welfare programs
-
జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
పేదరికం అత్యంత బాధాక రమైనది. ప్రపంచంలో అత్యధి కులు పేదవారే. వారిని పేద రికం నుండి బయట పడేయ గలదీ, అభివృద్ధి వైపు నడప గలిగేదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. దీనిని అర్థం చేసుకొన్నారు కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. ఇప్పుడు మరోమారు ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల బరిలో దిగారు. పలు పబ్లిక్ మీటింగులూ, సుదీర్ఘ రాజకీయ యాత్రలతో విజయం వైపు నడుస్తున్నారు.ఇక ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మాత్రం అభద్రతా భావంతో ఎన్నికల్లో నానా తిప్పలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ప్రజలకు తాను చేసింది ఏమీ లేదు కాబట్టి జగన్ ప్రభుత్వంపై దుష్ప్ర చారాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. జనసేన – బీజేపీ నాయకులూ, ఆ యా పార్టీల పరిస్థితీ కూడా ఇదే. అందుకే, టీడీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా మరలా ఓడిపోవడం తథ్యం. పెన్షనర్లలో 90 శాతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతున్న 40–60 ఏళ్ల వయస్సు స్త్రీలలో 90 శాతం, డ్వాక్రా మహిళల్లో 80 శాతం, మొత్తంగా స్త్రీలలో 90 శాతం వైఎస్సార్సీపీకే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, రెడ్లు, బ్రాహ్మణులు, అత్యధిక మంది బీసీలు వైఎస్సార్సీపీకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కొంతమంది మధ్యతరగతి అర్బన్ ఓటర్లు మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేస్తారని అంటున్నారు. కాంగ్రెస్‌కు గతం కంటే అర శాతం మాత్రమే ఓట్లు పెరగవవచ్చు.అయోధ్యలో గుడి నిర్మాణం, కొన్ని జాతీయ రహదారులను నిర్మించడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏపీకి సంబంధించి... ఏపీకి స్పెషల్ స్టేటస్, రాయలసీమ – ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, పోల వరానికి ని«ధులు వంటి అనేక వాగ్దానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు. ఇదీ బీజేపీ క్రెడిబిలిటీ!జVýæన్ మాత్రం పేదల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. పేదల కొనుగోలు శక్తిని కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా పెంచగలిగారు. అందుకే 2019లో 12 శాతం ఉన్న పేదరికం 2024 నాటికి దాదాపు 4 శాతానికి తగ్గిపోయింది. జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు జగన్. జగన్ ప్రభుత్వం పేదలకు డీబీటీ కింద రూ. 2,70,000 కోట్లను, నాన్–డీబీటీ కింద ఇండ్లు, స్థలాలు వంటి రూపాల్లో రూ. 1,00,000 కోట్లకు పైగా ఇచ్చారు. మొత్తంగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అంతేగాక పాలనా వ్యవస్థలో, సంక్షేమ సేవల్లో, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేట్లు చేశారు వైఎస్ జగన్. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆరోగ్య శ్రీకి రూ. 25 లక్షల వరకూ ప్రభుత్వ సాయాన్ని పెంచడం, వృద్ధాప్య పింఛన్‌ను రూ. 3 వేల వరకు పెంచడం, స్త్రీ సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం; రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లోనూ... మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం; వలంటీర్ వ్యవస్థ, రైతుభరోసా, ఉచిత పంటల భీమా, ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్, అమూల్ ద్వారా ఎక్కువ పాల ధర ఇవ్వడం, భూముల సర్వే, భూపట్టాల ధ్రువీకరణ, నాడు – నేడుతో పాఠశాలల రూపు మార్చడం, ఇంగ్లీష్ మీడియం విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా కానుక... ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను జగన్ దోచుకున్నారు.మరి చంద్రబాబు ఇలాంటి వేటినీ చేపట్టలేదు. ఇలాంటివి ఏ ఒక్కటీ చేశానని ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికలప్పుడూ పలు పథకాల్ని ప్రకటించడం, ఎన్నికలు అయిపోయాక వాటి అమలు మరచిపోవడం చేసేవారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల విషయంలో మాట్లాడ కూడని మాటలు మాట్లాడేవారు. అందుకే ఆయన జనంతో సంబంధాల్ని మానసికంగా కోల్పోయారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయక పోవడం, పొదుపు సంఘాలకు రుణమాఫీ అమలు పరచక పోవడం, కొత్తగా జన్మించిన ఆడబిడ్డకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఇస్తానన్న డబ్బు ఇవ్వక పోవడం, ఇంటింటికీ ఒక ఉద్యోగం – ఉద్యోగం ఇవ్వలేకుంటే నెలకు రూ. 2 వేలు ఇస్తానని ఇవ్వక పోవడం; పేదలకు మూడు సెంట్ల నేల, ఇల్లు, బీసీలకు సబ్ ప్లాన్, స్త్రీ రక్షణ ఫోర్స్ ఏర్పాటు, పసుపు–కుంకుమ పథకం లాంటి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసగించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారీకరణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు ఎన్నో!బాబు ఘోర వైఫల్యం చెందిన అనంతరం పరి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేశారు. అందుకే తాను ఏదైనా మేలు చేశానని నమ్మితేనే తనకు ఓటు వేయమని ఆయన ధైర్యంగా ప్రజలను అడుగు తున్నారు.ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర శాఖవిశ్రాంత ఆచార్యులు ‘ 98495 84324 -
ఏపీ: ఊరిస్తున్న ఊరు
సాక్షి, అమరావతి: గ్రామంలోకి అడుగు పెట్టగానే కనిపించే సచివాలయాలు.. మరో నాలుగు అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో సందడిగా ఆర్బీకేలు.. అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్.. ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాలలు.. ఆ పక్కనే అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు.. సంతృప్త స్థాయిలో సేవలు అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్.. ప్రతి గ్రామంలో పది మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు.. వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో జీవనోపాధులు పొందుతూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు.. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్తగా పల్లెసీమల ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. రాష్ట్రంలో వికేంద్రీకరణతో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. గతంలో కూలిపోయే దశలో ఉన్న సర్కారు స్కూళ్ల భవనాలు మినహా ఇతర ప్రభుత్వ భవనాలేవీ కానరాని దుస్థితి నుంచి అన్ని సదుపాయాలతో సర్వ సేవలు అందించేలా పలు కార్యాలయాలు గ్రామాల్లోనే నిర్మితమవుతున్నాయి. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఏ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులైనా గ్రామాల నుంచే పని చేసుకోవచ్చు. ► ఇప్పుడు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. బంధువులను చూడడానికి మాత్రమే ఇప్పుడు పొరుగూళ్లకు వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ప్రజలకు పథకాలు, సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితిని, వ్యయ ప్రయాసలను సమూలంగా తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే సచివాయాల ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా సేవలు అందేలా వ్యవస్థను రూపొందించారు. లంచాల బెడద లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దే టంఛన్‌గా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందచేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సైతం 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఏదో మహమ్మారి జబ్బులైతే మినహా సాధారణ రోగాల చికిత్స కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హెల్త్ క్లినిక్‌లలో ఉచితంగా వైద్య సేవలను అందజేస్తోంది. రక్త పరీక్షలు అక్కడే నిర్వహిస్తూ అవసరమైన మందులూ ఉచితంగా ఇస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్‌లో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ► ఐదేళ్ల క్రితం వరకు గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను మినహాయిస్తే మరే ప్రభుత్వ కార్యాలయాలు లేని పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటిన 2019కి ముందు వరకు దాదాపు 3 వేల పంచాయతీలలో కనీసం కార్యాలయం భవనాలు కూడా లేవని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇరుకు గది, చిన్న హాలు మినహా మరే వసతులు ఉండవు. కార్యదర్శుల కొరతతో అవి నెలల తరబడి మూసివేసి ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసింది. ఇప్పటికే 7,144 భవనాల నిర్మాణం పూర్తి కాగా మరో 1,888 భవనాలు నెల రోజుల్లో పూర్తి అయ్యే దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల పంటలకు సంబంధించిన మాగ్యజైన్లు ఉంటాయి. రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి సమావేశాలకు వీలుగా స్మార్ట్ టీవీలు, వివిధ పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకునే డిజిటల్ కియోస్క్‌లు, తేమ కొలిచే యంత్రాలు, విత్తన పరీక్ష పనిముట్లు, భూసార పరీక్ష కిట్లు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ► గతంలో విత్తనాలు కావాలన్నా ఎరువులు అవసరమైనా వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. పంటలను చీడపీడలు ఆశిస్తే వ్యవసాయ అధికారి సలహా కోసం కార్యాలయం వద్ద ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. ఇప్పుడు అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామంలోనే అందిస్తోంది. కాల్ సెంటర్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను చేరువ చేసింది. రైతులకు సేవలు అందించేందుకు ఒక్కో ఊరిలో రూ.23.94 లక్షలు ఖర్చు పెట్టి 1,360 చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. పశువైద్య సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2446 కోట్లతో 10,216 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ► గ్రామాల్లో ప్రజలకు కనీస వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్కటి రూ.17.50 లక్షల వ్యయంతో 1,185 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెల్త్ క్లినిక్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేసింది. వీటిలో 3,388 నిర్మాణం పూర్తి కాగా మరో 1705 ఒకట్రెండు నెలల్లో పూర్తయ్యే దశలో ఉన్నాయి. విలేజీ హెల్త్ కిన్లిక్లలో 14 రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలన్నింటినీ ప్రభుత్వం అందించింది. డెంగ్యూ, మలేరియా సహా హెచ్ఐవీ, సిఫిలిస్ లాంటి వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను అన్ని హెల్త్ క్లినిక్‌లోనూ అందుబాటులో ఉంచింది. వీటికి తోడు ప్రతి హెల్త్ క్లినిక్‌లో 105 రకాల మందులు సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచింది. ► నాడు – నేడు ద్వారా రూ.11,000 కోట్ల ఖర్చుతో 38,059 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సూళ్లకు ధీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. రూ.612 కోట్లు ఖర్చు చేసి ప్రహరీ గోడలను నిర్మించింది. డిజిటల్ ల్రైబరీలను కూడా నిర్మిస్తోంది. ► ప్రభుత్వం కేవలం కార్యాలయాల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిల్లో అన్ని మౌలిక వసతులను కల్పించింది. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు కంప్యూటర్లు, యూపీఎస్, ప్రింటర్లను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లుతో పాటు 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపిణీ చేసింది. వలంటీర్లతోపాటు సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించేందుకు 2,91,590 స్మార్ట్ ఫోన్లను, సిమ్ కార్డులను అందజేసింది. ► 2020లో పలు భవన నిర్మాణాలకు అనుమతులు లభించగా వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా నిర్మాణ పనులను స్తంభించాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 16,081 భవన నిర్మాణాలు పూర్తి కాగా మరో 5095 భవనాలు నెల నుంచి నెలన్నర లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్మాణాలు జరుగుతున్న చోట్ల అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇరుకైన పంచాయతీ భవనాలు మినహా రైతులకు, ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయాలు లేకపోవడం గమనార్హం. ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు సాధికారత బాట పట్టారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి పశువులు కొనుగోలు చేశారు. ఆసరా, చేయూత ద్వారా కిరాణా షాప్‌లు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. ఆమూల్, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి దిగ్గజ కంపెనీలతో అనుసంధానించి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. నాలుగు నెలల్లో నియామకాలు.. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. ఇది ఒక రికార్డు కాగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. ఈ స్థాయిలో లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నాడు ఉద్యోగాలు సాధించిన ఎంతోమంది సచివాలయాల ఉద్యోగులు ఈ నాలుగేళ్ల కాలంలో పదోన్నతులు కూడా పొందారు. టీచర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగులు లేని గ్రామాల్లో నేడు సచివాలయాల ద్వారా పది మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు సేవలందిస్తున్నారు. -
ప్రవాసీయుల సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్!
సౌదీలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మొత్తం భారతదేశంలోకెల్లా ఎక్కువగా ప్రవాసీయుల సంక్షేమానికి వైఎస్ జగన్ సర్కారే పెద్ద పీఠం వేస్తుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పెర్కోన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా భీమా పథకం విజయవంతంగా అమలవుతుందని తద్వారా అకాల మరణం పాలైన అనేక మంది ఆభాగ్యులకు ఆపన్నహస్తం లభిస్తుందని ఆయన అన్నారు. మక్కా యాత్రకు వచ్చిన అంజద్ బాషా జెద్ధాలో తనను కలిసిన ప్రవాసీయులను, సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) ప్రతినిధులతో మాట్లాడుతూ.. దేశంలో ఆదర్శవంతంగా ప్రచారంలో ఉన్న కేరళ రాష్ట్రం కంటె కూడ మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలోని ఏపీ ఎన్నార్టీ సంస్ధ పని చేస్తుందని అన్నారు. కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలలో ఏపీ ఎన్నార్టీ సంస్ధ చురుక్కుగా ఉందని ఆయన అన్నారు. విదేశాలలో తెలుగు వారందరు కలిసి మెలిసి ఉండాలని, ఇక్కడ కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగుతనంతో కలుపుకోలుగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కుల,మత, ప్రాంతీయ విబేధాలకు అతీతంగా ఇక్కడ తెలుగువారు కలిసిఉండి, భారతీయ ప్రతిష్ఠను పెంపొందించాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో సాటా పని తీరును వివరించగా ఆయన వారిని అభినందించారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శివ సైమన్ పీటర్, రాంబాబు, శాంతి, శ్రీమతి నాగరాజు, ఫైజ్, ఖాదర్ వలీలు ఉన్నారు. తన పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి సౌదీలోని దక్షిణ ప్రాంతంలోని ఆభాలో సాటా అధ్వర్యంలో జరిగిన భారతీయ సమ్మేళాన్ని కూడా వీడియో కాల్ ద్వారా సంబోధించారు. (చదవండి: యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీ నియామకం) -
తప్పిన దారిని సరిచేయడం ఎక్కడ మొదలు పెట్టాలి?
అశోకుడు నాటిన చెట్లు చిన్నతనంలో సాంఘిక శాస్త్రంలో ‘అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించెను’ అని చదివేవాళ్ళం. అది నిజమేకానీ, అశోకుడు నాటించింది చెట్లు కాదు– మొక్కలు. ‘లీడర్’ కేవలం ‘పొలిటీషియన్’ మాత్రమే కాకుండా – ‘స్టేట్స్ మేన్’ కూడా అయితే, అతడి ఆలోచనలు ఇలా రాబోయే తరాల కోసం ఉంటాయి. ఏపీ రెండవ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే 26 జిల్లాల్లో పట్టణాలు–గ్రామా లకు విస్తరిస్తున్నాయి. అభివృద్ధి అంటే.. అభివృద్ధి అన్నప్పుడు... ఇది సముద్రతీర రాష్ట్రం కనుక, క్రమంగా ‘కాస్మోపాలి టిన్’గా మారుతున్న మన జీవనశైలి వైపు ‘రాజ్యం’ ప్రత్యేక నిఘా దృష్టి కనుక పెట్టకపోతే, మనదైన సహజ సాంఘిక ప్రత్యేకతను మనం కోల్పోతాం. ఇప్పటికే అటువంటి క్షీణత మొదలయింది.అభివృద్ధి తెస్తున్న – ‘కాస్మోపాలిటన్’ జీవనం దేశమంతా అన్ని ఆర్థికస్థాయి సమాజాల్లోకి ముంచు కొస్తుంటే, వాటిని ఎదుర్కోవడానికి ఆయా సమాజాల పక్షంగా ప్రభుత్వాలూ, పౌరవేదికలూ అప్రమత్తం అవుతూనే ఉన్నాయి. అయితే, ఆర్థిక సంస్క రణల అమలును 1995 నాటికే ఆహ్వానించిన తెలుగునాట పరిస్థితి మిగతా వాటికి భిన్నమైనది. తోసుకొచ్చిన హైటెక్ చదువులు అప్పట్లో ఇక్కడ తొలివేటు సామాజిక శాస్త్రాల చదువుల మీద పడింది. నిజానికి 80వ దశకం మధ్యలోనే అన్ని గ్రూపులకు డిగ్రీ స్థాయిలో కొత్తగా మొదలయిన– ‘కల్చర్ అండ్ హెరిటేజ్’ పేపర్‌తో సహా ‘సోషల్ సైన్సెస్’ చదువుల్ని ప్రభుత్వం నీరు గార్చింది.వీటి స్థానాల్లోకి పిల్లలు ఫీజులు కట్టి చదివే ‘హైటెక్’ కోర్సులు వచ్చాయి. అలా కొత్త తరాలకు క్లాస్ గదిలోనే – ‘పౌరశాస్త్రాల స్పృహ’ లేకుండా చేయడం జరిగింది. ఏవీ అంత తేలికగా రావు.. పొవు ఇది కేవలం సోయలేనితనంతో జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే, అప్పట్లో– ‘టూరిజం తప్ప మరే ఇజం లేదు’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అనేవారు. సరే, మరి తప్పిన దారిని సరిచేయడం ఎక్కడ మొదలెట్టాలి? అప్పట్లో ‘మెక్రో ఫైనాన్స్’ వ్యాపారం చేసే చీకటిశక్తులు గ్రామీణ కుటుంబ ఆర్థిక వ్యవస్థ లోకి జొరబడి క్రమంగా అది – ‘కాల్ మనీ’ రాకెట్‌గా జుగుప్సాకరమైన రీతిలోకి రూపాంతరం చెందింది. ఇక బడుగుల నివాసాల మధ్య ‘బెల్ట్ షాపులు’ మాట అయితే సరేసరి. ఇటువంటివి ఊళ్ళల్లోకి ఏ ఒక్క రోజో వచ్చినవి కాదు. అలాగే, వీటి మూలాలను కుదుళ్లకంటా పెకళించడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అయినా ఇవి ఒక ఐదేళ్ల కాలంలో పైకి కనిపించి, మరో ఐదేళ్ల కాలంలో అదృశ్యమయేవి అంతకంటే కాదు. కష్టకాలంలోనూ సంక్షేమం రెండున్నర ఏళ్ల ‘కరోనా’ కాలాన్ని దాటుకుని పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుతో నాలుగో ఏడాదికి చేరిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యాసంలో పైన చర్చించిన కంటికి కానని రుగ్మతలను గుర్తించి వాటిని ‘అడ్రెస్’ చేయడానికి అడుగులు వేస్తున్నది. ‘లీజర్ మేనేజ్మెంట్’ అనేది ఆరోగ్యకర సమా జాల్లో అత్యవసరమైన ప్రక్రియ. అందుకు పార్కుల నిర్మాణం వంటివి సాధారణంగా మనకు పైకి కనిపించేవి. ఆడుదాం ఆంధ్ర.. అయితే, నైపుణ్యాభివృద్ధి, నివాస ప్రాంతాల సమీపాల్లోనే ఉపాధి లభ్యత ఆర్థిక అంశం అయితే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు వంటివి ఊళ్ళల్లో ఆబాల గోపాలానికి ఉత్సాహం నింపుతూ ఒక బృందం (టీమ్) పాటవ నిర్మాణానికి దారి తీసే అంశాలు. ఇందుకోసం రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ– ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నవంబర్ 15 నుండి డిసెంబర్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా– క్రికెట్, కబడి, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో అన్ని వయసుల యువతీ యువకులకు పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించను న్నారు. ఇందులో గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు లక్షల మ్యాచ్‌లు నిర్వహిస్తారు.ఇందుకోసం గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్ల కాలేజీల గ్రౌండ్స్ సిద్ధం చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. కొత్త నటుల కోసం డాటా బ్యాంక్ అలాగే రంగస్థల కళలను ప్రోత్సహిస్తూ ‘ఏపీ ఫిల్మ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఈ ఏడాది చివర ఉత్తమ నాటకాలకు – ‘నంది అవా ర్డులు’ ప్రదానం చేయబోతోంది. మన రాష్ట్రంలో షూటింగులు జరిగే సినిమా యూనిట్లకు స్థానికంగా నటులు కనుక అవసరమైతే, వారి వివరాలతో ఈ సంస్థ – ‘టాలెంట్ డాటా బ్యాంక్’ను సిద్ధంచేసింది. ఉదాహరణకు నెల్లూరు కృష్ణపట్నం పోర్టు వద్ద పనిచేస్తున్న సినిమా యూనిట్‌కు సబ్ ఇన్ స్పెక్టర్ పాత్రకు ఒక జూనియర్ నటుడు కావాలను కోండి. ఈ సంస్థ ‘వెబ్ సైట్’లోని ‘డేటా బ్యాంక్’లో వెతికితే, ఆ యూనిట్‌కు దగ్గర్లో ఆ పాత్ర పోషించే నటుల వివరాలు దొరుకుతాయి. ఈ ఆగస్టు నుంచి ఈ నటులకు సంస్థ ‘ఐ.డి. కార్డు’లను జారీ చేస్తు న్నది. ఇలా కొత్తవారికి అవకాశాలు అనేది మొదల యింది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
సచివాలయ వ్యవస్థ : పేదజనానికి ప్రగతిపథం
ప్రపంచ దేశాలతో సుస్థిర అభివృద్ధి గమనంలో పోటీ పడుతున్న భారతదేశం స్వాతంత్య్ర శతాబ్ది 2047 నాటికి అగ్రస్థానంలో నిలవాలని పరితపిస్తోంది. అధిక ఆదాయ స్థితిసాధనకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి శక్తిమంతంగా పని చేస్తోంది. ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనలో మునిగిపోయాయి. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ వెల్లడించిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ)తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పేదరికం రేటు 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గింది. గ్రామాల్లో పేదరికం తగ్గింపు రేటు సగానికి పైగా దిగింది. పోషకాహారం, శిశు, కౌమార దశ మరణాలు; ప్రసూతి ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్, గృహాలు, ఆస్తులు, బ్యాంకు ఖాతాల గణాంకాలను వినియోగించి నీతి ఆయోగ్ తాను ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ అనుసరించని పాలనా పద్ధతుల్ని జగన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమాన్ని పొందవచ్చో తెలియజేసే వాలంటీరు వ్యవస్థ పేద ప్రజల వెంట నడుస్తోంది. అర్హులయిన లబ్దిదారులంతా నవరత్నాలతో పాటు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తున్న మిగతా ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింతగా చేరువ చేసింది. దీంతో ప్రజాపాలనలో రెట్టింపు వేగం పెరిగింది. మానవ వనరుల సంపదకు పునాదివేయడానికి వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ మూలస్తంభాలని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 67 శాతానికి పైగా ప్రజలు ఈ రంగంలో నిమగ్నమై జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి సుస్థిర విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 70 శాతం మంది సన్నకారు రైతులకు ‘రైతు భరోసా’తో రబీ, ఖరీఫ్ పంటల్లో బాసటగా నిలుస్తుంది. పంటలు విఫలమయితే తదుపరి పంటపనులకు ముందుగానే రైతులకు బీమా అందిస్తోంది. పాడి, మత్స్య పరిశ్రమలకు తగిన సహకారం లభించింది. రాష్ట్ర అభివృద్ధిలో ఈ పరిశ్రమల వాటా పెరిగింది. ప్రభుత్వం స్వయం ఉపాధి, సాంప్రదాయ వృత్తుల నేత కార్మికులు, టైలర్లు, డ్రైవర్లు తదితర చేతివృత్తిదారులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సకాలంలో రుణ సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం. ‘‘అందుకు నేను నా వంతు కృషి చేస్తున్నాను. నిజానికి నేను చేయలేనిది చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడం. మీరు నా ప్రభుత్వం నుండి లబ్ది పొందితేనే నాకు ఓటు వేయండి అనే నినాదంతో రేపటి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తాను. నాకు ప్రజలు అద్భుత ఫలితాలు అందిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’’ అంటున్నారు ఆయన. పేద ప్రజలను ప్రగతిపథంలో నడిపిస్తున్న ఆయన అభివృద్ధి, సంక్షేమ పాలన మీద ఆయనకున్న నమ్మకం ఇది. – జి. యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్, 95028 12920. -
ఈ కార్యక్రమం లక్ష్యం ఇదే...!
