారితో పోలిస్తే 5% పోలింగ్ తగ్గింది. పట్నమిలా..హైదరాబాద్ భరత్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రం 16 కి.మీ. నడిచొచ్చి.. ఓటేసి వీరంతా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలు ఆదివాసీలు. మూడు గుట్టలు ఎక్కి దిగి, మధ్యలో మూడు వాగులు దాటి 16 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గోడు పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలనే ఇంతదూరం నడిచి వచ్చామని చెప్పారు. – వాజేడు పల్లె ఇలా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. గురువారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 70.66 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శుక్రవారం ప్రకటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోలింగ్‌లో కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నారు. అత్యధికంగా జనగామలో.. గురువారం సాయంత్రానికల్లా అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకూత్‌పురలో 39.69 శాతం, మలక్‌పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్‌లో 43.26 శాతం పోలింగ్ నమోదైంది. ► జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్‌లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతమే ఓట్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 106 చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమ యానికల్లా.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు పో లింగ్ సాగింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాలపై శుక్రవారం ఉదయమే స్పష్ట త వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పలుచోట్ల ఆలస్యంగా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలుకావాలి. అ యితే పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రాలు మొరాయించడంతో గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి? ఎన్నింటిని రిప్లేస్ చేశారన్న అంశంపై సీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేయలేదు. ఉదయమే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీనితో వడివడిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం కొంత మందగించినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం, 11 గంటల వరకు 20.64 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. రాత్రి వరకు పలుచోట్ల ఓటింగ్ కొనసాగిన నేపథ్యంలో ఆ లెక్క లన్నీ క్రోడీకరించాల్సి ఉంది. దీనితో ఓటింగ్ శాతం పెరగనుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. తగ్గిన ఓట్ల గల్లంతు ఫిర్యాదులు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో లక్షల ఓట్లు తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. వివరాలు వెల్లడించని ఎన్నికల ప్రధానాధికారి శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) విలేకరుల సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. అంతేకాదు.. పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవారు. అయితే సీఈఓ వికాస్‌రాజ్ గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సీఈఓ కార్యాలయం ప్రజాసంబంధాల విభాగం అధికారులను సంప్రదించారు. పోలింగ్ తీరుపై విలేకరుల సమావేశం నిర్వహించాలని కోరారు. కానీ సీఈఓ వికాస్‌రాజ్ అంగీకరించలేదని అధికారులు బదులిచ్చారు. కేవలం పోలింగ్ శాతంపై ప్రాథమిక అంచనాలు మినహా ఎలాంటి ఎలాంటి సమాచారాన్ని సీఈఓ కార్యాలయం వెల్లడించలేదు. ఈవీఎంల తరలింపుపై ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయినగూడెంలో అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అయితే ఖాళీ ఈవీఎంలను కారులో తరలిస్తున్న సెక్టోరియల్ అధికారిని అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటింటికీ ఓటింగ్‌కు భారీ స్పందన: సీఈసీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కలిపి 25,400 మంది తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలిసారి కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు సది్వనియోగం చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. బందోబస్తుతో ప్రశాంతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షించడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగి, ఉద్రిక్తత నెలకొన్నా అక్కడి పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి 45వేల మంది పోలీసు సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 23,500 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కూంబింగ్, ఏరియా డామినేషన్ సెర్చ్ చేపట్టారు. ఓటెత్తని హైదరాబాద్! సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ఎప్పటిలాగే హైదరాబాద్ జనం ఓటు వేసేందుకు తరలివెళ్లలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం, వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. జిల్లాల్లో ఓటింగ్ తీరు ఇదీ.. ఉమ్మడి ఆదిలాబాద్.. గిరిజన ప్రాంతాల్లో ధాటిగా ఓటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి తదితర స్థానాల్లో పలుచోట్ల రాత్రిదాకా ఓటింగ్ జరిగింది. కాగజ్‌నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అదుపు చేసే క్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్, మరికొందరికి గాయాలయ్యాయి. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ప్రవీణ్‌కుమార్ రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా వరిపేట, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కొత్తపల్లిలలో ప్రజలు తమ సమస్యలు తీర్చలేదంటూ నిరసన వ్యక్తం చేయగా.. అధికారులు నచ్చజెప్పడంతో ఓటేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్తులు.. తమ ఊరిగి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఓటు వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడి ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం.. గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గాల్లో పలుచోట్ల రాత్రి 8వరకు కూడా పోలింగ్ జరిగింది. కొత్తగూడెం రూరల్, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం ఓట్లు వేశారు. కూసుమంచి, ఎర్రుపాలెం, తల్లాడ, బోనకల్, కొనిజర్ల, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, మణుగూరు, పినపాక మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం రూ రల్ మండలంలోని గోళ్లపాడులో ఏనుగు సీతారాంరెడ్డి(75) ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఉమ్మడి రంగారెడ్డి.. బాగా తగ్గిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌శాతం తగ్గింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో, మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ.. పలుచోట్ల లాఠీచార్జి నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల లాఠీచార్జిలు, చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆలేరు మండలం కొలనుపాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈసమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రాళ్లు రువ్వడంతో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. హుజూర్నగర్లోనూ గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని పోలీసులు ఆపడంతో వాగ్వాదం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు టెండర్ ఓట్లు వేశారు. ఉమ్మడి కరీంనగర్.. డబ్బుల కోసం నిరసనలతో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా అవాంఛనీయ ఘటన లు జరగలేదు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారని పోలీసులకు ఫిర్యా దు అందింది. