World Famous Lover
-
'రూ.కోటి' ప్రకటనతో రౌడీ హీరోకి కొత్త తలనొప్పులు
హీరో విజయ్ దేవరకొండ 'ఖుషి' హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ ఒక్కటి లేదు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యేసరికి తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 100 కుటుంబాలకు కలిపి రూ.కోటి ఇస్తానని బంపరాఫర్ ప్రకటించాడు. ఇప్పుడు దీని వల్ల విజయ్ కి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటి పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా చాలా సినిమాల రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పరుచుకున్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఢమాల్ అన్నాయి. తాజాగా విజయ్ రూ.కోటి ఇస్తానని ప్రకటన చేయడంపై ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రవర్సీ ట్వీట్ చేసింది. (ఇదీ చదవండి: నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర) 'డియర్ విజయ్ దేవరకొండ. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం. కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. మీరు ఇప్పుడు.. 100 కుటుంబాలకు ఎంతో పెద్ద మనసుతో రూ.కోటి ఇస్తామని ప్రకటించారు. అలా ఎగ్జిబిటర్ల్, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీని ఆదుకుంటారని కోరుతున్నాం' అని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త ఇండస్ట్రీలో పాత సమస్యల్ని బయటకు తీసుకురావడమే కాదు, విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అయితే ఓ సినిమా విషయంలో లాభం, నష్టం అనేది డిస్ట్రిబ్యూటర్స్.. నిర్మాతలతో తేల్చుకోవాల్సిన విషయం. మరి ఇలా పబ్లిక్ గా విజయ్ పేరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ఏంటా అని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) Dear @TheDeverakonda , We lost 8 crs in the distribution of #WorldFamousLover, but no one responded over it!! Now as you are donating 1CR to the families with your big heart, Kindly requesting & Hoping for you to save us and our Exhibitors & Distributors families also 🤗❤️… pic.twitter.com/dwFHytv1QJ — ABHISHEK PICTURES (@AbhishekPicture) September 5, 2023 -
నీకిది తగునా... ఇకపై హద్దుమీరను..
సాక్షి, చెన్నై: ‘అందాల ఆరబోతలో హద్దు మీరను’ అంటోంది హీరోయిన్ రాశీఖన్నా. ‘ఇమైకా నొడిగళ్’ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ తరువాత జయం రవికి జంటగా ‘అడంగమరు’, విజయ్‌సేతుపతితో ‘సంఘతమిళన్’ వంటి సక్సెఫుల్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో అరణ్మణ్నై-3 చిత్రంలో నటిస్తోంది. త్వరలో దళపతి విజయ్‌తో నటించే అవకాశం తనకు రానుందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ అమ్మడు తెలుగులో విజయ్‌దేవరకొండకు జంటగా నటించిన వరల్ట్ ఫేమస్ లవర్ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు స్పందించిన రాశీఖన్నా తానిప్పుడు కథానాయకిగా మంచి స్థాయికి చేరుకున్నానంది. ఇకపై తన చిత్రాల కలెక్షన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో అందాల ఆరబోతలో హద్దులు దాటినట్లు, ఇది మీకు అవసరమా అని అందరూ ప్రశ్నిస్తున్నారని.. ప్రస్తుతం తాను హీరోయిన్గా మంచి స్థాయికి చేరుకున్న కారణంగా ఇకపై నటిగా మరో మెట్టు ఎక్కేందుకు ఉపయోగపడే పాత్రలనే ఎంచుకుంటానని తెలిపింది. అందుకే ఇకపై గ్లామర్ విషయంలో హద్దులు మీరనని చెప్పుకొచ్చింది. (‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ) అదే విధంగా మహిళల పాత్రలను కించపరచేవిధంగా తన చిత్రాల్లో చూపించినా సహించనని ఈ అమ్మడు స్పష్టం చేసింది. అలాంటి సన్నివేశాలు తాను నటించే సినిమాలో ఉన్నట్లయితే.. అవి నిజంగా అవసరమా అని దర్శకులను నేరుగానే ప్రశ్నిస్తానని చెప్పింది. కొన్ని సమయాల్లో తాను చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటారని, కొన్ని సమయాల్లో కథకు అవసరం అని వాదిస్తారని అంది. ఏదేమైనా తన అభిప్రాయాన్ని మాత్రం కచ్చితంగా చెబుతానని రాశీ స్పష్టం చేసింది. అయితే ఆమె.. ఈ మాటలు చెబుతున్నది ప్రచారం కోసమేనా.. లేదా నిజంగానే మహిళల గౌరవం కోసమేనా అన్నది వేచి చూడాలి. అయినా ఇలా ఇంతకు ముందు చాలా మంది హీరోయిన్లు... గ్లామర్ పాత్రల విషయంలో ఇలాగే మాట్లాడారు. అయితే వాటిని పాటించడంలోనే నిజాయితీ కనిపించలేదు. ఒకటి మాత్రం నిజం... ఎవరు ఏం చెప్పినా, ఏం చేసినా అవకాశాలు చేతిలో ఉన్నంత వరకే. ప్రస్తుతం రాశీఖన్నాకు తెలుగు, తమిళ భాషల్లో బాగానే డిమాండ్ ఉంది కాబట్టి తాను ఏం చెప్పినా అభిమానులు నమ్ముతారని అనుకుంటోందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. (రాశీ ఖన్నా బెదిరించేది) -
మేకింగ్ ఆఫ్ వరల్డ్ ఫేమస్ లవర్
-
‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ
-
ఆ మజానే వేరు: విజయ్ దేవరకొండ