-
సీఎం జగన్‌ను కలిసిన శ్రీలంక ప్రతినిధులు
సాక్షి, అమరావతి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శ్రీలంక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ డి.వెంకటేశ్వరన్, ఇతర అధికారులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తమ దేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు కోరారు. శ్రీలంక నుంచి భారత దేశానికి వచ్చే భక్తుల్లో 50శాతం మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తారని, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి విన్నామని శ్రీలంక ప్రతినిధులు సీఎం జగన్‌కు తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి విన్న తర్వాత సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్న తమ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిని కలిసినట్లు శ్రీలంక ప్రతినిధులు తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఆక్వారంగం, వాటి ఎగుమతుల్లో ఏపీ గణనీయ ప్రగతి సాధించిన నేపధ్యంలో... శ్రీలంకలో కూడా ఆక్వారంగ ప్రగతికి సహకారం అందించాలని కోరారు. కోవిడ్, దిగుమతులు కారణంగా దెబ్బతిన్న శ్రీలంక ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతోందని.., ఖనిజవనరులు, పర్యాటకరంగంలో పెట్టుబడులకు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: నాలుగేళ్ల జగన్ పాలనపై ఒంగోలు కుర్రాడి లెక్కలు చూశారా? -
దివ్యాంగుల సంక్షేమంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: దేశంలో దివ్యాంగుల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్సీపీపీ) నాయకుడు, పార్టీ కో ఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి పార్టీ దివ్యాంగుల విభాగ సమావేశాన్ని టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వేలాదిమంది దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్ ఇస్తూ అండగా నిలుస్తోందని చెప్పారు. 14 రకాల రోగపీడితులు, వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు రూ.255 కోట్లకుపైగా పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతినెల ఒకటో తేదీనే వలంటీర్ ద్వారా నేరుగా దివ్యాంగుని వద్దకే పెన్షన్ పంపుతున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచి ఉద్యోగ నియామకాల్లోను, ప్రమోషన్లలోను అవకాశం కల్పిస్తున్నారన్నారు. పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కిరణ్‌రాజ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జీలు పాల్గొన్నారు. వినతుల స్వీకరణ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వరసగా మూడోరోజు బుధవారం కూడా వి.విజయసాయిరెడ్డి గ్రీవెన్స్ డే నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. -
నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో విజయం సాధించి.. సంక్షేమ పాలనతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశంలో ఒంటరిగా పోటీచేసిన ఒక పార్టీ ఇంత భారీ విజయం సాధించడం అదే ప్రథమం. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు సమాధి కడుతూ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు చారిత్రక తీర్పు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు.. ప్రజాసంకల్ప పాదయాత్రలో భవితపై భరోసా కల్పించిన సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టి.. నవశకాన్ని ఆవిష్కరించి నేటికి నాలుగేళ్లు. ఈ సందర్భంగా నాలుగేళ్ల పాలనపై సీఎం ట్వీట్ చేశారు. ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ల క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వ… — YS Jagan Mohan Reddy (@ysjagan) May 23, 2023 -
2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరాతి: ‘2023-24 జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ ద్వారా సీఎం ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగా లబ్ధిని ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు. నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్లో పొందుపరిచారు. ఆ వివరాలను గమనిస్తే... ►ఏప్రిల్ 2023- జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►మే 2023- వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా ►జూన్ 2023-జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి ►జులై 2023-జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం) ►ఆగష్టు 2023-జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర ►సెప్టెంబర్ 2023-వైఎస్సార్ చేయూత ►అక్టోబర్ 2023-వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత) ►నవంబర్ 2023-వైఎస్సార్ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత) ►డిసెంబర్ 2023-జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి ►జనవరి 2024-వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ (మూడవ విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000) ►ఫిబ్రవరి 2024-జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం ►మార్చి 2024-జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు చదవండి: మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం -
మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు.. మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం, మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు సీఎంవో నిర్ణయం తీసుకుంది. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారైంది. మార్చి 18 సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం.. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయనున్నారు. కార్యక్రమాల షెడ్యూల్: ♦మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన, వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ♦మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం ♦మార్చి 25 నుంచి వైఎస్సార్ ఆసరా... ఏప్రిల్ 5 వరకూ కార్యక్రమం కొనసాగనుంది. ♦మార్చి 31న జగనన్న వసతి దీవెన ♦ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు ♦ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం ♦ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం చదవండి: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్ -
ఏటేటా సంక్షేమ వ్యయం పెరుగుదల
సాక్షి, అమరావతి: విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక స్పష్టంచేసింది. సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. రాష్ట్రాల వారీగా సామాజిక రంగం, ఆస్తుల కల్పన వ్యయంతో పాటు రాష్ట్రాల సొంత పన్ను ఆదాయాల వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొత్త పీహెచ్‌సీలు, మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపడుతున్నందున ఆ రంగాల్లో వ్యయం ఎక్కువగా ఉంది. మరోపక్క.. నవరత్నాల పేరుతో అర్హులైన వారందరికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నందున సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా ఏటా పెరుగుతోందని నివేదిక వివరించింది. మరోపక్క.. ఆస్తుల కల్పన వ్యయం కూడా బాబు హయాంలో కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక స్పష్టంచేసింది. 2018–19లో ఆస్తుల కల్పన వ్యయం రూ.35 వేల కోట్లుండగా 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ.36,224 కోట్లు చేసిందని.. అదే 2021–22లో ఆస్తుల కల్పన వ్యయం రూ.47,583 కోట్లకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. కానీ, ఆర్థిక మందగమనంతో పాటు కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల రాష్ట్ర సొంత పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది. 2021–22లో మాత్రం సొంత పన్ను ఆదాయం పుంజుకుందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక 2018–19లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.58,677 కోట్లు రాగా 2019–20లో రూ.57,601 కోట్లే వచ్చింది. 2020–21లో మరింత తగ్గి రూ.57,359 కోట్లకు పరిమితమైంది. అదే 2021–22లో మాత్రం రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.85.265 కోట్లుగా ఆర్బీఐ పేర్కొంది. -
CM YS Jagan: మార్గ నిర్దేశకుడు
తప్పుడు కేసులకు భయపడలేదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వెరవలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పదేళ్లు అలుపెరగని పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలా భరోసా కల్పించారు. కులం, మతం, వర్గం, రాజకీయం.. ఇవేవీ చూడకుండా అర్హతే ప్రాతిపదికగా సాయం అందిస్తున్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో నూతన అధ్యాయానికి తెరతీసి రాజకీయ పార్టీలకు, నేతలకు మార్గనిర్దేశకుడిగా నిలుస్తున్నారు. రామగోపాల్ ఆలమూరు/ సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పదేళ్ల పాటు తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్సీపీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. దేశ చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులు, వారి కుమారులు ఉన్నప్పటికీ, వారెవరూ రాజకీయంగా బలమైన ముద్ర వేయలేకపోయారు. కానీ.. వైఎస్ జగన్ మాత్రం లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించడంలో.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో.. పరిపాలనలో తండ్రిని మించిన తనయుడిగా రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా చూస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే 95% హామీలు అమలు చేశారు. తద్వారా ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పి.. ఇతర పార్టీలకు దిక్సూచిలా నిలిచారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పేదరిక నిర్మూలనలో దిక్సూచి ► వివిధ సంక్షేమ పథకాల కింద మూడేళ్లలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,41,247.94 కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో జమ చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేశారు. ► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సొమ్ముతో వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న ప్రజలు పేదరికాన్ని అధిగమిస్తున్నారని సామాజిక పరిశీలకులు చెబుతున్నారు. ► 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేస్తూ రూ.27 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడమే కాకుండా.. ఏకంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో వారికి ఇళ్లు నిర్మిస్తుండటం దేశ చరిత్రలో రికార్డు. సామాజిక సాధికారతలో రోల్ మోడల్ ► పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సామాజిక సాధికారత సాధించే దిశగా సీఎం వైఎస్ జగన్ బలంగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గంలో, నామినేటెడ్ పదవుల్లో, శాసనమండలి సభ్యుల ఎంపికలో, స్థానిక, పురపాలక, పరిషత్ ఎన్నికల్లో, రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఈ వర్గాలకు పెద్ద పీట వేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం, మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణలో ఈ వర్గాలకు ఏకంగా 70 శాతం పదవులు కట్టబెట్టారు. ► దేశ చరిత్రలో తొలి సారిగా నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ కల్పించేలా చట్టం తెచ్చి మరీ వారికి అవకాశం ఇచ్చారు. తద్వారా సామాజిక సాధికారతలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ► ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక తదితర పథకాలు అమలు చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద కింద రోజూ 43,26,782 మంది పౌష్టికాహారాన్ని స్వీకరిస్తుండగా ఇందుకు ప్రభుత్వం రూ.3,087.50 కోట్లు ఖర్చు చేసింది. ► పాఠశాలల్లో నాడు–నేడు కింద రూ.16,450 కోట్ల వ్యయంతో మొత్తం 56,572 స్కూల్స్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 34,19,875 మందికి రూ.4,895.45 కోట్లతో గత మూడేళ్లలో సంపూర్ణ పోషకాహారాన్ని అందించారు. ► విద్యా రంగానికి మూడేళ్లలో మొత్తం రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. ఏటా రూ. 