Xioami
-
షావోమి నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్
ఇంత కాలం ఎంట్రీ, మిడ్ లెవల్ సెగ్మెంట్లోనే ప్రభావం చూపించిన షావోమి సంస్థ తాజాగా హైఎండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఫోకస్ చేసింది. అందులో భాగంగా హై ఎండ్‌పై కేటగిరిలో షావోమి 12 ప్రో 5జీ మోడల్ని రిలీజ్ చేసింది. 2022 మే 3 నుంచి ఎంఐ డాట్ కామ్, అమెజాన్‌లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. షావోమి సంస్థ ముందు నుంచి బట్జెట్ ఫోన్ల తయారీపై దృష్టి పెట్టింది. రూ. 15 వేల లోపు ఫోన్లలో షావోమిదే ఆధితప్యం. ప్రీమియం కేటగిరిలో కొన్ని మోడళ్లు తెచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. పోకో పేరుతో రిలీజ్ చేసిన హై ఎండ్ ఫోన్లు కూడా మార్కెట్లో ఎక్కువ కాలం నిలవలేక పోయాయి. దీంతో ఎలాగైనా ఈ కేటగిరీలో సక్సెస్ కొట్టే లక్ష్యంతో 12 ప్రో 5జీ మోడల్ని తెచ్చింది. ఫీచర్స్ - 4600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం - 120 వాట్స్ హైపర్ ఛార్జర్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ - ఇండస్ట్రీ లీడింగ్ ప్రాసెసరైన స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 - వెనుక వైపు ఉన్న మూడు కెమెరాలు 50 మెగా పిక్సెల్స్ - ఆల్ట్రా ఫోకస్ నైట్ మోడ్ - 4 హార్మాన్ కార్దాన్ స్పీకర్లు (2 వూఫర్స్, 2 ట్వీటర్స్) - 6.73 ఇంచ్ , 120 హెర్జ్, 10 బిట్ 2కే ప్లస్ అమోల్డ్ డిస్ప్లే - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ - నాయర్ బ్లాక్, కౌషర్ బ్లూ, ఓపెరా మావే కలర్స్ - 8కే, 4కే వీడియో రికార్డింగ్ - 2022 మే 2 మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లభ్యం - ధర రూ.62,999 (8 జీబీ/ 256 జీబీ), ధర రూ.66,999 (12 జీబీ/ 256 జీబీ) చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
షావోమికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి, ఇండియా గత మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్‌ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు విచారణకు హాజరు కావాల్సిందిగా మను కుమార్ జైన్‌కు ఇప్పటికే నోటీసులు అందినట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. భారతీయ చట్టాలకు అనుగుణంగా షావోమి వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయా ? లేదా అనే అంశాలపై 2022 ఫిబ్రవరి నుంచి ఈడీ విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో మను కుమార్ జైన్ నుంచి కొన్ని వివరాలు సేకరించే పనిలో ఈడీ ఉంది. ప్రస్తుతం మను కుమార్ జైన్ షావోమి గ్లోబల్ హెడ్‌గా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్నారు. విధి నిర్వాహాణలో భాగంగా ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఈడీ ఆయన్ని ఎప్పుడు విచారించబోతుందనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను ఉద్దేశించి షావోమి ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ తాము భారత చట్టాలకు లోబడే ఇక్కడ అన్ని రకాల కార్యకలపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విచారణ సందర్భంగా ఈడీ అడిగిన అన్ని వివరాలను తాము ఎప్పటికప్పుడు అందిస్తున్నట్టు వివరించారు. కాగా ఈ అంశంపై ఇటు ఈడీ కానీ అటు మను కుమార్ జైన్ కానీ నేరుగా స్పందించలేదు. చదవండి: పెద్ద చిక్కుల్లో పడిన షావోమి ఇండియా..! -
శామ్సంగ్కు రియల్మీ ఝలక్.. అమ్మకాల్లో మరో రికార్డు
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్‌ను గుర్తు చేస్తోంది స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ. కేవలం మూడేళ్ల కిందట భారత మార్కెట్లో అడుగు పెట్టిన ఈ కంపెనీ బడా బ్రాండ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. నంబర్ 2 ఇండియాలో మొబైల్ సేల్స్‌కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ అక్టోబరు గణాంకాలను విడుదల చేసింది. ఇందులో 18 శాతం మార్కెట్ వాటాతో రియల్మీ శామ్సంగ్ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ కలిగిన కంపెనీగా రికార్డు సృష్టించింది. శామ్సంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. షావోమి వెంటే గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. షావోమి మార్కెట్‌కి గండి కొట్టేందుకు శామ్సంగ్, రియల్మీ, ఒప్పో, వివోలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా అక్టోబరులో కూడా 20 శాతం మార్కెట్ వాటాతో షావోమినే నంబర్ వన్‌గా నిలిచింది. అయితే ఈ నంబర్ వన్ స్థానం కాపాడుకునేందుకు షావోమి సబ్సిడరీ కంపెనీ పోకో మోడల్స్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏ క్షణమైనా షావోమి ఆధిపత్యాని చెక్ పెట్టేందుకు రియల్మీ రెడీగా ఉంది. ఇక 13 శాతం మార్కెట్ వాటాతో వివో నాలుగో స్థానంలో ఉంది. అన్నింటినీ తోసిరాజని క్వార్టర్ 3 అమ్మకాలను అక్టోబరు అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు.. టాప్ 4లో ఉన్న మిగిలిన మూడు కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పట్టగా కేవలం రియల్ మీ బ్రాండ్ మాత్రమే మార్కెట్ వాటాను పెంచుకుంది. షావోమీ 23 నుంచి 20 శాతానికి , శామ్సంగ్ 17 నుంచి 16 శాతానికి, వివో 15 నుంచి 13 శాతానికి మార్కెట్ వాటా పడిపోగా కేవలం రియల్మీ బ్రాండ్ ఒక్కటే మార్కెట్ వాటాను 15 నుంచి 18 శాతానికి పెంచుకోగలిగింది. వచ్చే ఏడాదిలో ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదగడమే తమ తదుపరి లక్ష్యమని రియల్మీ ప్రతినిధులు అంటున్నారు. -