టాలీవుడ్లోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ స్టైల్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇక రౌడీ(విజయ్) గురించి కానీ, అతని సినిమాల గురించి కానీ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో చాలాసార్లు ఈ రౌడీ ట్రోలింగ్‌కు గురయ్యాడు. సాధారణంగా సినిమా వాళ్లు ట్రోల్స్‌ను సహించరు. కానీ విజయ్.. అలా కాకుండా ట్రోలింగ్‌లో ఉండే మజానే వేరంటున్నాడు. మనల్ని ట్రోల్ చేస్తున్నారంటే మనగురించి ఆలోచిస్తున్నట్లే కదా అని లాజిక్ మాట్లాడుతున్నాడు. కాగా ఆయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న విజయ్ సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్‌పై స్పందించారు. ‘ఐ లవ్ ట్రోలింగ్స్..’ అంటూ మీమ్స్ క్రియేటర్లకు షాకిచ్చారు. ‘ట్రోలింగ్‌ను నేను ఇష్టపడుతాను. ట్రోల్ చేయడానికి నన్ను ఎంచుకుని, నాకోసమే ఆరా తీస్తున్నారు. అది నేను అనుసరిస్తున్న ఫ్యాషన్ కానీ, సినిమాలు కానీ ఏదైనా కానివ్వండి. కానీ నా కోసమే ప్రత్యేకంగా సమయం వెచ్చించి అందరినీ ఆకట్టుకునేలా మీమ్స్, వాటికి అనుగుణంగా క్యాప్షన్స్ తయారు చేస్తున్నారు. ఆ విధంగా నన్ను ట్రోల్ చేసేవారు నిద్రలేని రాత్రలు గడుపుతున్నారు.. అంటే వారి కలలో కూడా నేనే ఉంటున్నాను. కాబట్టి మీరూ ట్రోలింగ్‌ను ఎంజాయ్ చేయండి’ అంటూ రౌడీ సలహా ఇచ్చాడు. కాగా ఈ హీరో చివరి ప్రేమకథా చిత్రంగా పేర్కొన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తొలిరోజే నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది. చదవండి: వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ
టైటిల్: వరల్డ్ ఫేమస్ లవర్ జానర్: లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్ దర్శకత్వం: క్రాంతి మాధవ్ సంగీతం: గోపీ సుందర్ నిర్మాతలు: కేఏ వల్లభ, కేఎస్ రామారావు నిడివి: 155.37 నిమిషాలు టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫీల్‌గుడ్ చిత్రాల డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. టైటిల్ ప్రకటించినప్పట్నుంచి ఈ చిత్రంపై అందరిలోనూ పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్ వంటి నలుగురు హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇదే తన చివరి లవ్ స్టోరీ అని విజయ్ దేవరకొండ ప్రకటించడంతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’పై అందరి చూపు పడింది. ఇన్ని అంచనాల నడుమ ప్రేమికుల రోజు కానుకగా శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. మరి అందరి అంచనాలను ఈ చిత్రం నిలబెట్టిందా? ఈ సినిమాతో విజయ్ సిక్సర్ కొట్టాడా? లేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: ఒంటి నిండా గాయాలతో చెదిరిన జట్టు మాసిన గడ్డంతో హీరో జైల్లో ఉన్న సీన్‌తో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ప్రతీ ఒక్క మనిషికి ఒక కథ ఉంటుంది.. తనకూ ఓ కథ ఉంటుంది అంటూ హీరో తన కథ చెప్పడం, రాయడం ప్రారంభిస్తాడు. హైదరాబాద్, ఇల్లందు, ప్యారిస్‌ల చుట్టు హీరో కథ తిరుగుతుంది. ఈ కథలో ఎన్నో మార్పులు, ఊహించని ఎన్నో మలుపులు చివరికి అందరూ కోరుకునే ముగింపుతోనే సినిమాకు ఎండ్ కార్డు పడుతుంది. అసలు కథ ఏంటో, ట్విస్టులు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గూగుల్ మ్యాప్ కూడా చూపెట్టని ఓ అడ్రస్ కోసం హైదరాబాద్ గల్లీల్లో తిరుగుతూ అవస్త పడుతున్న యామిని (రాశీ ఖన్నా)కి గౌతమ్ (విజయ్ దేవరకొండ) తారసపడతాడు. అడ్రస్ చూపించడంతో పాటు తన మనుసును కూడా యామినికి గౌతమ్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత యామిని కూడా గౌతమ్ ప్రేమలో పడిపోతుంది. చిన్నప్పట్నుంచి రచయిత కావాలనేది గౌతమ్ డ్రీమ్. అయితే యామిని చెప్పిన ఒకే ఒక్క మాట కోసం గౌతమ్ ఉద్యోగం చేస్తాడు. అలా నాలుగేళ్ల ప్రేమ.. ఏడాదిన్నర సహజీనంతో వారిద్దరి జీవితం సాఫీ సాగిపోతున్న తరుణంలో గౌతమ్‌కు యామిని బ్రేకప్ చెబుతుంది. ఎందుకు బ్రేకప్ చెబుతుంది? అసలు ఈ కథలోకి సువర్ణ(ఐశ్వర్య రాజేశ్), స్మిత(క్యాథరీన్), ఈజ(ఇజాబెల్లే)లు ఎందుకు ఎంటర్ అయ్యారు? గౌతమ్ సీనయ్యగా ఎందుకు మారాడు? అసలు గౌతమ్ ఎందుకు ప్యారిస్ వెళ్లాడు? గౌతమ్ చివరికి రైటర్ అయ్యాడా? గౌతమ్ యామినిలు చివరికి కలుసుకున్నారా అనేదే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కథ. నటీనటులు: వన్ మ్యాన్ షో, అతడే ఒక సైన్యం, ఒకే ఒక్కడు ఇలా ఎన్ని చెప్పినా విజయ్ దేవరకొండ గురించి తక్కువే అవుతుంది. సినిమాకు ప్రాణం పోశాడు. గౌతమ్, శ్రీను పాత్రలలో విజయ్ తప్ప మరో హీరోను కలలో కూడా ఊహించని విధంగా మెస్మరైజ్ చేశాడు. అక్కడక్కడా అర్జున్‌రెడ్డి ఫ్లేవర్ కనిపించినా ఆకట్టుకుంటుంది. కామెడీ, ఎమోషన్, కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని కోణాలను విజయ్ తన నటనలో చూపించాడు. హీరో తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాశీ ఖన్నా గురించి. కొన్ని సన్ని వేశాలలో అందంతో ఆకట్టుకోగా.. మరికొన్ని చోట్ల