24 వేల వరకు ఖర్చుతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న బైజూస్ స్డడీ మెటీరియల్‌ను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగానే అందించడానికి ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ► ఇకపై ఏటా 8వ తరగతిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు అందజేయనుంది. ఈ ఏడాది 4.7 లక్షల మంది విద్యార్థులకు రూ.500 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికి దాదాపు రూ.12,000 విలువ చేసే ట్యాబ్‌లు ఉచితంగా సెప్టెంబర్‌లో అందించనున్నారు. ► ప్రభుత్వ నిర్ణయాల వల్ల 2018–19లో 37 వేల మంది క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందితే.. 2019–20లో 51 వేలు, 2020–21లో 61 వేల మంది ఉద్యోగాలు సాధించారు. వైద్య రంగంలో నవశకం ► మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. దానికి సీఎం వైఎస్ జగన్ జీవం పోశారు. ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందే వారి వార్షికాదాయం పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీనివల్ల 1.41 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఈ పథకం పరిధిలోకి 2,436 చికిత్సలను తీసుకొచ్చారు. చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా సాయం చేస్తున్నారు. ఆçస్పత్రులను నాడు–నేడు కింద ఆధునికీకరిస్తున్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను అధిక శాతం భర్తీ చేశారు. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. సుపరిపాలనలో నంబర్ వన్ ► గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి.. 1.34 లక్షల మంది ఉద్యోగులను నియమించి.. 2.51 లక్షల వలంటీర్లతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు. ► స్కోచ్ సంస్థ 2020, 2021లో చేసిన అధ్యయనంలో సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడం సీఎం వైఎస్ జగన్ పరిపాలనదక్షతకు నిదర్శనం. ప్రజల సౌకర్యం.. పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. మహిళల ఆర్థిక సాధికారత వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు బాటలు వేసింది. ఆసరా కింద ఇçప్పటికే 78.74 లక్షల మంది ఖాతాల్లో రూ.12,757.97 కోట్లు.. చేయూత కింద 24.95 లక్షల మందికి రూ.9,179.67 కోట్లు అందజేశారు. సున్నా వడ్డీ పథకం కింద 1,02,16,410 మంది డ్వాక్రా మహిళలకు రూ.3,615.28 కోట్లు అందించారు. ఈసాయంతో చిరు వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయం, పరిశ్రమలకు ఊతం ► అన్నదాతలను విత్తనం మొదలు.. పంట కొనుగోలు వరకు చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థను తీర్చిదిద్దారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా రాయితీపై అందిస్తున్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్, మద్దతు ధర కల్పన తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆదుకుంటున్నారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలతో మిట్టల్, బిర్లా, అదానీ, సంఘ్వీ, భజాంకా, బంగర్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా పరిశ్రమలను ఆదుకోవడంతో ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగింది. ► సులభతర వాణిజ్య (ఈఓడీబీ) ర్యాంకుల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. గత మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుతం రూ.1,51,372 కోట్ల విలువైన 64 యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉండగా, మరో రూ.2,19,766 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగడమే కాకుండా త్వరలో విశాఖ వేదికగా భారీ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీటన్నింటికీ తోడు మూడేళ్ల కాలంలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. -
గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి - జేఏసీ డిమాండ్
గల్ఫ్ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి మంత్రి కేటీఆర్ కు గల్ఫ్ జెఏసి బృందం వినతిపత్రం ఇచ్చింది. ముస్తాబాద్‌లో ఆయన్ను కలిసి గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తో వారు మాట్లాడుతూ కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం వారి హక్కన్నారు. కావున బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి కోరారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని తెలిపారు. వీరందరి సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన డిమాండ్లు.. - గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. - గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి. - గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు రైతు బంధ, రైతు బీమా లాంటి రూ. 5 లక్షల "గల్ఫ్ ప్రవాసీ బీమా" పథకం ప్రవేశపెట్టాలి. ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) భారం ఉండదు. - విదేశాలకు వెళ్లి నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికులు నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను తక్షణం కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి. - జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం. - హైదరాబాద్ లో ప్రవాసీ భవన్ ఏర్పాటు. - తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి. - 24 గంటల హెల్ప్ లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాకి. - విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు 'ప్రవాసి తెలంగాణ' వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి . - ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహించాలి. - గల్ఫ్ లోని ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానిక వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి 'గల్ఫ్ ప్రవాసి తెలంగాణ దివస్' ను జరుపాలి. సమస్యలను చర్చించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన ప్రవాసీలకు అవార్డులను ప్రధానం చేయాలి. - గల్ఫ్ ఎన్నారైలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా చేయాలి. చదవండి: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం.. -
అంబరం.. మూడేళ్ల సంబరం
అనంతపురం సప్తగిరి సర్కిల్: పాలనలో సమానత్వం.. ఇంటింటా నవరత్న వికాసం.. పల్లెల్లో ప్రగతి మంత్రం... మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు.. అర్హతే ప్రామాణికంగా పథకాల అమలు... సచివాలయ వ్యవస్థతో ఇంటి ముగింటకే సంక్షేమ పథకాలు... నాడు–నేడు అనేలా మారిన బడుల రూపురేఖలు.. అన్నదాతకు భరోసాతో వ్యవ‘సాయం’... విద్యారంగంలో సంస్కరణల విప్లవం... పారిశామ్రిక పురోగతి దిశగా అడుగులు.. ఇలా ఒకటేమిటి మూడేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమ, అభివృద్ధి మైలు రాళ్లు ఎన్నో కనిపిస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం సంబరాలు మిన్నంటాయి. కళ్యాణదుర్గం మండలం చాపిరిలో మంత్రి ఉషశ్రీచరణ్ కేక్‌కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతకు ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. రాయదుర్గంలోని వినాయక్ సర్కిల్లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వసీంసలీం తదితరులు పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలం మద్దలపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో వైస్ ఎంపీపీ రామాంజినేయులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తాడిపత్రిలోని పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. (చదవండి: సామాజిక న్యాయం 'దశ దిశలా'.. ) -
ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సమాయత్తం చేసే దిశగా అగ్రనేతలు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రాంతీయ సమన్వయకర్తలను, కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించి, కొత్త ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైన ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోష్, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తూర్పు సెంటిమెంట్‌గా శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్యకర్తల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ పార్టీలో వారికి గుర్తింపు ఉంటుందనే సంకేతాలను రీజినల్ కో ఆర్డినేటర్లు పంపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు చిన్నచిన్న లోపాలుంటే చక్కదిద్దేందుకు కూడా ముందుండాలని సూచించారు. ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారుంటే సచివాలయంలో ఆరు నెలలకోసారి పరిశీలించి తిరిగి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 11న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలియజేశారు. మూడేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమానికి రూ.లక్షా 43 వేల కోట్లు వినియోగించలేదన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సీఎం జగన్ అమలు చేశారని వివరించారు. మిధున్‌రెడ్డికి ఘన స్వాగతం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులై తొలిసారి జిల్లాకు వచ్చిన లోక్‌సభలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మిధున్‌రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన నేతలతో రాజమహేంద్రవరం కోలాహలంగా మారింది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మిధున్‌రెడ్డికి పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు సమీపాన ఉన్న తోటలో రాజానగరం నియోజకవర్గ ముఖ్య నేతలను మిధున్‌రెడ్డికి రాజా పరిచయం చేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహానికి వచ్చిన మిధున్‌రెడ్డిని పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలకుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, కర్రి పాపారాయుడు, గుబ్బల తులíసీకుమార్, వట్టికూటి రాజశేఖర్, వాసిరెడ్డి జమీలు, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అడపా వెంకటరమణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకూ ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన విధంగా ఈ నెల 11 నుంచి గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మిధున్‌రెడ్డి, బోస్ దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని అంశాలనూ ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ సాధన, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రక్రియను తాము చేపడతామని ప్రాంతీయ సమన్వయకర్తలు చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో కూడా ముందుంటామని ప్రాంతీయ సమన్వకర్తలు భరోసా ఇచ్చారు. పథకాలపై ఫోకస్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్గత సమావేశంలో అధిష్టానం నిర్దేశించిన విధివిధానాలపై మిధున్‌రెడ్డి, బోస్ ప్రజాప్రతిని«ధులకు వివరించారు. ఈ వివరాలను మిధున్‌రెడ్డి, బోస్, మంత్రి వేణు మీడియాకు వివరించారు. మూడేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.లక్షా 43 వేల కోట్లు అందజేసిన విషయాన్ని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని ప్రాంతీయ సమన్వయకర్తలు సూచించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో పథకాల నిధులు జమయ్యేలా సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ విషయాలపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు సుదీర్ఘంగా చర్చించారు. -