షావోమీదే పైచేయి.. శాంసంగ్ వెనుకంజ
న్యూఢిల్లీ: సరఫరాపరమైన సవాళ్ల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ4) దేశీయంగా స్మార్ట్ఫోన్ల విక్రయాలు తగ్గే అవకాశం ఉందని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మొత్తం అమ్మకాలు 16 కోట్ల కన్నా తక్కువకే పరిమితం కావచ్చని పేర్కొంది. వరుస గా నాలుగు త్రైమాసికాలు వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు.. సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షి క ప్రాతిపదికన 12 శాతం క్షీణించి 4.8 కోట్ల యూనిట్లకు పరిమితమైనట్లు వివరించింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో (తొలి తొమ్మిది నెలలు) స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 12 కోట్ల యూనిట్లుగా నమోదైనట్లు ఐడీసీ తెలిపింది. సరఫరా పరమైన సవాళ్లతో నాలుగో త్రైమాసికంలో విక్రయాలు క్షీణించవచ్చని, వచ్చే ఏడాది ప్రథమార్ధం కూడా సమస్యాత్మకంగానే కొనసాగవచ్చని పే ర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో షావోమి 23.4 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్, వివో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
బంగారం రుణాల్లోకి షావోమీ !
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా భారత్‌లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. బంగారంపై రుణాలు, బీమా పాలసీలు, క్రెడిట్ లైన్ కార్డులు మొదలైన ఆర్థిక సేవలను పూర్తి స్థాయిలో అందించడంపై దృష్టి పెడుతోంది. యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, స్టాష్‌ఫిన్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, క్రెడిట్ విద్య వంటి దేశీ సంస్థలతో కలిసి ఈ సర్వీసులు అందించనున్నట్లు షావోమీ భారత విభాగం హెడ్ మను జైన్ వెల్లడించారు. వచ్చే కొన్ని వారాల్లో బంగారంపై రుణాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలకు సంబంధించిన ’మి క్రెడిట్’ విభాగం ఇకపై 60 నెలల దాకా కాలావధితో రూ. 25 లక్షల దాకా (ఇప్పటిదాకా ఇది రూ. 1 లక్షకే పరిమితం) రుణాలను జారీ చేయనున్నట్లు జైన్ చెప్పారు. చదవండి: ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ -
షావోమీ నుంచి సైబర్ డాగ్.. దీని ప్రత్యేక ఇదే
CyberDog : బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌గా ఎంటరై మార్కెట్ లీడర్లకే ముచ్చెమటలు పట్టించిన షావోమీ మరో సంచలనానికి తెర లేపింది. బడా కంపెనీలకే సాధ్యం కాని దానిని సుసాధ్యం చేసింది. నిత్య జీవితంలో ఉపయోపడే రోబోలను సైతం తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. క్వాడ్రుపెడ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో తనకు తానే సవాల్ విసురుకుంది. మార్కెట్లో ఉన్న మిగిలిన కంపెనీలు విస్మయం చెందే తీరులో సైబర్ డాగ్ పేరుతో క్వాడ్రుపెడ్ రోబోని తయారు చేసింది. నాలుగు కాళ్లపై నడిచే ఈ రోబోకి సంబంధించిన కీలక అంశాలను ఎంఐ ప్యాడ్ 5 రిలీజ్ సందర్భంగా షావోమీ వెల్లడించింది. సైబర్‌డాగ్ స్పెషాలిటీస్ ఇంట్లో మనుషులకు పనుల్లో సహాయకారిగా ఉండేలా ఈ సైబర్డాగ్ని షావోమీ రూపొందించింది. కచ్చితత్వానికి మరో పేరుగా ఈ క్వాడ్రుపెడ్ పని చేస్తుందంటూ షావోమీ ట్వీట్ చేసింది. ఇంటెల్ రియల్ సెన్స్‌కి ప్రాసెసర్‌ని ఇందులో ఉపయోగించారు. ఈ క్వాడ్రపెడ్ రోబో సెకనుకి 3.2 మీటర్లు కదులుతుంది. గరిష్టంగా 3 కేజీల బరువు మోయగలదు. నివిడియా సూపర్ కంప్యూటర్ శ్రేణికి చెందిన చిప్సెట్ అమర్చారు. కేవలం వెయ్యి మాత్రమే ప్రయోగాత్మకంగా తొలుత కేవలం వెయ్యి సైబర్ డాగ్ రోబోలను తయారు చేయాలని షావోమీ నిర్ణయించింది. తొలుత వీటిని చైనాలో విడుదల చేసి అక్కడ వచ్చిన స్పందన ఆధారంగా ఇతర దేశాల్లో అందుబాటులోకి తేనుంది. ఈ క్వాడ్రుపెడ్ రోబో ధర చైనా మార్కెట్లో 9,999 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో రూ. 1,14,737 ఉండవచ్చని అంచనా. From the in-house developed high-performance servo to the centimeter-scale obstacle avoidance and navigation, here’s everything that makes #XiaomiCyberDog a true beast. pic.twitter.com/T7JFj9V94X — Xiaomi (@Xiaomi) August 10, 2021 -
స్మార్ట్ ఫోన్లో 200 మెగాపిక్సెల్ కెమెరా!.. సాధ్యమేనా?