ఏడిపించేసింది. కథా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న మరో నటి ఐశ్వర్యా రాజేశ్. సువర్ణ అనే డీ గ్లామర్, మధ్య తరగతి గృహిణి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. క్యాథరీన్, ఇజాలకు నటనపరంగా కంటే తమ అందాలతో కుర్రకారును కట్టిపడేశారు. కొన్ని చోట్ల సైదులు(మై విలేజ్ షో అనిల్) తనదైన రీతిలో నవ్వించగా.. గౌతమ్ స్నేహితుడిగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. విశ్లేషణ: ‘ప్రేమ అంటే ఓ సాక్రిఫైస్, కాంప్రమైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది’అనే ఓ చిన్న లైన్ పట్టుకొని పూర్తి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. జైలు సీన్.. ఆ తర్వాత రాశీ ఖన్నా, విజయ్ దేవరకొండల మధ్య సీన్లతో సినిమా కథను మెల్లగా ఆరంభించాడు దర్శకుడు. సినిమా మొదలైన కాసేపటికి అసలు కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. హీరో సాధారణ ఎంట్రీ, హీరోయిన్స్‌తో రొమాన్స్, లవ్ సీన్స్, ఇల్లందు ఎపిసోడ్‌తో ఫస్టాఫ్ అంతా అలా సాదా సీదాగా సాగిపోయింది. అయితే విజయ్, ఐశ్యర్యల మధ్య వచ్చే కొన్ని సీన్లు రియాలిస్టిక్‌గా ఉంటాయి. మన ఇంట్లో, మన ఊళ్లో జరిగిన, చూసిన విధంగా ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్ పూర్తిగా తేలిపోయాడు. కథను ఏ కోణంలో రక్తికట్టించలేకపోయాడు. బోరింగ్, సాగదీత సీన్లు థియేటర్లో ఉన్న ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటాయి. కొన్ని ఎమోషన్ సీన్లు కట్టిపడేసేల ఉంటాయి. అంతేకాకుండా ప్రీ క్లైమాక్స్‌కు ముందు విజయ్ ఇచ్చే స్పీచ్ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుందనుకున్న తరుణంలో.. అర్జున్‌రెడ్డి క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగిస్తాడు. అయితే కథ కొత్తగా, వినూత్నంగా ఉంది. సీన్లు కూడా బాగున్నాయి. విజయ్ దేవరకొండ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దర్శకుడు తన ప్రతిభను, మ్యాజిక్‌ను తెరపై పర్ఫెక్ట్గా చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో, హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. స్క్రీన్ ప్లే గజిబిజీగా కాకుండా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది. పాటలు ఓ మోస్తారుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. క్రాంతి మాధవ్ అందించిన మాటలు ఆకట్టుకుంటాయి. ‘కలం కాగితం లేకుండా ప్రపంచ చచ్చిపోతుంది, రాయడం అంటే రచయిత తన ఆత్మను పంచడం, ప్రపంచ బాధలను తన బాధలుగా భావించి రచయిత రాయడం ప్రారంభిస్తాడు’ అంటూ చెప్పే డైలాగ్‌లు ఆలోచించే విధంగా ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమాను తెరపై చూస్తే అర్థమవుతుంది. చివరగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోయినా విజయ్ దేవరకొండ కనెక్ట్ అయ్యాడు. ప్లస్ పాయింట్స్: విజయ్ దేవరకొండ నటన ఇల్లందు ఎపిసోడ్ కాన్సెప్ట్ మైనస్ పాయింట్స్ సాగదీత, బోరింగ్ సీన్లు సినిమా నిడివి దర్శకత్వ లోపం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
రాశీ ఖన్నా బెదిరించేది
‘‘నా సినిమాలకి బజ్ ఉండేది మీవల్లే (అభిమానులు) అని నాకు అర్థమైంది. మీ రౌడీస్ వల్ల, తెలుగు సినిమా ప్రేక్షకుల వల్ల ఈ బజ్ క్రియేట్ అవుతోంది. నేను నటించిన ఏ సినిమాకి వెళ్లినా మీకు ఒక కొత్త అనుభూతి ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నా. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా మీకొక కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో షూటింగులో ఉండటం వల్ల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకి ఎక్కువగా ప్రమోట్ చెయ్యలేదు. రాశీఖన్నా అయితే ‘నువ్వు రావాలి, బజ్ క్రియేట్ చెయ్యాలి, హైప్ క్రియేట్ చెయ్యాలి’ అని రోజూ ఫోన్ చేస్తూ నన్ను బెదిరిస్తూ వచ్చింది. ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు. మీరే చెప్పాలి’’ అన్నారు. ‘‘మా నాన్నగారు ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ లాంటి సినిమాలు వైజాగ్‌లో తీశారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వేడుకకి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు కె.ఎ. వల్లభ. ‘‘మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో ఈ సినిమా చేశాడు. థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చెయ్యండి’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. -
ప్రేమికుల రోజున ఎన్నో ప్రేమ చిత్రాలు