ఆయన స్ఫూర్తితోనే సీఎం జగన్ ప్రభుత్వం కూడా.. మంత్రి బుగ్గన
‘‘ఈరోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రత హక్కు, గౌరవ హక్కు, సమానత్వం, శాంతి హక్కు ఉండాల్సిన సమయం ఇది’’ సామాజిక ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి చెప్పిన మాటలివి. ఈ స్ఫూర్తితోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా చిన్నారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బాలల సంక్షేమ పద్దును వివరిస్తూ నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి గురించి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు. చిన్నతనంలో సత్యార్థికి ఎదురైన అనుభవం గురించి సందర్భోచితంగా ప్రసంగం మధ్యలో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి బుగ్గన. ‘‘కైలాష్ సత్యార్థి వాస్తవానికి సంపన్న కుటుంబంలో పుట్టారు. చిన్నతనంలో ఆయనకు ఎదురైన ఓ సంఘటనే బాలల హక్కుల కోసం ఆయన పోరాడేలా చేసింది. ఓ రోజూ స్కూలుకు వెళుతూ బడి బయట ఓ చెప్పులు కుట్టే కుర్రాడిని చూశారు. తానెందుకు బడికి పోగలుగుతున్నాను.. ఆ కుర్రాడెందుకు చెప్పులు కుట్టుకుంటూ బతకున్నాడని ఆనాడు కైలాష్ సత్యార్థి ఆలోచించారు. దానిపై చాలా రోజుల మదన పడ్డారు. ఓ రోజు వర్షం పడుతుంటే.. చెప్పులు నానుతున్నాయంటూ ఆ చెప్పులు కుట్టే పిల్లాడిపై అతడి తండ్రి అరిచాడట. అది చూసి ఓ వైపు మనిషి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుంటుంటే.. ఇక్కడ చెప్పులు తడవకూడదంటూ తండ్రి అరిచాడెందుకని కైలాష్ సత్యార్థి ఆవేదన చెందారు. ఆ పిల్లాడు బడికి ఎందుకు వెళ్లకూడదని అనుకున్నారు. అలాంటి పిల్లలకోసం ‘బచ్ పన్ బచావో’ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా దాదాపు 83 వేల మంది పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించారు’’ అని కైలాష్ సత్యార్థి గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా కైలాష్ సత్యార్థిని స్ఫూర్తిగా తీసుకుని చిన్నారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు బడ్జెట్ కేటాయించిన విషయం తెలిసిందే. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆల్విన్‌కాలనీ/భాగ్యనగర్‌కాలనీ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్, ఆల్విన్ న్కాలనీ, హైదర్‌నగర్, కూకట్పల్లి డివిజన్ల పరిధిలో పలువురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్దిపొందిన 14 మందికి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరు గాంచిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ యాదగిరి, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడ ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, హఫీజ్‌పేట్ అధ్యక్షుడు గౌతమ్‌గౌడ్, నాయకులు కాశీనాద్ యాదవ్, యాదగిరి గౌడ్, వెంకటేష్‌గౌడ్, దాత్రి గౌడ్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. -
ప్రజానేతకు పట్టంకట్టిన ప్రజలు
పాలకులను నిర్ణయించడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అనేది జగమెరిగిన సత్యం. తమ అభ్యున్నతికి కృషి చేసినపుడే ఏ నాయకుణ్ణయినా ప్రజలు ఆదరిస్తారు. ప్రజల కంచాల్లోకి పట్టెడన్నం, ఒంటిమీదికి గుడ్డ, ఉండటానికి నీడ, కుటుంబం గడిచేందుకు పని, చదువు, వైద్యం లాంటివి అందించిన వాడే ఊత్తమ పాలకుడు. అలాంటి పాలననందిస్తున్న యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సామాన్య ప్రజల సంక్షేమం, కనీసావసరాలు తీర్చడం కేంద్రబిందువుగా పాలన చేస్తున్నారు. కాబట్టే 2019 నుంచి ప్రతి ఎన్నికలోనూ ఆయన అఖండ విజయాలను సాధిస్తున్నారు. నూటికి నూరుశాతం విజయాలను సాధించడం ప్రజాభిమానం అపూర్వంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ ప్రజలను హృదయానికి హత్తుకొని వారికోసం అంకితమైన నాయకునికి మాత్రమే అది సాధ్యం. ఇలాంటి ప్రజాదరణ చంద్రబాబుకి నచ్చదు. ప్రజలంటే చులకన. తనను ఎన్నుకోకుంటే వాళ్ళంతా పనికిరాని వాళ్ళ న్నట్టే. తాను మాత్రమే రాష్టాన్నీ... ఇంకా ఎక్కువగా మాట్లాడితే దేశాన్నీ ఏలగల సామర్థ్యమున్నవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయినప్పుడు, తనను ఓడించి ప్రజలు తప్పు చేశారని తమకు తాము క్షమాపణలు చెప్పుకుంటారని అన్నారు. ప్రజలను కించపరిచారు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కరోజూ బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. కోల్పోయిన ప్రజాభి మానాన్ని చూరగొనడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. కుట్రలూ, కుతంత్రాలూ చేసైనా గెలవడమే ధ్యేయంగా పన్నాగాలతో పదేళ్లు గడిపారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విషయంలో, అనైతిక పొత్తులతో ఆంధ్ర ప్రజలను రెచ్చగొడుతూ రెండునాల్కల ధోరణిని ప్రదర్శించి 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో బొటాబొటి మెజారిటీతో గెలిచినా, తెలంగాణలో టీడీపీ మటుమాయమయ్యే స్థితికి వచ్చింది. మరోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం, బలహీన సామాజిక వర్గాలను అణచివేయడంలో మునిగిపోయారు. పోలవరం సమస్య, రాజధాని సమస్య, నిరుద్యోగ సమస్య, ప్రజల చిరకాల సమస్యలు, చదువుల సమస్య ఏదీ తీర్చకుండా తెలంగాణపై అక్కసుతో విషం చిమ్మడంతో కాలయాపన చేశారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలంటే చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం లేదు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడు అనేక కర్మాగారాలను మూసివేసి, వ్యవసాయం దండగని ప్రజల ఉసురు పోసుకున్నాడు తప్ప ప్రజలను ఆదరించలేదు. అందుకే 2019 ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల్లో గెలువడం, ఓడిపోవడం సాధారణ విషయమే. కానీ చంద్రబాబుకు తనను ఓడించడమంటే ప్రజలు తప్పు చేసినట్టే. తానేమీ చేయకున్నా తనను గెలిపించి తీరాలి, తనలాంటి నాయకుడు మరొక్కడు లేరన్నది ఆయన అభిప్రాయం. నాడు వైఎస్సార్ ప్రభుత్వం, నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన మరునాటి నుండే అర్థం లేని విమర్శలు చేస్తూ చులకనైపోయారు. ఓ స్పష్టమైన రాజకీయ ప్రజామోద దృక్పథంతో పనులు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం మొదలెట్టారు. అధికారంలోకి వచ్చిన మరునాటి నుంటే ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు, చేస్తూనే ఉన్నారు. నాడు చంద్రబాబు విమర్శలను వైఎస్సార్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని బాబు నవ్వుల పాలయేట్టు చేశారో, రెండున్నరేళ్లుగా వైఎస్ జగన్ కూడా బాబు విమర్శలను, కుట్రలను అంతకంటే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అతిస్వల్పకాలంలోనే టీడీపీ తెలంగాణలో అంతమయేస్థితికి వచ్చింది. ఇప్పుడు రెండున్నరేళ్ల కాలంలో ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి అంతమయే స్థితికి వచ్చింది. అందుకు కారణం బాబులో ఏ మార్పు రాకపోగా మరింత విలువలేని రాజకీయాల్లోకి కూరుకుపోవడమే. మరోవైపున జగన్ ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తూ, దశాబ్దాలుగా ఏపీ కోల్పోయిన ప్రాభవాన్ని చంద్రబాబు కాలంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రగతి పథంలో నడిపిస్తూ, ప్రతి గడపకూ ఏదో విధంగా ప్రభుత్వ పథకాలు చేరేట్టు చేస్తున్నారు. వైఎస్ జగన్ తనదైన పాలనతో ఆంధ్రప్రజల హృదయాలను గెలుచుకుంటూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నారు. చంద్రబాబు అబద్ధాల వాగ్దానాలు, అసత్య ప్రచారాలతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఆయనను ప్రతిపక్షంలోనూ ఉండని రీతిలో తమ తీర్పునిస్తున్నారు. అమరావతి చుట్టు వేలాది ఎకరాల భూములు తన వాళ్ళతో కొనిపించి అక్కడ రాజధాని చేయాలని సంకల్పించిన చంద్రబాబు ఐదేళ్ళలో ఆ పనిని కూడా చేయ లేకపోయాడు. అనేక గాయాలతో సలుపరింతలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌లోనూ ఆ గాయాల బారిన పడకుండా ఉండాలని భావించారు జగన్. అందుకు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. వెనుకబడి వున్న ఉత్తరాంధ్ర, రాయలసీమలు కూడా కోస్తాంధ్రతో సమానంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. అందుకే మూడురాజధానులు. ఇది చంద్రబాబుకు, ఓ సామాజిక వర్గానికి నచ్చలేదు. అమరావతిలో రాజధాని పేరిట ప్రతిఘాత అభివృద్ధి నిరోధక ఉద్యమాలు చేయిస్తున్నారు. మూడు ప్రదేశాల్లో రాజధాని నేటి సామాజికావసరం. ప్రజల సానుభూతి పొందడానికి ఏడుపులు, తూడ్పులు పనికిరావని పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన నాయకుడికి తెలీకపోవడం శోచనీయం. శుష్కవాగ్దానాలు, శూన్యహస్తాలు, ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టడం, నేలవిడిచి సాముచేయడం వల్ల ఏ నాయకుడూ తనకంటూ శాశ్వత ఓటు బ్యాంకును ఏర్పరచుకోలేడు. ప్రజలు మెచ్చే పాలన, ప్రజల కనీసావసరాలు తీర్చే పాలన, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపే పాలన మాత్రమే శాశ్వత ఓటు బ్యాంకును తయారు చేసింది. మంచి సేద్యం, మంచి వైద్యసేవలు, నాణ్యమైన విద్య నందిస్తూ అనేక పథకాలతో ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న జగన్ పోలవరం, బహుళ రాజధానులు, కె.జి. టు పి.జి. ఒక్క సబ్జెక్టుగా మాతృభాషతో ఆంగ్లమాధ్యమ విద్యను పూర్తిచేసి ప్రజల హృదయాల్లో శాశ్వత ముద్ర వేస్తారనడంలో సందేహంలేదు. తెలంగాణలో అంతర్థానమైన టీడీపీ ఏపీలో ప్రతిపక్ష హోదానైనా పొందే విధంగా బతకాలంటే చంద్రబాబు ఆలోచనాధోరణి ప్రతికూలత నుంచి సానుకూలత వైపు మారాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలని నమ్మలేకుంటే ఆ స్థానాన్ని బీజేపీ లేక కాంగ్రెస్ తన్నుకు పోయే ప్రమాదముంది. - డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త కవి, రచయిత -
‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...
ప్రభుత్వం చేయవలసింది, అభివృద్ధి – సంక్షేమం అని ఒక స్థూల నిర్వచనం ఇవ్వడం వల్ల, ఈ రెండింటి మధ్య ఉండే మరికొన్ని అంశాలు ఎప్పటికీ ‘అనిర్వచ నీయం’గా మిగిలి, వెలుగు చూడవు! అయితే, వాటిని కూడా కలుపుకొని చూడ్డం మొదలుపెడితే, ‘అభివృద్ధి’– ‘సంక్షేమం’ మాత్రమే కాకుండా, మరొక కొత్త అంశం ఉందనే స్పృహ మనకు కలుగుతుంది. ఒకప్పుడు– ‘అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను...’ అనే చరిత్ర, ఇప్పుడు ఈ రెండింటిలో ఏ జాబితా కిందకు వస్తుంది అనే ప్రశ్న అటువంటిదే. ‘రాజ్యం’ పట్టించుకునే, ఇటువంటి మానవీయ పార్వ్వాలను ఈమధ్య– ‘ప్రపంచ బ్యాంక్’ భాషలో ‘ఇంక్లూజివ్ గ్రోత్’ అంటున్నారు. అంటే– అందరినీ కలుపుకొని ‘వృద్ధి’ చెందుదాం... అని. ప్రభుత్వాల పాలన తీరును బట్టి సామాన్య జనం ‘దేహభాష’ మారుతుంది. అప్పటివరకు ఉగ్గబట్టుకున్న ఒత్తిడిని వారు ‘వెంటిలేట్’ చేయడం మొదలు పెడతారు. పత్రికల భాషలో దాన్ని– ‘ఆందోళన’ అంటారు. అయితే, విధాన నిర్ణయాల వద్ద వాటి పరిష్కా రాలు, ప్రతిఫలనాలు ఎలా వున్నా, ఒక ఉమ్మడి సమస్య పరి ష్కారం కోసం పదిమంది బయటకు వచ్చి గొంతు ఎత్తడం అనేది, అప్పటికి అక్కడ అది వారి తొలి విజయం అవుతుంది! (చదవండి: ఆర్థికమే కాదు... సామాజికం కూడా!) ఈ అక్టోబర్ చివరివారంలో గడచిన ఏడున్నరేళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ‘హెల్ప్’, ‘విముక్తి’ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి, ‘ట్రాఫికింగ్ నిరోధం, రక్షణ, పునరావాసం బిల్లు– 2021’ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని, గుంటూరు జిల్లా నరసరావుపేట అధికార పార్టీ ఎం.పి. లావు శ్రీకృష్ణ దేవరాయలకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. బాలికలు, స్త్రీల ఆక్రమణ రవాణా (‘ట్రాఫికింగ్’) తీవ్ర అమానవీయ సామాజిక సమస్యగా పరిణమించి, దేశ వ్యాప్తంగా అసాంఘిక శక్తులకు కొత్త ఆదాయ వనరుగా మారింది. పౌరసమాజం నుంచి వచ్చే ఇటువంటి స్వచ్ఛంద డిమాండు, నిజానికి రాజకీయాలకు అతీతంగా చర్చనీయాంశం కావాలి. కానీ ‘మీడియా’ ప్రభుత్వానికి పౌరసమాజానికి మధ్య నిత్యం దట్టమైన పొగమంచు తెరలు కడుతూ 24 బై 7 వార్తలు అందించడం మొదలయ్యాక, ఇది ప్రముఖంగా వార్త కాలేదు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) నవంబర్ 27న కర్నూలు నగరంలో జరిగింది కూడా ఇటు వంటిదే. రాష్ట్ర అబ్కారీ శాఖ ఉల్లాల్ రోడ్డులో కొత్తగా కట్టిన ఒక బిల్డింగ్ కాంప్లెక్స్‌లో వైన్‌షాపు ప్రారంభించాలని, ముందు రోజు అర్ధరాత్రి మద్యం కేసుల్ని అక్కడకు చేర్చింది. విషయం తెలిసిన పరిసరాల్లోని మహిళలు అక్కడికి పెద్ద ఎత్తున చేరి, ఆ శాఖ అధికారుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మూడు పెద్ద పాఠ శాలలు వున్న కూడలిలో ప్రభుత్వం వైన్‌షాపు తెరిస్తే, విద్యా ర్థులతో అక్కడికి వచ్చే తల్లులకు అది ఇబ్బంది అనేది వారి అభ్యంతరం. ఆ షాపును కొద్ది రోజుల్లోనే వేరేచోటికి మారుస్తామని, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మహిళా అధికారి హామీ ఇచ్చినప్పటికీ, వారు అందుకు అంగీకరించ లేదు. మనం ఎన్నుకొన్నది ప్రజాహితం కోరే ప్రభుత్వం అనే నమ్మకం ‘ఆఖరి మైలు’ జనంలో కూడా కలిగినప్పుడు, ప్రజా స్పందన ఇలా బహిరంగ దృశ్యమవుతుంది. కొత్తగా తమదైన ‘జాగా’ను వారు ఇలా దొరకబుచ్చుకుంటారు. ఆంగ్లంలో దీన్ని ‘అడ్వాంటేజ్’ తీసుకోవడం అంటారు. ‘నీతో కాక, ఇంకెవరితో చెప్పుకుంటాం?’ అని– తమ హృదయాలకు దగ్గరైన నేతల ప్రభుత్వాల్లో జనం తమ ఆక్రోశాన్ని సైతం ఇలా ఆస్వాదిస్తారు. (Nandamuri Balakrishna: ఎప్పటికీ వెంటాడే వెన్నుపోటు!) ఇటువంటి వాటిని అభివృద్ధి–సంక్షేమం చట్రంలో పెట్టి చూడ్డం కష్టం. ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, అనంతపురం జిల్లాల గ్రామీణ జిల్లా పరిషత్ పాఠ శాలల విద్యార్థుల విషయంలో జరిగింది కూడా అటువంటిదే. గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివే పిల్లల దేహ ధారుడ్యానికి క్రీడల ప్రోత్సాహానికి మౌలిక సదుపాయాలు లేవన్నది జగమెరిగిన సత్యం. అటువంటిది, ఒక్కొక్క పాఠశాలకు పది లక్షలు మించకుండా ఖర్చు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మిగిలిన ‘మెటీరియల్’ నిధులను ప్రభుత్వం ఇందుకు ఖర్చు చేస్తున్నది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ ట్రాక్స్ ఆయా స్కూల్స్‌కు అనుబంధంగా ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ క్రీడల అభివృద్ధి సంస్థ ‘శాప్’ను తగు చర్యలు కోసం కోరింది. ఎక్కడైనా ‘తేమ’ ఉన్నచోట రాళ్ళ మధ్య కూడా గరిక మొలుస్తుంది. ‘తోకలు కత్తిరిస్తా...’ అంటూ హెచ్చరించేవారికి ఇటువంటి ‘గ్రామర్’ అర్థం కావడం కష్టం. ‘ఆఖరి మైలు’ జనం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఎటువంటిదో, ‘సోషల్ మీడియా’ వల్ల ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రజలు దగ్గరగా గమనిస్తున్నారు. అదే వారిలో– ‘అకస్మాత్తుగా వచ్చిన ప్రకృతి విపత్తుకు ఆయన మాత్రం ఏమిచేస్తాడు?’ అనే తార్కిక దృష్టి కలిగించింది. విపత్తు తదనంతరం ప్రభుత్వ యంత్రాగం ద్వారా అందిన ఉపశమన చర్యల్లోని నిజాయితీ వారికి కనిపించింది. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకుడు -
సంతృప్త స్థాయిలో అర్హులందరికీ లబ్ధి
సాక్షి, అమరావతి: నవరత్నాలు – సంక్షేమ క్యాలెండర్ అమలులో భాగంగా అర్హులెవరూ నిరాశ చెందరాదని, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఏడాదిలో రెండు సార్లు వారికి లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత సర్కారు హయాంలో అర్హులైనప్పటికీ లబ్ధి చేకూర్చకుండా ఎలా కోతలు పెట్టాలనే ఆలోచన చేయగా అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ సంతృప్త స్థాయిలో అర్హులకు ఫలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైనప్పటికీ సకాలంలో దరఖాస్తు చేసుకోని వారికి ఊరటనిస్తూ మరో అవకాశం కల్పించారు. ఇక సామాజిక తనిఖీల సందర్భంగా అనర్హులుగా తేలిన వారికి కూడా ఆ తరువాత అర్హత పొందితే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ పథకాలకు ఇప్పటివరకు 4,92,013 మంది దరఖాస్తు చేసుకోగా 3,89,786 మంది అర్హులుగా తేలారు. గతంలో పథకాల అమలు సందర్భంగా సాంకేతిక కారణాలతో నగదు జమ కాని వారు 1,11,757 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ డిసెంబర్లో నగదు జమ చేయనున్నారు. 5,01,543 మందికి మొత్తం రూ.652.79 కోట్ల మేర నగదు జమ కానుంది. నవరత్నాలు – సంక్షేమ క్యాలెండర్ అమలు సందర్భంగా అర్హులైన లబ్ధిదారులెవరైనా మిగిలిపోతే వారిని గుర్తించి ఏడాదిలో రెండుసార్లు ప్రయోజనం చేకూర్చాల్సిందిగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్ దాకా అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారులందరికీ డిసెంబర్లో లబ్ధి కలగనుంది. ఆ తరువాత మే వరకు అర్హులుగా గుర్తించే లబ్ధిదారులకు జూన్‌లో లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. కాగా, ‘గడువులోగా దరఖాస్తు చేసుకోనప్పటికీ అర్హులకు మరోసారి అవకాశం కల్పించి ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడువు తీరిన తరువాత దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించడంతో పాటు ఇప్పుడు అర్హత పొందిన వారికి కూడా డిసెంబర్లో నగదు జమ చేస్తాం’ అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. -
2 Years YS Jagan Ane Nenu: సంక్షేమ సంతకం
వెబ్‌డెస్క్: సంక్షేమ పథకాలు ప్రకటించడంలోనే కాదు వాటిని అమలు చేయడంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త పంథాను నెలకొల్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడిని సృష్టించారు వైఎస్ జగన్. రెండేళ్లలోనే లెక్కకు మిక్కిలిగా ప్రజాసంక్షేమ పథకాలు ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఎంతో సాహసంతో వాటిని అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు. సంక్షేమ క్యాలెండర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ సంక్షేమ పథకానికి సంబంధించి క్యాలెండర్‌ని ప్రకటించారు. అందులో ఏ పథకానికి ఎన్ని నిధులు ఏ తేదిన విడుదల అవుతాయనే వివరాలు ముందుగానే తెలియజేశారు. ఈ క్యాలెండర్‌ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్యాలెండర్ ప్రకారం రాబోయే జూన్‌లో జగనన్న తోడు తొలి విడత, వైఎస్సార్ వాహన మిత్ర రెండో విడత, వైఎస్సార్ చేయూత మూడో విడత చెల్లింపులు చేయనుంది జగన్ ప్రభుత్వం. ప్రతీ మంగళవారం ఒక్కో పథకానికి నిధులు విడుదల చేయనుంది. సంక్షేమానికి రూ. 1.25 లక్షల కోట్లు రెండేళ్ల కాలంలో కనివినీ ఎరుగని రీతిలో 94.5 శాతం వాగ్ధానాలను పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం. ఐదేళ్ల కాలంలో అమలు చేయాల్సిన పథకాలను రెండేళ్లలోనే ఆచరణలో పెట్టి రికార్డు సృష్టించారు జగన్. సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 129 వాగ్ధానాలు చేయగా అందులో ఇప్పటికే 107 హామీలు అమల్లోకి వచ్చాయి. 24 నెలల కాలంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ. 93,708 కోట్ల రూపాయలు చేరగా... పరోక్షంగా మరో రూ. 31,714 కోట్లు అందించింది జగన్ సర్కార్. మొత్తంగా రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలపై ఏకంగా రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తనపర బేధం లేదు ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ సంక్షేమ పథకానికి ప్రతిపక్ష పార్టీ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది ఏపీ ప్రభుత్వం. కులం, మతం, ప్రాంతం, పార్టీ బేధాలు చూడకుండా అర్హుడైతే చాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న, రాబోయే తరానికి మంచి జరగాలనే లక్ష్యంతోనే సర్కారు ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు 9,260 కొత్త వాహనాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. లబ్దిదారులకు నాణ్యమైన రేషన్ అందించడంలో భాగంగా అదనంగా రూ.830 కోట్లు వెచ్చించారు. సొంతింటి కల సాకారం సరైన పక్కా ఇళ్లు లేని వారు, అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుత్ను పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ధృడ సంకల్పం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ కనివినీ ఎగురని రీతిలో ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చులకు కూడా భరించాలని నిర్ణయించారు. మొత్తం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 28,54,983 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ పట్టాలన్నీ మహిళల పేరు మీదే జారీ చేశారు. శరవేగంగా ఇళ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా అంతా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం జగన్ టార్గెట్ ఇచ్చారు కరోనా ఉన్నా.. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో 2019లో మే 30 ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ వెంటనే ఆరు నెలలకే కరోనా మహమ్మారి ప్రపంచంపై దాడి చేసింది. కోవిడ్ ఎఫెక్ట్‌తో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడులకు లోనైంది. ఆశించిన ఆదాయం రాలేదు. 24 నెలల పాలనలో 14 నెలలు పాటు కొవిడ్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఐనప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల లేమితో నీరుగారి పోలేదు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతూ ఏ ఒక్క పథకం అమలు వాయిదా పడలేదు. ఎన్నికల మెనిఫెస్టోలో ప్రజలకు వాగ్ధానం చేసిన నవరత్నాలను పరమ పవిత్రంగా భావిస్తూ ఎన్నికష్టాలు ఎదురైనా నవరత్నాల అమలులో వెనక్కి తగ్గలేదు. సంక్షేమ ప్రభుత్వం - వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 36,70,425 మందికి రూ.19,306.20 కోట్ల సాయం - వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 5,615 కోట్లతో 17. 27 లక్షల మందికి లబ్ది - వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 2,294 మందికి రూ.6.96 కోట్ల సాయం అందచేత - వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.45.69 కోట్లు ఖర్చు - వైఎస్సార్ లా నేస్తం ద్వారా 721 మందికి రూ.3.21 కోట్లు వెచ్చించారు - వైఎస్సార్ ఆరోగ్య ఆసరా క్రింద 1,69,516 మందికి రూ.115 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం - వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,177.23 కోట్ల నిధులు విడుదల. ఈ పథకం ద్వారా 3,51540 మందికి లబ్ది కుటుంబాలు, కులాల వారీగా - సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు లబ్ది - ఒకే పథకం అందుకున్న కుటుంబాలు 18 శాతం - రెండు, అంత కన్నా ఎక్కువ లబ్ది పొందిన కుటుంబాలు 82 శాతం - ప్రత్యక్ష, పరోక్ష నగదు కలిపి రెండేళ్లలో ఇచ్చిన మొత్తం రూ.1,31,725 కోట్లు - ప్రత్యక్ష నగదు బదిలీ కింద నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది రూ.95,528 కోట్లు - పరోక్ష నగదు కింద అందిన సాయం రూ.36,197 కోట్లు - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ.46,405 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన బీసీలు 3,31,06,715 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 15,304 కోట్లు వెచ్చించగా లబ్ది పొందిన ఎస్సీలు 1,06,14,972 మంది - ప్రత్యక్ష నగదు నగదు బదిలీ రూ. 4,915 కోట్లు జమ చేయగా లబ్ది పొందిన ఎస్టీలు 29,71,144 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 3,374 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన మైనార్టీలు 19,88,961 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 7,368 కోట్లు వెచ్చించగా ప్రయోజనం పొందిన కాపులు 30,85,472 మంది - ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 18,246 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన ఓసీలు 1,49,21,396 మంది -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, బీమా లేకున్నా 'భరోసా'!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ బీమా పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో లేకుండా మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం బీమా వర్తించడానికి అవకాశంలేని ఈ కుటుంబాలకు కూడా భరోసా కలిగించేందుకు సర్కారే వీరికి సంబంధించిన ప్రీమియంను చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 12,039 కుటుంబాలకు భరోసా కల్పించినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త విధివిధానాలతో సీఎం జగన్ గత ఏడాది అక్టోబరు 21న వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు.. అమలులో ఉన్న బీమా పథకానికి కేంద్రం అందజేసే ఆర్థిక సహాయం నిలిపిపేయడంతో ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ఉచిత బీమాను అందజేస్తోంది. దీని ద్వారా సాధారణ, ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది. పథకం ప్రారంభమైన తేదీ తర్వాత ఈ పథకానికి అర్హత ఉండి, నిబంధనల ప్రకారం బీమా పరిధిలోకి రాలేకపోయిన వారు ఇప్పటివరకు 11,022 మంది సాధారణ పరిస్థితులతో మృతిచెందినట్లు, మరో 1,017 మంది ప్రమాదవశాత్తు మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని అధికారులు గుర్తించారు. నిజానికి.. వైఎస్సార్ బీమా పథకంలో పేర్లు నమోదైన ఒకొక్కరి తరఫున ఆయా బ్యాంకులకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే, బ్యాంకుల్లో నమోదు ప్రక్రియ పూర్తికాకుండా ఇందుకు అర్హత ఉన్నవారు మొత్తం 12,039 మంది మరణించారు. వీరు సంబంధిత బీమా సంస్థలు, బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందే వీలులేని జాబితాలో ఉండిపోయారని అధికారులు చెప్పారు. దీంతో సీఎం వైఎస్ జగన్ వీరిపట్ల ఉదారంగా వ్యవహరించి వారి కుటుంబాలను ఆదుకునేందుకు నిర్ణయించినట్లు వారు తెలిపారు. వీరికి ప్రత్యేకంగా ప్రభుత్వ నిధులు నుంచి ఆర్థిక సహాయం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కాగా, ఈ 12,039 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు ఖర్చు చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 6న సీఎం చేతుల మీదుగా సాయం వైఎస్సార్ బీమా పథకం లబ్దిదారులకు ఏప్రిల్ 6న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ 12,039 కుటుంబాలకు ఆ రోజున రూ.258 కోట్ల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. వైఎస్సార్ బీమా సాయం ఇలా.. నిబంధనల ప్రకారం, 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి సాధారణ మరణం పొందితే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు.. 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు.. 51–70 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం పొందితే రూ.3 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తారు. (చదవండి: సీఎం జగన్‌పై అభిమానంతో..) -
ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అర్చకులు సీఎం జగన్‌కు ఆయన నివాసంలో వేద ఆశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ గౌతం సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజును సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఘనంగా నిర్వహించింది. ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు రక్తదానం చేశారు. జగ్గయ్యపేటలో.. జగ్గయ్యపేట అర్బన్: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాల గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, విమలాభాను దంపతుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణప్రసాద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరూరా అభిమానులు కేక్ కట్‌చేసి ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు తమ ఇంట్లో సోదరుడి పుట్టినరోజులాగా భావిస్తూ ఆనందంగా కనిపించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లోను నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా వేలాదిమంది రక్తదానం చేశారు. సర్వమత ప్రార్థనలు జరిగాయి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కురసాల కన్నబాబు 151 కిలోల కేక్ కట్ చేశారు. తిరుపతిలో నవరత్న పథకాల ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్తున్న ఎమ్మెల్యే భూమన, మహిళా కార్యకర్తలు, అభిమానులు, తూ.గోదావరి జిల్లా దివాన్‌చెరువులో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం రాజానగరం మండలం దివాన్‌చెరువు ఫంక్షన్‌హాలులో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లాల్‌పురంలో జీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు లాల్పురం రాము ఆధ్వర్యంలో రైతులు పంట పొలాల్లో కేక్ కట్ చేశారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఏసురత్నం ఆధ్వర్యంలో యార్డు ఆవరణలో 35 అడుగుల జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి భారీ క్రేన్ సహాయంతో ఎండుమిర్చిని వెదజల్లి దిష్టి తీశారు. పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు జరిగాయి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 25 వేలమంది వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు నవరత్న పథకాల ప్లకార్డులతో రెండు కిలోమీటర్ల మేర ప్రదర్శన నిర్వహించారు. జై జగనన్న నినాదాలతో తిరుపతి నగరం మారుమోగింది. శ్రీకాకుళం జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన పి.బుద్ది అనే మహిళ పూండి జంక్షన్లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసింది. కష్టార్జితాన్ని వెచ్చించి కేక్ కొని పంచిపెట్టి అభిమానాన్ని చాటుకుంది. విశాఖ జిల్లాలో 200 మంది నేత్రదానానికి అంగీకరిస్తూ పత్రాలు అందజేశారు. తగరపువలసలో నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబిరంలో సుమారు ఐదువేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. నర్సీపట్నంలో 70 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రితో పాటు ఆ నియోజకవర్గంలోని ఏడు పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు ఉపయోగపడేలా 50 వీల్చైర్లను సమకూర్చారు. తెలంగాణలో.. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును తెలంగాణలో సోమవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ వద్ద రక్తదాన శిబిరాన్ని, వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పంజాగుట్ట వైఎస్సార్ సర్కిల్ వద్ద వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తమ పారీ్టకి కోటికిపైగా ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, సినీ దర్శకుడు వి.వి.వినాయక్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రపుల్లారెడ్డి, బి.సంజీవరావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృతాసాగర్, సోషల్ మీడియా ఇన్చార్జి పాకాల డేనియల్, రాష్ట్ర కార్యదర్శులు కొయ్యాడ మహేశ్‌కుమార్, మాజిద్‌ఖాన్, సోమన్న, రాజశేఖర్, భూమిరెడ్డి, సాధిక్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచిస్తాం: సీఎం జగన్