యూజర్లకు తగ్గట్లు ఫీచర్స్ అందులో క్వాలిటీ కెమెరాలతో ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి కంపెనీలు. అయితే రాబోయే రోజుల్లో 200 మెగాపిక్సెల్‌తో కెమెరాలు రాబోతున్నాయని, ఈ మేరకు షియోమీ-శాంసంగ్ కంపెనీలు పోటాపోటీ ఉండబోతున్నాయని, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్నాయని.. ఓ ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఏ కంపెనీ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. సాక్షి, వెబ్‌డెస్క్: శాంసంగ్ ఎస్ సిరీస్‌లో భాగంగా.. గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరాను ఇంట్రెడ్యూస్ చేయనుందని ప్రచారం ఇప్పుడు నడుస్తోంది. అయితే ప్రచారానికి బలం చేకూరేలా ఇప్పుడు మరో వాదన తెర మీదకు వచ్చింది. గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో కెమెరా కెపాసిటీ 108 మెగాపిక్సెల్. అయితే ఎస్22 మోడల్‌తో శాంసంగ్ అరుదైన ప్రయోగానికి తెర తీయబోతోందని, ఐదు కెమెరాల వ్యవస్థ(అర్రే) తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటూ కొరియాకు చెందిన ప్రముఖ బిజినెస్ వెబ్సైట్‘పల్స్’ ఓ కథనం ప్రచురించింది. ఇక ఈ కెమెరా ఫిట్టింగ్ కోసం జపాన్‌కు చెందిన కెమెరా లెన్స్‌ల కంపెనీ ఒలింపస్‌తో శాంసంగ్ ఒప్పందం కూడా కుదుర్చుకుందని పేర్కొంది. అయితే ఈ కథనంపై ఒలింపస్ కానీ, శాంసంగ్ కానీ స్పందించలేదు. 200 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటికీ అవుట్‌స్టాండింగ్ ఫొటోలు తీయడం కష్టమని కొందరు అభిప్రాయపడుతుండగా.. అది వీలుపడొచ్చని టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21లో 108 మెగాపిక్సెల్ సెన్సార్, వైడ్ యాంగిల్లో క్వాలిటీ ఫొటోలు తీయడానికి వీలుపడుతోంది. కాబట్టి, 200 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేది నిజమే అయితే వైడ్ యాంగిల్ షాట్స్‌లో క్వాలిటీ ఫొటోలు తీయడం వీలు అవుతుందని చెబుతున్నారు. టెలిఫొటో లెన్స్ ద్వారా ఆప్టికల్, డిజిటల్ జూమ్ కాంబోలో క్వాలిటీ ఫొటోలు తీయొచ్చని.. తద్వారా పిక్చర్ క్లియర్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 2022 ఆరంభంలో 200మెగాపిక్సెల్ కెమెరా, ఎస్ పెన్‌తో రావొచ్చు.. లేదంటే లేదు. షియోమీ సంగతి! షియోమీ ఎంఐ 12 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోందని ‘డిజిటల్ చాట్ స్టేషన్’ పేర్కొంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ ఎస్ఎం 8450 సాస్ని ఇవ్వగా.. 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కెమెరాను ఇస్తుందని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై షియోమీ సైతం స్పందించడంలేదు. -
రెడ్మీ యూజర్లకు షాక్... ధరలు పెరిగే మోడల్స్ ఇవే
ఇండియాలో మెస్ట్ పాపులర్ మొబైల్ బ్రాండ్ షావోమీ తన యూజర్లకు వరుసగా షాక్‌లు ఇస్తోంది. రన్నింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ల ధరలు ఒకదాని తర్వాత ఒకటిగా పెంచుకుంటూ పోతుంది. జూన్‌లో ధరల పెంపుకు తెర తీసిన షావోమీ.. అదే ట్రెండ్‌ని జులైలోనూ కంటిన్యూ చేస్తోంది. విడిభాగాల వల్లే షావోమీ సంస్థ గత మార్చ్‌లో రెడ్మీ నోట్ 10 సిరీస్‌ని రిలీజ్ చేసింది. ఆ వెంటనే నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్ వేరియంట్లు రిలీజ్ చేసింది. ఈ మోడల్స్ సక్సెస్‌ఫుల్‌గా అమ్మకాలు సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా జూన్‌లో నోట్ 10, నోట్ 10 ప్రో ధరలను పెంచింది. ర్యామ్, స్టోరేజీ కెపాసిటీ ఆధారంగా రూ. 500ల నుంచి రూ. 