న్యూఢిల్లీ : ‘ప్రేమ’ అంటే ఎన్నో అనుభూతులు, మరెన్నో అర్థాలు. కాల గమనంలో ప్రేమ వ్యక్తీకరణ పద్ధతులు మారుతూ వస్తున్నాయి. మార్గాలు, పద్ధతులు ఎన్ని మారినా ‘ప్రేమ’కు భావోద్వేగం అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే అని ప్రేమ ఫిలాసఫర్లు వాదిస్తున్నారు. అసలు ఏది నిజమైన ప్రేమ ? అంటూ ఇప్పటికీ అన్వేషిస్తున్నవారు, నిజమైన ప్రేమను ఎలా దక్కించుకోవాలంటూ శోధిస్తున్న వాళ్లూ సమాజంలో అక్కడక్కడా మనకు కనిపిస్తారు. అలా శోధించే ఇద్దరు యువకులకు సంబంధించిన ప్రేమ కథే ‘లవ్ ఆజ్ కల్ 2’ బాలీవుడ్ చిత్రం ‘వాలంటైన్స్ డే’ సందర్భంగా శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అందులో వీర్, జో అనే కథానాయకులిద్దరూ ప్రేమాన్షేషణలో తమ అదష్టాన్ని వెతుక్కుంటూ వెళతారు. కార్తీక్ ఆర్యన్, సార అలీ ఖాన్, అరుషి శర్మ, రందీప్ హూడ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఎంత మేరకు ప్రేమను పడ్డిస్తుందో, ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. వరల్డ్ ఫేమస్ లవర్ ‘వాలంటైన్స్ డే’ను పురస్కరించుకొని నేటి తరం యువ నటుడు విజయ్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా నాలుగు కథల సమాహారం. ఓ గ్రామంలో సీనయ్య, సువర్ణ అనే మధ్య తరగతికి చెందిన ఓ జంట ప్రేమించుకోవడం, గౌతమ్ అనే రోమాంటిక్ హీరో పారిస్ వీధుల్లో తన గర్ల్ ఫ్రెండ్ ఐజాతో తిరగడం, కార్మిక సంఘం నాయకుడు హై హీల్స్ సుందరి అయిన తన బాస్‌ను ప్రేమించడం, మరో కాలేజీ ప్రేమ కథ సమాహారమే ఈ సినిమా. ఇందులో విజయ దేవరకొండతోపాటు రాశి ఖన్నా క్యాథరినా ట్రేసా, ఇజా బెల్లా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ మై కడువలే ప్రేమ ప్రపంచంలో ఈత కొట్టడం, మిత్రులతో ఎల్లప్పుడూ సరదాగ గడపడమే ప్రధాన సూక్తిగా విడుదలవుతున్న ఈ తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి, అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హిప్పాప్ తమిళ, ఐశ్వర్య మీనన్‌లు నటించిన మరో తమిళ సినిమా ‘నాన్ సిరిథాల్’ కూడా శుక్రవారమే విడుదలవుతోంది. ఆపేక్ష పీ మహేశ్, ఆశిక్ నటించిన కన్నడ చిత్రం ‘సగుటా దూర దూర’, విక్రమ్ రవిచంద్రన్, ఆకాంక్ష శర్మ నటించిన మరో కన్నడ చిత్రం ‘త్రివిక్రమ్’, ప్రజ్వల్ దేవరాజ్, భావన నటించిన ‘ఇనిస్పెక్టర్ విక్రమ్’ కన్నడ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. పలు బెంగాలీ, పంజాబ్, మరాఠీ చిత్రాలతోపాటు పలు ఆస్కార్ అవార్డులు పొందిన ‘జోకర్, వన్సాపనే టైమ్ ఇన్ హాలివుడ్లతోపాటు ఫాంటసీ ఐలాండ్, ఆర్డినరీ లవ్, బెర్లిన్ ఐ లవ్ యూ చిత్రాలు ‘వాలంటైన్స్ డే’ను పురస్కరించుకొని విడుదలవుతున్నాయి. వీటిలో కొన్ని కొత్తగా విడుదలవుతుండగా, కొన్ని పునర్ విడుదలవుతున్నాయి. -
మీ లవ్.. నా లక్!
‘అవధుల్లేని మీ అభిమానం నేను జీవితంలో పొందిన పెద్ద అదృష్టం. ఇంతమంది అభిమానులు ఉండడం నాకు లభించిన చాలా పెద్ద బహుమతి’ అని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను బుధవారం గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : ‘అవధుల్లేని మీ అభిమానం నేను జీవితంలో పొందిన పెద్ద అదృష్టం. ఇంతమంది అభిమానులు ఉండడం నాకు లభించిన చాలా పెద్ద బహుమతి’ అని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను బుధవారం గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన కోసం వెల్లువలా వస్తున్న అభిమానులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుందని తెలిపారు. ‘నాకోసం వస్తున్నారు. నాకోసం థియేటర్స్ నింపుతున్నారు. ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులు ఉండడం ఎంత అదృష్టం. అందుకే వారిని చూసినప్పుడు కౌగిలించుకోవాలని అనిపిస్తుంది.’ అని చెప్పారు. తన సినిమాపై క్రేజ్ ఉండటానికి కారణం రౌడీస్ అభిమానులని తెలిపారు. తన ప్రతి సినిమాలో కొత్తదనం కనిపిస్తుందన్నారు. అభిమానులతో రాశీఖన్నా సెల్ఫీ కొత్తదనం కోసమే తాను ఆరాటపడతానని తెలిపారు. నాలుగు ప్రేమ కథలు కలిపి తీర్చిదిద్దిన ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. ఆదరించండి.’ అని కొరారు. ఈ సందర్భంగా అభిమానులకు రౌడీ హగ్‌లు, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చారు. హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ ఈ చిత్రంలో విజయ్ చాలా బాగా నటించారని కితాబిచ్చారు. నిజ జీవితంలో ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులు తెలుసుకోవచ్చని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చూడడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ షూటింగ్ వైజాగ్‌లోనే చేశామని గుర్తు చేసుకున్నారు. వైజాగ్ ప్రజలు చాలా మంచి మనసున్నవారని కొనియాడారు.. ‘వైజాగ్ వండర్ఫుల్ సిటీ, చాలా అందమైన జ్ఞాపకాలను అందించిన నగర.’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వల్లభ, కిందు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ లుక్‌లో విజయ్.. హీరో విజయదేవరకొండ లుంగీ కట్టుకుని, టవల్ తలకు చుట్టుకొని ఈ వేడుకల్లో పాల్గొని ప్రేక్షకులను మైమరపించారు. లుంగీతో స్టేజ్ పైకి వచ్చిన విజయ్ దేవరకొండను చూసి అభిమానుల కేకలు, అరుపులతో గురజాడ కళాక్షేత్రం దద్దరిల్లింది. వేడుకలో భాగంగా ప్రదర్శించిన నాట్యాలు అందరినీ ఆహ్లాదంలో ముంచెత్తాయి. -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
-
నాది ఓవర్ కాన్ఫిడెన్స్