పాలన అనేది దేవుడు ఇచ్చిన అవకాశం. పేదలకు మంచి చేయడానికి ఆ అవకాశం ఇచ్చాడు. ఆ మేరకు ఇప్పటికే ఎన్నెన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వాటిని ఇంకా ఏవిధంగా మెరుగు పరచాలని రోజూ ఆలోచిస్తుంటాను. -ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: తమది పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వలే ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,962 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హాడావుడి చేయడం ఆయనకు పేద ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని తెలియ జేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రాజకీయాలపైనే బాబు దృష్టి - అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్ అవ్వడం వరకు వెళుతున్నారు. - ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో - ఇప్పుడు మన పాలనలో.. - బీసీలకు 5 ఏళ్లలో మొత్తం రూ.30,976 కోట్లు, ఎస్సీలకు రూ.33,629 కోట్లు, ఎస్టీలకు రూ.12,488 కోట్లు, మైనారిటీలకు రూ.2,713 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,807 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏటా సగటున రూ.15,961 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. - దేవుడి దయ, ప్రజల దీవెనల వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18 నెలల్లోనే బీసీల కోసం రూ.37,931 కోట్లు, ఎస్సీల సంక్షేమం కోసం రూ.13,251 కోట్లు, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.3,879 కోట్లు, మైనారిటీల సంక్షేమంపై రూ.3,668 కోట్లు ఖర్చు చేశాం. - మొత్తంగా ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేశాం. ఆ మేరకు ఏటా సగటున ఎంత మొత్తం వ్యయం చేశామని చూస్తే అక్షరాలా రూ.39,153 కోట్లు. చంద్రబాబు హయాంతో పోలిస్తే రెట్టింపునకు పైగా ఖర్చు చేశాం. - చంద్రబాబునాయుడుకు ఏనాడూ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కలగదు. ప్రజల మనసులో చిరస్థాయిలో నిలవాలి.. వారి ఇళ్లలో మన ఫొటో ఉండాలన్న తపన, తాపత్రయం మనది. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పేదవారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు గుర్తుకు వస్తారు. - అందుకే ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్ ప్లాన్ తెచ్చాడు. అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకొచ్చారు. అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే. - ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబరు 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలు ఉంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే ఏడు లక్షల మందికి పెన్షన్ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది. రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర - గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. టీడీపీ అధికారంలో ఉండగా, ఎన్నికలు అప్పటికే ఆలస్యం అయ్యాయి కాబట్టి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. - అయినా చంద్రబాబు గెలుపుపై నమ్మకం లేక ఎన్నికలు జరపలేదు. ఆ రోజు ఆయన ఎన్నికలు నిర్వహించి ఉంటే, ఆ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిగేవి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేవి. కానీ తనకు అనుకూలంగా లేదని ఎన్నికలు జరపలేదు. - మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిజర్వేషన్‌తో ఎన్నికలు జరపాలని అని చెప్పి 2019 డిసెంబర్ 28న జీఓ 176 జారీ చేసి ఎన్నికలకు ముందుకు వెళ్లాం. అయితే అప్పుడు చంద్రబాబు కుట్ర చేసి, ఆయన పార్టీకి చెందిన ప్రతాప్‌రెడ్డితో (చంద్రబాబు, లోకేష్‌తో కలిసి ఉన్న ఫొటోలు చూపారు) కేసు వేయించాడు. - రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేశారు. వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఉన్న కెపాసిటీ మనకు లేదు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది. దేనిలోనూ చిత్తశుద్ధి లేదు - చంద్రబాబు ఏది చేసినా రాజకీయమే. చంద్రబాబు పెట్టిన బకాయిలు చూస్తే.. ఆయనకు ఎక్కడా చిత్తశుద్ధి అనేది, మంచి చేయాలన్న తపన అనేది లేదన్న విషయం తెలుస్తోంది. పేదలు పేదరికం నుంచి బయటకు రావాలంటే పథకాలు పక్కాగా అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇచ్చాడు. - ఆ పెద్దమనిషి ఆర్టీఎఫ్ కింద ఫీజు రీయింబర్స్మెంట్ 2017 - 18 నుంచి రూ.2,134 కోట్లు బకాయిలు పెట్టాడు. ఆ తర్వాత మెస్ బిల్లులకు సంబంధించి ఎంటీఎఫ్ కింద కూడా మరో రూ.790 కోట్లు బకాయి పెట్టాడు. అంటే దాదాపు రూ.3 వేల కోట్లు చంద్రబాబు ఫీజుల బకాయిలు పెడితే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ చెల్లించింది. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. - అలా తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారు కాలేజీలో మౌలిక వసతుల గురించి యాజమాన్యాలను ప్రశ్నిస్తారు. దానివల్ల కాలేజీలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తాయి. ఆ తర్వాత ప్రతి త్రైమాసిక ఫీజు కూడా తల్లుల ఖాతాలోనే వేసే వ్యవస్థను తీసుకువచ్చాం. వడ్డీలేని రుణాలు ఎత్తేశారు - చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఆగస్టు 2016 నుంచి పూర్తిగా ఆపడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. ఆ విధంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేశాడు. ఆ మొత్తం అక్క చెల్లెమ్మలు కట్టాల్సి వచ్చింది. - మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019-20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాను. ఒక తపన, తాపత్రయం ఉంటే ఏదైనా చూసే ధోరణి మారుతుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ - నిజానికి పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. అలా జరగాలంటే తల్లులు, పిల్లలకు మంచి ఆహారం ఉండాలి. పాఠశాలల్లో కూడా తగిన సదుపాయాలు, మంచి పునాదులు ఉండాలి. అప్పుడే పిల్లలు బాగా ఎదుగుతారు. అది తెలిసినా చంద్రబాబు ఏనాడూ పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ అని అమలు చేస్తున్నాం. ఆ పిల్లలు బాగుండాలి. వారి మెదడు వికసించాలి. తల్లులు బాగుండాలన్న తపన. ఆరాటం మాకు ఉంది. పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం - గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో బాత్రూమ్లు, నీళ్లు, ఫర్నీచర్ వంటి కనీస అవసరాలు కూడా లేకుండా చేశారు. దీంతో పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. మధ్యాహ్న భోజనం బిల్లులు 8 నెలలు పెండింగ్. పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఆ విధంగా ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయాలి. ఆ విధంగా ప్రభుత్వంపై భారం తగ్గించుకోవాలన్న ఆలోచన. వారు ప్రైవేటు స్కూళ్లకు పోవాలన్న ఉద్దేశంతో కావాలనే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు. - కానీ మన ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. ప్రతి స్కూలులో బాత్రూమ్లు, మంచినీళ్లు, ఫర్నీచర్, బ్లాక్‌బోర్డులు, లైట్లు, ఫ్యాన్లు, ప్రహరీ.. చివరకు పిల్లలకు యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్, షూస్, పుస్తకాలు అన్నీ ఇస్తున్నాం. - మధ్యాహ్న భోజన పథకం బాగు చేయాలని, ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచి, గ్రీన్ ఛానల్లో పెట్టి క్రమం తప్పకుండా వేతనాలు ఇస్తున్నాం. పక్కాగా మెనూ అమలు చేస్తూ, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇలా ప్రతి చిన్న విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాం. అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే.. - ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్తి స్థాయిలో ఏ ఒక్క లబ్ధిదారుడు మిస్ కాకుండా అర్హులందరికీ చేరాలన్నది మా ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏమేం చేశామని చెబుతూపోతే ఎంతైనా చెప్పవచ్చు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. - ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. - రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి. - అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61 లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం. మహిళా పక్షపాత ప్రభుత్వం - మహిళలకు సంబంధించి ప్రభుత్వ పథకాల్లో పెద్ద పీట వేశాం. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు ఉపాధి కల్పిస్తూ, ఆదాయం వచ్చేలా, వారి జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ యూనీ లీవర్, అమూల్ వంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఆ విధంగా రీటెయిల్ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం. - 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. వారు తమ కాళ్ల మీద నిలబడేలా, లక్షాధికారులు అయ్యేలా చర్యలు తీసుకున్నాం. - 6,82,467 మంది పెన్షనర్లలో వితంతువులు ఉన్నారు. వారికి పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి, వారికి చేయూత ఇవ్వొద్దని కొందరు చెప్పారు. అయినా వైఎస్సార్ చేయూత కింద వారికి ఆర్థిక సహాయం చేస్తున్న మానవతా దృక్పథం ఉన్న ప్రభుత్వం ఇది. - చివరకు 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. మహిళల రక్షణ కోసం దిశ చట్టం బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపాము. దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్ట్ పనుల్లో అక్క చెల్లెమ్మలకు 50 శాతం ఇస్తూ చట్టం చేశాం. దశల వారీ మద్య నియంత్రణ - దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. ఆ దిశలో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. అవి రద్దు కాకపోతే, గ్రామాల్లో అక్క చెల్లెమ్మలకు రక్షణ ఉండదని ఆ పని చేశాం. - మద్యం షాపులు ప్రైవేట్ వారి చేతిలో ఉంటే, బెల్టు షాపులు వస్తాయని చెప్పి, ప్రభుత్వమే స్వయంగా షాపుల నిర్వహణ చేపట్టింది. 33 శాతం మద్యం షాపులు (4382 నుంచి 2934 షాపులకు) తగ్గించాం. దాని వల్ల మద్యం అమ్మకాలు కూడా తగ్గాయి. షాపులు గతంలో రాత్రి 11 గంటలకు మూస్తే, ఇప్పుడు 8 గంటలకే క్లోజ్ చేస్తున్నాం. - మద్యం ధరలు షాక్ కొట్టేలా పెట్టాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయి. మనం అధికారంలోకి రాకముందు 2018 అక్టోబర్‌లో 32.28 లక్షల కేసులు మద్యం అమ్మితే, మనం అ«ధికారంలోకి వచ్చాక కేవలం 19.57 లక్షల కేసులు మాత్రమే అమ్మాం. - 2018 అక్టోబర్‌లో 23.86 లక్షల కేసుల బీర్లు అమ్మితే, ఆ తర్వాత 6.55 లక్షల కేసులు మాత్రమే అమ్మాం. 2018 నవంబర్‌లో (మనం అధికారంలోకి రాక ముందు) మద్యం 29.69 లక్షల కేసులు అమ్మితే, మనం అధికారంలోకి వచ్చాక కేవలం 19.43 లక్షల కేసులు అమ్మాం. 2018 నవంబర్‌లో 17.87 లక్షల కేసుల బీరు అమ్మితే, ఆ తర్వాత ఏడాది అదే సమయంలో కేవలం 5.93 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మాం. అయితే మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం తగ్గలేదు. ఎందుకంటే ధరలు పెంచాం కాబట్టి. - దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి చేయగలిగాం. గ్రామాల్లోకి పోతే అక్క చెల్లెమ్మలు సంతోషంగా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి కార్యక్రమంలో మంచి చేయాలని ఆరాట పడ్డాం. అలాగే చేస్తున్నాం.