1000 వరకు ధరలు పెంచేసింది. ఫోన్ తయారీలో ఉపయోగించే చిప్సెట్, డిస్ప్లే, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ప్యానెల్, బ్యాటరీ తదితర విడిభాగాల ధరలు పెరిగినందువల్లే తమ మొబైల్ ఫోన్ల ధరలు పెంచుతున్నట్టు షావోమీ ప్రకటించింది. పెంపు ఎంతంటే నోట్ 10 సిరీస్‌లో హై ఎండ్ వేరియంట్ అయిన నోట్ 10 ప్రో మ్యాక్స్ ధర పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నోట్ 10 ప్రో మ్యాక్స్ 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ ధర రూ. 18,990 ఉండగా, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 20 వేల దగ్గర ఉంది. హై కెపాసిటీ కలిగిన 8 జీబీ 128 స్టోరేజీ మోడల్ ధర రూ. 23,944గా ఉంది. ఈ మూడు వేరియంట్లలో ముందుగా 6 జీబీ 128 స్టోరేజీ మోడల్ ధర పెంపుకు సిద్ధమైంది. వీటితో పాటు మిగిలిన రెండు వేరియంట్లకు కూడా ధరల పెంపు తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరల పెంపు కనీసం రూ. 500ల నుంచి రూ. 1,500ల వరకు ఉండొచ్చని సమాచారం. -
షావోమీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్
షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారీ డిస్కౌంట్స్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్ నవంబర్ 26 నుండి 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు మీ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ లలో కొనుగోలు చేసే షియోమి ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్ పొందగలుగుతారు. ఈ సేల్‌లో రూ.699 ధరకే 10,000ఎంఏహెచ్ రెడ్మీ పవర్ బ్యాంక్ కొనొచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధర రూ.1,999 మాత్రమే. ఇలా అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.(చదవండి: సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేయకండి) రెడ్మీ స్మార్ట్ఫోన్లు రెడ్మి 8ఎ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ను బేస్ మోడల్‌కు రూ .6,999 వద్ద అందుబాటులో ఉంది. రెడ్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.8,299. రెడ్మీ 9 ప్రైమ్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.9,999. రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.13,999. రెడ్మి నోట్ 8 అసలు ధర రూ.12,999కాగా, ఆఫర్ ధర రూ.12,999. రెడ్మీ ఇయర్‌బడ్స్ ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2సీ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,299. ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 అసలు ధర రూ.5499 కాగా ఆఫర్ ధర రూ.2,999. రెడ్మీ ఇయర్‌బడ్స్ ఎస్ బ్లాక్ అసలు ధర రూ.2,399 కాగా ఆఫర్ ధర రూ.1,699. రెడ్మీ ఇయర్ బడ్స్ 2సీ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299. రెడ్మీ ఇతర ఉత్పత్తులు రెడ్మీ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299. రెడ్మీ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.999 కాగా ఆఫర్ ధర రూ.699. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ అసలు ధర రూ.1,199 కాగా ఆఫర్ ధర రూ.899. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అసలు ధర రూ.1,499 కాగా, ఆఫర్ ధర రూ.1,299. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అసలు ధర రూ.2,499 కాగా ఆఫర్ ధర రూ. 1,999. ఎంఐ వాచ్ రివాల్వ్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ. 9,999. మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2 అసలు ధర రూ.3,999 కాగా ఆఫర్ ధర రూ.2,499. ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ స్టాండ్ అసలు ధర రూ.199 కాగా ఆఫర్ ధర రూ.99. ఎంఐ టీవీ స్టిక్ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,499. -
చైనా, భారత్ వ్యూహాలు ఏమిటి?