‘‘నేను ప్రేమకథా చిత్రాలు చేయనంటే కేవలం వాణిజ్య అంశాలతో కూడుకున్న సినిమాలే చేస్తానని కాదు. ‘టాక్సీవాలా’ (2018) లాంటి ప్రేమకథ చిత్రం వస్తే చేస్తానేమో. ప్రేమే ప్రధానాంశంగా ఉన్న ‘అర్జున్‌రెడ్డి’ (2017), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటివి చేయకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కెరీర్లో ఓ మార్పు కోరుకుంటున్నాను. పూరీగారితో సినిమా చేస్తున్నాను కాబట్టి నాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కాదు. చిన్నతనం నుంచే నాది ఓవర్ కాన్ఫిడెన్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు. నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నప్పుడు... ‘మీ నాన్నగారికి కుదర్లేదు కదా. సక్సెస్ ఉండదు. డబ్బులు రావు’ అన్నారు. సో.. మెంటల్‌గా భయంగానే ఉంటుంది. ఇప్పటికీ నాకు ఆ భయం ఉంటుంది. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని మనల్ని మనం నిరూపించుకోవాలి. లేకపోతే భయంలోనే కొట్టుకుంటూ పోతాం. కొత్త తరం మారాలి. అందుకు నా వంతు డ్యూటీ చేస్తాను. ► స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉన్నాయి. వీటిలో సీనయ్య, సువర్ణల ప్రేమకథ ఒకటి. ఒక చిన్న ఊర్లో పెద్దగా చదువు లేని భార్యాభర్తల మధ్య సాగే కథ. ఇందులో సీనయ్య పాత్రకు బాధ్యతలు ఎక్కువ. ఈ పాత్రకు రిఫరెన్స్‌గా మా నాన్నగారిని తీసుకున్నాను. మరోవైపు బాధ్యత అనేదే తెలియకుండా సౌకర్యంగా ప్యారిస్‌లో జీవితాన్ని గడిపే ఓ యువకుడి లవ్‌స్టోరీ. ఇంకోటి కొత్తగూడెంలోని ఓ కాలేజీ ప్రేమకథ. ఈ లవ్‌స్టోరీకి కాస్త ‘అర్జున్ రెడ్డి’ టచ్ ఉండొచ్చు. మూడు ప్రేమకథలకు సినిమాలో రిలేషన్ ఉంది. అదేంటో ప్రేక్షకులు వెండితెరపై చూడాలి. ►ఈ సినిమా కోసం మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. కొత్తగూడెం లవ్‌స్టోరీకి మీసాలు పెట్టి, చిన్న జుట్టు ఉన్న హెయిర్‌స్టైల్‌తో కనిపించాలి. ప్యారిస్ కథకు కొంచెం ఫ్యాషన్‌గా కనిపించాలి. కాలేజ్ కథకు ఆ స్పెషల్ టచ్ ఉండాలి. ఇలా క్యారెక్టర్స్ కోసం శ్రమించాల్సి వచ్చింది. క్రాంతి (చిత్రదర్శకుడు క్రాంతి మాధవ్) బలం రైటింగ్. నా నటనను పక్కనపెడితే మిగతా క్రెడిట్ ఆయనకు, కెమెరామేన్ జయకృష్ణ గుమ్మాడి, నిర్మాత కేఎస్ రామారావుగారికి దక్కుతుంది. ► నేను యాక్షన్ సినిమాకి గెడ్డం పెంచినా, ఓ సైన్స్‌ఫిక్షన్ సినిమాకి గెడ్డం పెంచినా ‘అర్జున్‌రెడ్డి’యే అంటారు. అది నాకు తప్పదు. ఒక ఫ్లాప్ సినిమాతో కంపేర్ చేస్తే అది నన్ను బాధపెడుతుంది. కానీ ‘అర్జున్‌రెడ్డి’ లాంటి క్రేజీ హిట్ మూవీతో పోల్చడం బాగానే ఉంది. ► ‘వరల్డ్ ఫేమస్...’ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చినవారిని (ఫ్యాన్స్) చూసి ఆశ్చర్యపోయాను. వారితో నాకు ఏ అనుబంధం లేకపోయినా ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనుకున్నా! టికెట్ బుకింగ్స్ చూసి షాకయ్యాను. వారి ప్రేమ, అభిమానం గొప్పవి. అందుకే మా ఆడియన్స్‌కు నా బెస్ట్ వెర్షన్ సినిమాలను ఇవ్వాలనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు శక్తివంచన లేకుండా కష్టపడాలనుకుంటున్నాను. ► ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నా తొమ్మిదో సినిమా. వీటిలో ఆరు సినిమాలు కొత్త దర్శకులతో తెరకెక్కినవే. మొదట్లో సర్వైవల్ కోసం సినిమాలు చేశాను. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. రాబోయే రెండేళ్లు యాక్టర్‌గా నా కెరీర్లో న్యూ ఫేజ్ అనుకుంటున్నాను. కొత్త రకం కథలను ప్రయత్నించాలనుకుంటున్నాను. ► నిజానికి ప్రేమ కాన్సెప్ట్ నాకు ఒకప్పుడు నాన్సెన్స్లా తోచింది. ప్రేమలో కూడా చాలా దశలు ఉంటాయి. ఒక అబ్బాయి ముందు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. నాది ట్రూ లవ్ అంటాడు. అనుకోని కారణాల వల్ల అది బ్రేకప్ అయినప్పుడు వేరే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అది కూడా ట్రూ లవ్ అంటాడు. అసలు ఎవరితోనూ ప్రేమలో లేనప్పుడు... మొదట ప్రేమించిన అమ్మాయి, రెండోసారి ప్రేమించిన అమ్మాయి ఒకేసారి కనిపిస్తే, ఎవరితో ముందుగా ప్రేమలో పడతాడు? అనే అయోమయంలో ఉండేవాడిని. ఇప్పుడు అలా లేదు. జీవితంలో లవ్ అనే స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలనే ఆలోచన ఉన్న ఫేజ్‌లో ఉన్నాను. ట్రూ లవ్ ఉంటుందనే అనుకుంటున్నాను. ► పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అనేది బాధ్యతతో కూడుకున్నది. ఆ బాధ్యత తీసుకోవడానికి ప్రస్తుతం నేను మానసికంగా సిద్ధంగా లేను. నాకు 30 ఏళ్లు వచ్చాయి. కొన్ని విషయాల్లో పెద్దవాణ్ని అయిపోయాననిపిస్తుంది. కానీ పెళ్లి అనగానే నేను ఇంకా పిల్లోణ్నే అనిపిస్తుంది. ► నా గురించి వ్యతిరేక వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసేవారు ఉంటారు. వారు నా గురించి అంతగా ఆలోచిస్తున్నారు అంటే వారికి నేనంటే ఎంతో ప్రేమ ఉండి ఉంటుంది. వారు నిద్రపోయేప్పుడు కూడా నేనే గుర్తుకు వస్తానేమో. విమర్శలను ఇష్టపడతాను. కానీ విలువైన విమర్శలనే తీసు కుంటాను. -
'రాశి'బాగుంది..