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గులాబీ చొక్కా ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటూ మొగిలిపాలెం, గన్నేరువరం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ లం గంగారంలో అధికార పార్టీ అభ్యర్థి పంచిన డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా లింగంపేటలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకుడి ఇంటి వద్ద మహిళా గ్రూపు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్.. ప్రశాంతంగా పోలింగ్.. పాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరంలో డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్–బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్.. మందకొడిగా మొదలై.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలుచోట్ల రాత్రిదాకా ఓటర్లు క్యూలలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలుచోట్ల గుమిగూడిన పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని నాన్‌లోకల్ అంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్.. బీఆర్ఎస్–కాంగ్రెస్ జగడం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల తమ గ్రామాలను అభివృద్ధి చేయలేదంటూ జనం రాకపోవడంతో ఓటింగ్ జరగలేదు. దంతాలపల్లి బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంగపేటలో బీఆర్ఎస్ నేత మాజీ జెడ్పీటీసీ వైకుంఠం ఓట్లకు డబ్బులిస్తానని మోసం చేశారంటూ పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఓ పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, కోడలు దివ్యల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్‌పేట పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉమ్మడి మెదక్.. స్వల్ప ఘర్షణల మధ్య.. మెదక్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పటాన్చెరులో మూడుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి పటాన్‌చెరుటౌన్/కైలాస్‌నగర్: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్ (43) కొండాపూర్‌లో వెటర్నరీ విభాగంలో సహాయకునిగా పని చే స్తున్నారు. బుధవారం పటాన్చెరు మండలం ఇస్నా పూర్ గ్రామం (248) పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సీపీఆర్ చేసి ప టాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. ఓటు వేయడానికి వచ్చి మృతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) ఓటు వేసేందుకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. క్యూలో నిల్చున్న సమయంలో కళ్లు తిరిగి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. -
ప్రస్తుతానికి ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది: CEO
-
హైదరాబాద్‌లో మందకొడిగా పోలింగ్.. సీఈవో వికాస్‌రాజ్ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్పల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్యంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, సినీతారలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఓటేసేందుకు ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు ఇక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం నమోదు అయ్యింది. మహబూబ్‌నగర్‌లో 45 శాతం, కరీంనగర్ 40.73, ఆదిలాబాద్ 41.88, గద్వాల్ 49.29, ఖమ్మం 42 శాతం, మంచిర్యాల 42.74 శాతం, మహబూబాబాద్ 48 శాతం, కామారెడ్డి 41 శాతం పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్‌లో అత్యల్పంగా కేవలం 20.79 శాతం పోలింగ్ నమోదవడం ఓటింగ్‌పై నగర ఓటర్ నిరాసక్తతను వెల్లడిస్తోంది. ఓటింగ్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయని వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. చదవండి: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్డేట్స్ -
రేవంత్ రెడ్డి సోదరుడి మీద కంప్లైంట్ రిసీవ్
-
కుటుంబ సమేతంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్న సీఈవో వికాస్ రాజ్
-
ఆ వాహనాలకు GPSలు
-
నేడూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విధుల్లో నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి తమ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదిస్తే, వారికి మంగళవారం కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సదరు ఉద్యోగి పేరుతో ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ జారీ కాలేదని ధ్రువీకరించుకున్న తర్వాత వారికి పోస్టల్ బ్యాలెట్ అందజేసి, ఓట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటేసేందుకు అనుమతించాలని సీఈఓ తెలిపారు. ఒకవేళ ఉద్యోగి పేరుతో అప్పటికే పోస్టల్ బ్యాలెట్ జారీ అయితే మళ్లీ కొత్త పోస్టల్ బ్యాలెట్ జారీ చేయరాదని స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఏ జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారికి చేరిందో తెలియజేయాలని సూచించారు. ఉద్యోగిని ఎన్నికల విధుల కోసం అదే జిల్లాకు కేటాయించినా, ఇతర జిల్లాకు కేటాయించినా ఈ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్ ఓటు వేసేందుకు డ్యూటీ ఆర్డర్ కాపీతో తమ ఓటు ఉన్న నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని కలవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయమై ఉద్యోగ సంఘాలు పలుమార్లు సీఈఓకు విన్నవించాయి. బండి సంజయ్ కూడా ఈసీకి లేఖ రాశారు. -
తెలంగాణ ఎన్నికలు.. సీఈవో వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్‌రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్. కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙ 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.