ముంబై: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనా దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యాపార రంగంలో తీవ్ర అలజడి నెలకొంది. మంగళవారం శాంతిని కోరుకుంటున్నట్లు భారత్ ప్రకటించినప్పటికి అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ముఖ్య అధికారలు తెలిపారు. ఇలాగే ఉద్రిక్తతలు కొనసాగితే చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు ఇబ్బందులు ఏర్పడతాయని, తాము ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదని దేశీయ స్టార్ హెల్త్ఇన్సూరెన్స్ ఆఫీసర్ అనీష్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచానికే అనేక వస్తువులను దిగుమతి చేస్తున్న చైనా.. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సంస్థ వ్యాపార వ్యూహాలు మార్చనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి సంక్షోభాలను దిగ్గజ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కోగలవని.. గతంలో భారత్, చైనా యుద్ధం తరువాత ఇరు దేశాలు నిలదొక్కుకున్న విషయాన్ని షాంఘైకి చెందిన ఫండ్ మేనేజర్ దై మింగ్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితులతో చైనా తయారీ రంగానికి ఎలాంటి నష్టం లేదని మింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ డాటా సెంటర్లను భారత్‌లోనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌసర్ అత్యధిక పేజీ వ్యూస్‌తో దేశీయ ప్రజలను ఆకట్టుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. కాగా చైనీస్ బ్రాండ్ షియోమీ స్మార్ట్‌ఫోన్ విభిన్న సిరీస్‌లతో దేశ ప్రజలను ఆకట్టుకుందని సంస్థ పేర్కొంది. యూఎస్‌కు బదులుగా దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి చైనా వైర్లెస్ నెట్వర్క్ దిగ్గజం హువావే టెక్నాలజీస్ 5జీనీ అందించేందుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. చైనా కంపెనీల నుండి సోర్సింగ్ పరికరాలను దేశీయ టెలికాం కంపెనీలు నిలిపివేయవచ్చని ఓ ప్రభుత్వ అధికారి అభిపప్రాయపడ్డారు. ప్రైవేటు మొబైల్ ఫోన్ ఆపరేటర్లు ఉపయోగించే పరికరాలు భారత ప్రభుత్వం నిషేధించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా దేశీయ ఫార్మారంగం(రెడ్డీస్ ల్యాబ్, అరబిందో) కూడా చాలా వరకు ముడిపదార్థాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫార్మారంగం కొంత ఇబ్బంది ఎదుర్కొవచ్చని ఫార్మా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో పరికరాల కొనుగోలు తదితర అంశాల్లో డిఫెన్స్ రంగం గణనీయ వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: చైనా సంస్థకు షాక్.. రూ. 470 కోట్ల ప్రాజెక్టు రద్దు -
రెడ్మి ఫోన్ల సునామీ; 90సెకన్లలో నో స్టాక్
సాక్షి, న్యూఢిల్లీ: షియోమి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ఫోన్లు 90 సెకన్లలోనే అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. గత వారమే ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ రోజు అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఫస్ట్‌సేల్‌లో ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదనపు ఆకర్షణలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్‌తో పాటు ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం, ఎం స్టూడియో స్టోర్లలోనూ ఈ ఫోన్ కొనుగోళ్ల సునామీ సృష్టించింది. దీంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోసేల్‌ను ఈ నెల 24న నిర్వహించనున్నట్టు షియోమీ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు. అమెజాన్‌లో ఈ ఫోన్లు విక్రయానికి పెట్టిన 90 సెకన్లలోనే అమ్ముడుపోయినట్టు మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ,128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్లో భాగంగా హెచ్డీఎప్సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. ఎయిర్టెల్ రూ.298, రూ.398 అన్లిమిటెడ్ ప్యాక్‌లపై డబుల్ డేటా వంటి ప్రయోజనాలను సైతం అందిస్తోంది. రెడ్మి నోట్ 9 ప్రొ ఫీచర్లు ఈ విధంగా.. - 6.67 అంగుళాల ఫుల్ హెడ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే - 48 ఎంపీ ప్రధాన సెన్సార్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనక నాలుగు కెమెరాలు - ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ - 512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం - 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
షావోమి బడ్జెట్ఫోన్ ఫ్లాష్‌సేల్ షురూ
ప్రముఖ చైనా కంపెనీ షావోమి తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి 8 ఫ్లాష్ సేల్స్ గురువారం మధ్యాహ్నం 12 గంటలనుంచి మొదలయ్యాయి. గత నెల (అక్టోబర్) లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐఇండియా అధికార వెబ్సైట్లతో పాటు ఎంఐ హోమ్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. రెడ్మి 8 ఫీచర్లు 6.22 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 439 సాక్ ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 720x1520 పిక్సెల్స్‌రిజల్యూషన్ 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12+2 ఎంపీ ఏఐ రియల్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ ఏఐ సెల్పీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి 8 ధరలు 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ రూ. 8,999 -
అతి ప్రమాదకరమైన స్మార్ట్ఫోన్లు ఇవేనట!
సెల్‌ఫోన్ మనిషి జీవితంలో భాగమై పోయింది. ఒక నిత్యావసర వస్తువుగా అవతరించిన క్రమంలో చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం. ఇక సోషల్ మీడియాకు బానిసలైపోతున్న ప్రస్తుత తరుణంలో ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్ఫోన్లతోనే కాలక్షేపం.అయితే స్మార్ట్‌ఫోన్ వల్ల సాంకేతికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో.. వీటినుంచి వెలువడే రేడియేషన్‌తో ఆరోగ్యానికి ముప్పు కూడా అంతకంటే ఎక్కువే పొంచి వుంది. ఇది జగమెరిగిన సత్యం అయినా.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. షావోమి, వన్ ప్లస్‌కు చెందిన నాలుగు స్మార్ట్ఫోన్లు అతి ప్రమాదకరమైనవిగా పేర్కొంది. ముఖ్యంగా చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రూపొందించిన నాలుగు స్మార్ట్ఫోన్లు గరిష్టంగా రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. టాప్ 16జాబితాలో ఎనిమిది ఫోన్లు షావోమి, వన్‌ప్లస్‌కి చెందినవి ఉన్నాయని వెల్లడించింది. షావోమికి చెందిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐఏ1, వన్‌ప్లస్ 5టీ స్మార్ట్ఫోన్లు ఈ వరుసలో ముందున్నాయి. షావోమి, వన్‌ప్లస్ తరువాత ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్7 నిలిచింది. దీంతోపాటు యాపిల్ ఐ ఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల రేడియేషన్ కూడా అత్యధికంగానే నమోదైందని రిపోర్టు చేసింది. మరోవైపు అతి తక్కువ రేడియేషన్ ప్రభావం ఉన్న ఫోన్లలో కొరియా దిగ్గజం శాంసంగ్ డివైస్‌లు నిలవడం గమనార్హం. ఎల్జీ, హెచ్‌టీసీ, మోటో, హువావే, హానర్కుచెందిన కొన్నిఫోన్లు తక్కువ రేడియేషన్ విడుదల చేస్తున్నాయని నివేదించింది. ఇతర చైనా కంపెనీలు ఒప్పో, వివో తయారు చేసిన స్మార్ట్ఫోన్లను పరీక్షించలేదని పేర్కొంది. -
దేశీ స్టార్టప్స్‌లో షావోమి పెట్టుబడులు!!