సినిమా : నటి రాశీఖన్నా రాశి బాగుంది. ఆమె రాశి బాగుండబట్టే కదా తెలుగు, తమిళ భాషల్లో నాయకిగా రాణిస్తోంది అని అంటారా? అదీ కరెక్టే కానీ కోలీవుడ్‌లో ఇప్పుడు ఆమె టైమ్ ఇంకా బాగుంది. కారణం ఇళయదళపతితో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇంతకు ముందు జయంరవికి జంటగా అడంగమరు, అధర్య సరసన ఇమైకా నొడిగళ్, విజయ్‌సేతుపతితో సంఘతమిళన్ వంటి చిత్రాల్లో రాశీఖన్నా నటించింది. ఆ చిత్రాలు మంచి సక్సెస్‌నే అందుకున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌కు జంటగా సైతాన్ కా బచ్చా, సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 3 చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో విజయ్‌దేవరకొండతో జత కట్టిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌తో నటించే అవకాశం రాలేదు. కాగా విజయ్ వంటి స్టార్‌తో నటించే అవకాశం వస్తే ఆ స్టార్డమ్నే వేరు. అలాంటి క్రేజీ ఆఫర్‌ను రాశీఖన్నా కొట్టేసిందన్నది తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం మాస్టర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటి మాళవికామోహన్ నటిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఫైట్ సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. అదే విధంగా అరుణ్‌రాజ్ కామరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌కు జంటగా నటి రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. మరో ముఖ్య పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటించనున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె విజయ్‌కి చెల్లెలుగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే ఈ అమ్మడు ఎవరికి చెల్లెలిగానైనా నటిస్తాను కానీ విజయ్‌కు చెల్లెలిగా నటించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అలాంటి పాత్రనే విజయ్‌తో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి దీనికి ఏం చెప్పి సమర్ధించుకుంటుందో ఐశ్వర్యరాజేశ్. కాగా ఇంతకు ముందు కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎంగవీట్టు పిళ్లై చిత్రంలో ఈ అమ్మడు శివకార్తీకేయన్‌కు చెల్లెలిగా నటించింది. మాస్టర్ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే తాజా చిత్రానికి విజయ్ రెడీ అవుతారని తెలిసింది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా విజయ్ నటించనున్న 65వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నేను సిక్స్ కొట్టాలనే దిగుతా
‘‘చాలామంది దగ్గర తెలివితేటలు, ప్రతిభ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రతిభ, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న మనిషి విజయ్. అతని ప్రయాణం ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఒకనాడు నేను ఈర్ష్య పడేంత ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది’’ అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అప్పట్లో చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలని తీశారు రామారావుగారు. మళ్లీ అంతకు మించిన హిట్ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నేను, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాణ్ని. మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం విజయ్’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ‘‘ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత డి. సురేష్ బాబు. ‘‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేలా విజయ్ కెరీర్ నడుస్తోంది. తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాశా’’ అన్నారు క్రాంతిమాధవ్. ‘‘విజయ్ ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఖన్నా పోటాపోటీగా నటించారు’’ అన్నారు కేఎస్ రామారావు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘2016లో ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక లీడ్ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం.. చేతి నుంచి జారిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ జర్నీలో స్థిరమైన వాటిలో మీరు (ఫ్యాన్స్) ఉన్నారు. నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ నాకు ఓపిక లేదు. ఇక నుంచి సిక్సులు కొట్టడానికే చూస్తా’’ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, ఇజాబెల్లా, కేథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ మాట్లాడారు. -
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది
‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రిలీజ్ అయినప్పుడు టీజర్ బావుంది అన్నారు. కానీ నా పాత్రకి కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి పాత్ర రాశీఖన్నా ఎందుకు చేసింది? అన్నారు. యాక్టర్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉండలేం కదా. ఎప్పుడో ఓసారి దాన్ని బ్రేక్ చేయాలి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో అలాంటి ప్రయత్నం చేశాను. ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాశీఖన్నా. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను కేయస్ రామారావు నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో నేను చేసిన యామినీ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ రోల్. చాలెంజింగ్‌గా అనిపించింది. ► యామినీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. నా పాత్ర నేనే చేసినట్టుంది. నిజ జీవితంలో నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను. స్ట్రాంగ్ ఉమెన్ ఎమోషనల్ సైడ్‌ని బయటకు చూపించకూడదనుకుంటాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ► సాధారణంగా నాకు లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం. దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ► సినిమాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నేనే ఉండాలి అనుకోను. మనం చేసే పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నాకేం ప్రాబ్లమ్ లేదు. యాక్టర్‌గా నేను చాలా సెక్యూర్‌గా ఉంటాను.ఒకవేళ ఈ సినిమాలో నా పాత్ర కాకుండా వేరే పాత్రను ఎంచుకోమంటే ఐశ్వర్యా రాజేశ్ చేసిన పాత్ర చేస్తాను. ► వేలంటైన్స్ డే అంటే నాకు ఇష్టం. ప్రేమను చెప్పడానికి ధైర్యం తెచ్చుకుని చెబుతుంటారు. వేలంటైన్స్ డేకి ఇది పర్పెక్ట్ సినిమా. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ప్రకటిస్తాను. ► ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ‘అర్జున్ రెడ్డి 2’ అన్నారు. కానీ ట్రైలర్‌తో ఆ అభిప్రాయం మారిపోయింది. విజయ్ గడ్డంతో ఉంటే అర్జున్ రెడ్డిలానే ఉంటారు. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు. -