చండీగఢ్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ ‘షావోమి’... భారతీయ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమౌతోంది. వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 100 స్టార్టప్స్‌లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని సంస్థ ప్రకటించింది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విభాగాల్లో బలోపేతమవ్వడమే ఈ ఇన్వెస్ట్మెంట్ల ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది. ‘2017 నాటికి కంపెనీ నికర పెట్టుబడులు రూ.3,000 కోట్లు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లోని స్టార్టప్స్‌లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తాం’ అని షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ తెలిపారు. మొబైల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఉన్న సంస్థల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. దీని వల్ల హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విభాగాల్లో సంస్థ బలోపేతమౌతుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో తమ ఆధిపత్యాన్ని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తంచేశారు. చైనాలో విక్రయిస్తోన్న ప్రొడక్టులను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు చెన్నైలో ఇటీవలనే ఒక ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇందులో ఎలక్ట్రిక్ సైకిల్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్, స్మార్ట్ షూ, స్మార్ట్ కుకర్, ల్యాప్‌టాప్, వాటర్ ప్యూరిఫయర్ వంటి వాటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ ఉత్పత్తులపై కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని, ఇక్కడి పరిస్థితులకు అనువైన మార్పులతో వీటిల్లో కొన్ని ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రతిదాన్ని స్మార్ట్‌గా, ఇంటర్నెట్ ఆధారంగా, స్మార్ట్‌ఫోన్ ద్వారా పనిచేసేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
అద్భుతమైన ఎంఐ స్మార్ట్ టీవీ సేల్, స్పెషల్ ఆఫర్స్
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి భారత్‌లో తొలిసారిగా ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4 విక్రయాలను ప్రారంభించింది. స్మార్ట్ఫోన్లతో ప్రధాన ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించిన షావోమీ ఇపుడిక టీవీ రంగంలో కూడా ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమై పోయింది. ఈ నేపథ్యంలో అద్భుత ఫీచర్లతో లాంచ్ చేసిన ఎంఐ స్మార్ట్ టీవీని ఈ మధ్యాహ్నం 2 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా విక్రయానికి అందుబాటులోకి తేనుంది. ‘ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4’ పేరుతో ప్రపంచంలోనే అతి పలుచనైన టీవీని ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించింది. చైనా వెలుపల భారత్‌లోనే తొలిసారిగా టీవీలను విక్రయిస్తోంది. దీని ధర రూ.39,999 గా కంపెనీ నిర్ణయించింది. శాంసంగ్, సోనీ, ఎల్జీ లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థల టీవీలకు గట్టిపోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4 ఫీచర్లు 4.9 ఎంఎం అల్ట్రా–థిన్ ఫ్రేమ్‌లెస్ డిజైన్ 55 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే ప్యానెల్ 4కే రెజల్యూషన్ (3840x2160 పిక్సెల్స్) హెచ్డీఆర్ సపోర్ట్, 64 బిట్ 1.8 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ ఇక లాంచింగ్ విషయానికి వస్తే....ఎంఐ టీవీ కొనుగోలుదారులకు రూ.619 విలువ చేసే సోనీ లివ్, హంగామా ప్లే 3 నెలల చందా ఉచితం. అలాగే ఎంఐ ఐఆర్ కేబుల్ (రూ. 299) ఫ్రీ. దీంతోపాటు రూ.1,099 విలువ చేసే ఆన్సైట్ ఇన్ష్టలేషన్ ఉచితం. అంతేకాదు స్మార్ట్ టీవీతో కలిపి 11-బటన్ మిని రిమోట్‌ను అందిస్తోంది. దీంతో అటు టీవీని, ఇటు సెట్-టాప్ బాక్సును నియంత్రించవచ్చు. ఇక కనెక్టివిటీ పరంగా, మూడు హెచ్డీఎంఐ 2.0 పోర్ట్స్, రెండు యూఎస్బీ పోర్ట్స్, డ్యూయెల్ బాండ్ వై–ఫై, బ్లూటూత్ 4.0, డాల్బే+డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, ప్యాచ్‌వాల్ ఓఎస్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌టీవీ సొంతం. ముఖ్యంగా 15 భాషల్లో 5,00,000లకుపైగా గంటల (వీటిలో 80 శాతం ఉచితం) అందించేందుకు వీలుగా హంగామా, ఏఎల్టీ బాలాజీ, జీ5, సోనీ లిప్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని షావోమి ప్రకటించిన సంగతి తెలిసిందే. Mi fans! For the first time ever, #MiTV4 goes on sale today at 2PM on https://t.co/D3b3Qt4Ujl & @Flipkart. Are you ready for the visual treat? pic.twitter.com/zXSmbTR1kd — Mi India (@XiaomiIndia) February 22, 2018 Mi fans! Greet the world's thinnest LED TV - #MiTV4 - 4.9mm Ultra-thin - 4K HDR 10 Frameless display First sale on Feb 22 on https://t.co/D3b3QtmvaT, @Flipkart and Mi Home. RT if you ❤️ the Mi TV 4. pic.twitter.com/1eRg7pOrmO — Mi India (@XiaomiIndia) February 16, 2018 -
శాంసంగ్‌కు షాకిచ్చిన షావోమి
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి భారత్‌లో తన హవాను చాటుకుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అప్రతిహతంగా దూసుకుపోతూ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 17శాతం వార్షిక వృద్ధితో 27శాతం మార్కెట్ వాటాను కొల్లగొట్టి శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే తన సత్తా చాటిన షావోమి ర్యాంకింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ ఎండ్ డివైస్ల ధరలు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ, మిడ్ రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్లో ఆకర్షణీయమైన డివైస్లతో భారతీయ వినియోగదారులను మెప్పించింది. ముఖ్యంగా రెడ్ మి సిరీస్ స్మార్ట్ఫోన్లతో స్టార్ ప్లేయర్‌గా నిలిచింది. మూడవ త్రైమాసికంలో శాంసంగ్, షావోమి రెండూ 23.5 శాతం మార్కెట్ వాటాతో టాప్ ర్యాంక్‌కు నువ్వానేనా అన్నట్టు పోటీపడినా, క్యూ4లో మాత్రం షావోమి శాంసంగ్‌ను అధిగమించింది. పరిశోధనా సంస్థ కానల్స్ నివేదిక ప్రకారం, 2017 నాలుగో త్రైమాసికంలో శాంసంగ్ ను షావోమి ఓడించింది. 2017 క్యూ4లో 8.2 మిలియన్ యూనిట్లు (27 శాతం మార్కెట్ వాటా) చేరువలో ఉంది. వార్షిక వృద్ధి 17 శాతంగా ఉంది. అయితే ఇప్పటివరకు భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న శాంసంగ్ తన ర్యాంక్‌ను నిలుపుకోవడంలో విఫలమైంది. కేవలం 7.3 మిలియన్ స్మార్ట్ఫోన్లతో (25 శాతం వాటా) రెండవ స్థానంలో నిలిచిందని తెలిపింది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లు మాత్రమే కాకుండా.. దేశంలోఇటీవల షావోమి షోం రూంలను ప్రారంభించడం కూడా కీలకమైన పరిణామమని పేర్కొంది. స్వయంప్రతిపత్తితో స్థానికంగా వ్యాపారాలను ప్రారంభించడంతో షావోమి వృద్దికి దోహదపడిందని కానల్స్ రీసెర్చ్ అనలిస్ట్ ఇషాన్ దత్ చెప్పారు. మొత్తంమీద భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 6 శాతం పుంజుకోగా మొత్తం యూనిట్లు 30 మిలియన్లుగా నమోదయ్యాయి. అలాగే వివో, ఒప్పో, లెనోవో ఈ జాబితాలో తరువాత స్థానాల్లో నిలిచాయి. -
రూపాయికే షావోమి స్మార్ట్‌ఫోన్: రేపటి నుంచే సేల్
ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్.. వినడానికి విడ్డూరంగా ఉందా..! కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమి, రూపాయికే స్మార్ట్‌ఫోన్ అందిస్తుంది. ఒక్క స్మార్ట్ఫోన్లను మాత్రమే కాక, వీఆర్ హెడ్‌సెట్స్, రూటర్స్, ఫిట్నెస్ బ్రాండ్లను కూడా రూపాయికే ఆఫర్ చేస్తుంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌లో షావోమి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 21 వరకు షావోమి అధికారిక వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, పవర్ బ్యాంకులు, కేసెస్, ఇతర యాక్ససరీస్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్లతో పాటు రూ.1 ఫ్లాష్ సేల్‌ను నిర్వహిస్తుంది. అయితే రూ.1 ఫ్లాష్ సేల్ రెండు రోజుల్లో కూడా మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. అంతకంటే ముందు అదే రోజు ఉదయం 10 గంటలకు రూపాయి సేల్స్ కు సంబంధించి కూపన్స్ సేల్స్ ప్రారంభం అవుతుంది. ఇందులో రూపాయి పెట్టి.. కూపన్స్ కొనుగోలు చేయాలి. ఇది కూడా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇలా కూపన్స్ దక్కించుకున్న వారు.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే రూపాయి సేల్స్ లోకి ఎంట్రీ వస్తుంది. అక్కడ మీరు రూపాయి పెట్టి కొనుగోలు చేసిన కూపన్స్ ను యాడ్ చేస్తే చాలు.. స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది. ఆ సేల్‌లో పరిమిత స్టాక్స్‌నే అందుబాటులో ఉంచుతున్నారు. రూ.1కే షావోమి ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే ప్రొడక్ట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ రూపాయి సేల్స్ కింద.. రెడ్మి 5ఏ, రెడ్మి వై1, ఎంఐ వీఆర్ 2 ప్లే, ఎంఐ రూటర్స్, వైఫై రూటర్లు ఇతర ఉత్పత్తులు ఈ సేల్స్ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాక మొబిక్విక్ మొబైల్ వాలెట్ యూజర్లకు రూ.4000 వరకు సూపర్‌క్యాష్ లభ్యమవుతుంది. హంగామా ప్లేకు మూడు నెలల సబ్స్క్రిప్షన్, 12 నెలల హంగామా మ్యూజిక్ వంటి డీల్స్ ఈ సేల్‌లో ఉన్నాయి. -