ఆ పేరొస్తే చాలు
‘‘బాక్సాఫీస్ వసూళ్ల గురించి నేను పట్టించుకోను. నా పాత్రకి న్యాయం చేయడానికి 100శాతం కష్టపడతా. నా నటన బాగుందనే పేరు వస్తే చాలనుకునే మనస్తత్వం నాది’’ అని కేథరిన్ అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, పెళ్లి, అనుబంధాలు వంటి అంశాలను ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో చక్కగా చెప్పారు. ఆధునిక ఆలోచనలతో స్వంతంత్ర భావాలున్న స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. నేనొక బొగ్గు గనిలో పని చేస్తుంటాను. ఆ ప్రాంతంలో పని చేసే హీరోతో నాకున్న అనుబంధం ఏంటి? అతని జీవితంపై నా ప్రభావం ఎంత? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు ఉన్నా అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉన్న చిత్రాల్లో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విజయ్ దేవరకొండతో పని చేయడం మంచి అనుభూతినిచ్చింది. సెట్స్‌లో ప్రశాంతంగా ఉంటూ పనిలో మాత్రం పర్ఫెక్షన్ కనబరచాలని తపిస్తాడు. ఇది నా కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సవాల్‌తో కూడిన పాత్రలు చేసి, ప్రేక్షకుల అభిమానం పొందాలనుకుంటున్నా’’ అన్నారు. -
నా చివరి ప్రేమ కథ ఇదే
‘‘నా గత చిత్రాలన్నింటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కోసమే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నా చివరి ప్రేమ కథా చిత్రమిది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మనిషిగా కొంచెం మారుతున్నా.. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం అని తెలిసిపోయింది. అందుకే ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. క్రాంతి మాధవ్‌కు పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ తెలుగు ప్రేక్షకుల సినిమాలా ఉండదు.. హాలీవుడ్, హిందీ సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్‌కి మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు కె.ఎస్. రామారావు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఈ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఈ సినిమాలోని యామిని పాత్ర బెస్ట్’’ అన్నారు రాశీఖన్నా. ‘‘ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా’’ అన్నారు కేథరిన్. ‘‘ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు ఇజా బెల్లా. -
వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రిలీజ్
-
ఇదే నా చివరి ప్రేమ కథా చిత్రం: విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. తరువాత వచ్చిన గీత గోవిందం కూడా విజయాన్ని అందుకోవడంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తరువాత ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ నిరాశపరచిన హిందీలో సక్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. (ట్రైలర్ రెడీ) ఈ చిత్రంలో రాశీఖన్నా, కేథరిన్,ఐశ్వర్య రాజేష్, ఈషాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు’ లాంటి అద్భుతమైన ప్రేమకథ చిత్రాన్ని అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ వరల్డ్ ఫేమస్ లవర్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఆకట్టుకోగా, చిత్ర యూనిట్ గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. చదవండి : ప్రేమికుడు వచ్చేశాడు ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పూర్తి ప్రేమను నింపి ఈ సినిమాలో పని చేశానని తెలిపాడు. ఇదే తన చివరి లవ్ చిత్రం కావొచ్చని, ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 9న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఫిబ్రవరి 14 సినిమా రిలీజ్ రోజు మరోసారి తన రౌడీ అభిమానుల్ని కలుస్తానని విజయ్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ట్రైలర్ రెడీ
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరీన్, ఇజబెల్లా నటించారు. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు విజయ్. ఈ లుక్స్ ఉన్న మిస్టరీకి ఈ గురువారం క్లూ దొరుకుతుంది. ఈ చిత్రం ట్రైలర్ గురువారం విడుదల కానుంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతోంది. -
కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ తప్పదు
‘‘నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు తక్కువగా చేయడం నా కెరీర్ ఎదుగుదలకు మైనస్ అవుతుందని అనుకోవడం లేదు. నాకు మంచి అవకాశాలే వస్తున్నాయి. బాగానే సంపాదిస్తున్నా’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కథానాయికలుగా రాశీఖన్నా, కేథరీన్ , ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా నటించారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► 2018లో ఓ అవార్డు ఫంక్షన్ కోసం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు క్రాంతిమాధవ్‌గారు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ చెప్పారు. బాగా నచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నాకు తెలిసి గత పదేళ్లలో సువర్ణలాంటి పాత్రను ప్రేక్షకులు చూసి ఉండరు. ఈ సినిమాలో నాతో పాటు ముగ్గురు హీరోయిన్లు నటించారు. కానీ కథ రీత్యా ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది. ► విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో హీరోయిన్స్‌కు మంచి పాత్రలు దక్కాయనిపించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నా పాత్ర బాగానే ఉంటుంది. క్రాంతిమాధవ్‌గారు చాలా సెన్సిబుల్ డైరెక్టర్. సహజత్వానికి చాలా దగ్గరగా సినిమాలు తీస్తుంటారు. కేయస్ రామారావుగారు మంచి నిర్మాత. ► కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సన్నివేశాలు తప్పవు. అనవసరంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండకూడదు. నేను నటించిన ‘వడచెన్నై’ చిత్రంలో నాలుగు లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయి. ఈ తరంలో దాదాపు అందరూ ఓపెన్ గానే ఉంటున్నారు. ఒక పెద్ద కమర్షియల్ సినిమా ఫ్లా్లప్ అయితే హీరోయిన్ అన్‌లక్కీ అని కొందరు అంటుంటారు. ఆ లాజిక్ నాకు అర్ధం కాదు. ► ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. జయలలితగారి బయోపిక్‌లో నటించాలనుకున్నాను. ఇప్పుడు జయలలితగారి బయోపిక్స్ వస్తున్నాయి. నా ఫేవరెట్ యాక్ట్రస్ సౌందర్యగారి బయోపిక్‌లో నటించాలని ఉంది. కాకపోతే కాస్త నా కలర్ తక్కువగా ఉంటుందేమో (నవ్వుతూ). తమిళంలో నేను నటించిన ‘వానమ్ కొట్టటుమ్’ సినిమా ఈ నెల 7న విడుదలవుతుంది. విజయ్ సేతుపతిగారితో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో నాని ‘టక్ జగదీష్’లో కీలక పాత్ర చేస్తున్నాను. ► నా చిన్నప్పుడే మా నాన్నగారు (రాజేష్) మరణించారు. ‘కాక్కముట్టై’ (2014) సినిమాకు ముందు నా పేరు స్క్రీన్ పై ఐశ్వర్య అని ఉండేది. ఆ తర్వాత ఐశ్వర్యా అయ్యర్, ఐశ్వర్యా లక్ష్మీ ఇలా కొంతమంది ఐశ్వర్య పేరుతో ఇండస్ట్రీకి వచ్చారు. అప్పుడు నా పేరు మార్చుకోవాలనుకున్నాను. ‘కాకముట్టై’తో నా పేరును ఐశ్వర్యా రాజేష్‌గా మార్చుకున్నాను. ఆ సినిమాతో నాకు పెద్ద బ్రేక్ వచ్చింది. మా నాన్నగారి పేరు నాకు కలిసొచ్చింది. అలాగే మా నాన్న నాతోనే ఉన్నారనే ఫీలింగ్ కలిగింది. -
నిర్మాత లేకపోతే ఏమీ లేదు
‘‘సుమారు 51 ఏళ్లుగా మూడు తరాల వాళ్లతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాను. వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు? అని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్లతో పోటీపడి పని చేయడానికి ప్రయత్నిస్తుంటాను’’ అన్నారు ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు. ఆయన నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, కేథరీన్, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా కేయస్ రామారావు చెప్పిన విశేషాలు. ► ‘పెళ్లి చూపులు’ సినిమా చూసినప్పుడు నాకు విజయ్ దేవరకొండ ఒక రవితేజ, ఉపేంద్రలా అనిపించాడు. అప్పుడే అతనితో సినిమా చేయాలనుకున్నాను. అతని స్టయిల్లోనే ఉండే ప్రేమకథా చిత్రమిది. ► క్రాంతి మాధవ్‌తో ఇదివరకు ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ సినిమా నిర్మించాను. తను చాలా భిన్నంగా ఆలోచిస్తాడు. ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలనుకునే దర్శకుడు. ఈ సినిమా కథానుసారమే నలుగురు హీరోయిన్స్‌ని తీసుకున్నాం. రాశీ ఖన్నా పాత్ర బోల్డ్‌గా, ఐశ్వర్యారాజేశ్ పాత్ర న్యాచురల్‌గా ఉంటాయి. కేథరీన్ సపోర్టింగ్ రోల్లో కనిపిస్తుంది. ఇజబెల్లాది కూడా మంచి పాత్రే. ► ఈ సినిమాను 2018 అక్టోబర్‌లో ప్రారంభించాం. అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువే ఆలస్యం అయింది. అయినా కరెక్ట్ సమయానికే వస్తున్నాం. ప్రేమ అనే ఫీలింగ్‌ను ఆస్వాదించేవారందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ► ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ అంటూ ప్రేక్షకుడి చేతిలోకి వినోదం వచ్చేసింది. అందులో బోల్డ్ కంటెంట్ వస్తోంది. అయినా బిగ్ స్క్రీన్ మీద సినిమా ఆనందించాలనే ఆడియన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లు బోల్డ్ కంటెంట్‌ను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి హర్షించరు. అందాన్ని సభ్యతతో చూపించేదే సినిమా. ► సినిమాల ఖర్చులు పెరిగాయి. దాంతో ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీని వల్ల వేరే సినిమాకు థియేటర్స్ కొరత ఏర్పడుతోంది. ఆ సినిమా నిలదొక్కుకొని టాక్ తెచ్చుకునేసరికి మరో పెద్ద సినిమా వస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ఓ ప్రణాళికను తీసుకురావాలి. కంటెంట్‌ను తయారుచేసే నిర్మాత కన్నా కంటెంట్‌ను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే వాళ్లే ఎక్కువ డబ్బు చేసుకుంటున్నారు. నిర్మాత లేకపోతే ఏమీలేదు. ► సినిమాను పంపిణీ చేసే విధానంలో మార్పులు వచ్చాయి. మెల్లిగా మోనోపోలీ వ్యవస్థకు వెళ్లిపోయేలా ఉంది. థియేటర్స్ అన్నీ కొందరి దగ్గరే ఉండటం వల్ల కొందరి నిర్మాతలకు మంచి జరుగుతుంది.. ఇంకొందరికి మంచి జరగదు. థియేటర్స్ ఉన్నవాళ్లు వాళ్ల సినిమా ఉంటే థియేటర్స్ అన్నీ వాళ్ల సినిమాకే ఉంచుకుంటున్నారు. దీని వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. -
‘బొగ్గు గని’లో విజయ్, కేథరీన్ లవ్ సాంగ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లుర, టీజర్, ‘మై లవ్’ లిరికల్ సాంగ్ ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. ‘బొగ్గు గనిలో రంగు మణిరా.. చమక్కు మందిరా.. చిక్కినాదిరా.. దక్కినాదిరా.. నీకే, కన్నె మోహిని సితారా.. ఏ క్లాసు నక్కతోక తొక్కిందే నీ లక్కు.. నిదరింకా రాదే నీ కళ్లకు.. పక్కా మాసోడికి దొరికే బస్తీ బంపరు సరుకు.. ఇంకేంది యాద్గిరికే మొక్కు.. సై సై సై రాజా సై సై.. చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్’ అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. కేథరీన్‌తో విజయ్ వేసే స్టెప్పులు బాగున్నాయి. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. నిరంజ్ సురేష్ చక్కగా ఆలపించారు. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. -
రౌడీ ఫ్యాన్స్‌కు లవ్ సాంగ్ గిఫ్ట్
టాలీవుడ్ రౌడీ, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా చిత్ర పోస్టర్లు, టీజర్లు ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరు ‘అర్జున్‌రెడ్డి ఈజ్ బ్యాక్’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మూవీ ఆరంభం నుంచే ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ కొత్త స్ట్రాటజీని అవలింభిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి మరో అస్త్రాన్ని అభిమానులపై వదిలింది. ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ వీడియోను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఈ పాటకు రహ్మాన్ లిరిక్స్ అందించగా.. శ్రీక్రిష్ణ, రమ్య బెహరా ఆలపించారు. గోపీ సుందర్ డిఫరెంట్‌గా కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: బాలయ్య న్యూలుక్ అదిరింది!! అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’ -
ప్రేమికుడు వచ్చేశాడు
‘‘ప్రేమంటే సర్దుకుపోవడం గౌతమ్. ప్రేమంటే త్యాగం. ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. ఇవేవీ నీలో కనపడట్లేదు’ అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం టీజర్లో విజయ్ దేవరకొండతో రాశీ ఖన్నా అంటున్నారు. ఈ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా హీరోయిన్లు. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించారు. టీజర్లో నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ కనిపించారు విజయ్. మరి సినిమాలో నాలుగు షేడ్స్‌లో కనిపిస్తారా? ద్విపాత్రాభినయం చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రేమికుల దినోత్సవానికి ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.