షావోమిలోకి శాంసంగ్ సేల్స్ అధినేత
శాంసంగ్ ఇండియా సేల్స్ అధినేత దీపక్ నక్రా, దాని ప్రత్యర్థి కంపెనీ షావోమిలో జాయిన్ అయ్యారు. భారత్‌లో షావోమి ఆఫ్‌లైన్ మార్కెట్‌ను విస్తరించేందుకు దీపక్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. దీపక్ నక్రా షావోమిలో చేరినట్టు ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తన లింక్డిన్ పేజీలో తెలిపారు. ''షావోమి ఇండియా ఆఫ్‌లైన్ సేల్స్‌ను దీపక్ లీడ్ చేస్తున్నారని తెలుపడం చాలా ఆనందదాయకంగా ఉంది. పలు టాప్ హ్యాండ్సెట్ బ్రాండులు, టెలికాం ప్రొవైడర్లలో దీపక్ పనిచేశారు. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఈయనకు 20 ఏళ్ల అనుభవముంది'' అని మను కుమార్ జైన్ తెలిపారు. గత 9 నెలల క్రితమే తన ఆఫ్‌లైన్ ప్రయాణాన్ని ప్రారంభించామని, అతికొద్ది సమయంలోనే 20శాతం వృద్ధి చెందామని మను కుమార్ చెప్పారు. తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు దీపక్ సాయపడతారని నమ్మకముందని, రెండేళ్ల క్రితం తమ ఆన్లైన్ సేల్స్ అధినేతగా జాయిన్ అయిన రఘు, తమన్‌ని నెంబర్ 1 స్థానానికి చేర్చినట్టు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ షేరులో షావోమి, శాంసంగ్‌కు దగ్గర్లో ఉంది. 2017 మూడో త్రైమాసికంలో శాంసంగ్ 23 శాతం మార్కెట్ షేరుతో టాప్‌లో ఉండగా... 22 శాతం మార్కెట్ షేరుతో షావోమి రెండో స్థానంలో నిలిచింది. 2012 నుంచి ఇదే తొలిసారి. రెండు కంపెనీలు దగ్గర్లో మార్కెట్ షేరును నమోదుచేయడం. ఆన్లైన్ సెగ్మెంట్లో షావోమి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్ సెగ్మెంట్‌పైనా దృష్టిసారించింది. ఆఫ్‌లైన్ మార్కెట్‌ను కూడా తన సొంతం చేసుకునేందుకు కఠినతరమైన ప్లాన్లను కూడా రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఎంఐ హోమ్స్ పేరుతో వచ్చే రెండేళ్లలో వీటిని లాంచ్ చేయనుంది. -
షావోమి అత్యంత ఖరీదైన ఫోన్ ధర తగ్గింది
న్యూఢిల్లీ : షావోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా పేరు గాంచిన ఎంఐ మిక్స్2 ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసినప్పుడు రూ.37,999కాగ, ప్రస్తుతం ఇది రూ.5000వేల డిస్కౌంట్‌తో ఫ్లిప్కార్ట్లోలభ్యమవుతోంది. పరిమిత కాల ఆఫర్లో భాగంగా యూజర్లు ఈ డివైజ్‌ను రూ.32,999కే విక్రయిస్తున్నారు. డిస్కౌంట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.18వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.99 కు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బైబ్యాక్ గ్యారెంటీని పొందవచ్చు. ఎంఐ మిక్స్2ను కొనుగోలు చేయాలనుకునే వారికి, రూ.3,667 వద్ద నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను, యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. గతేడాది ఎంఐ మిక్స్ విజయవంతమవడంతో, ఈ ఏడాది ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి విడుదల చేసింది. షావోమి తొలి బెజెల్-లెస్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు.. 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్డేట్ 2.4గిగాహెడ్జ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
మూడేళ్లలోనే అగ్ర స్థానానికి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షావోమి.. మూడేళ్ల క్రితం భారత్‌లో ప్రవేశించిన ఈ చైనా మొబైల్ సంస్థ... అతి తక్కువ సమయంలోనే మార్కెట్లో పాగా వేసింది. ఐడీసీ సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాల ప్రకారం 23.5 శాతం వాటాతో భారత్‌లో నంబర్–1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. ఫీచర్ రిచ్ మోడళ్లు, నాణ్యత, తక్కువ ధరలే ఇందుకు ప్రధాన కారణమని షావోమి ఇండియా ఎండీ మను జైన్ తెలిపారు. హైదరాబాద్‌లో సంస్థకు చెందిన ప్రధాన మొబైల్ విక్రేతలతో సమావేశమైన సందర్భంగా సోమవారం ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. మార్కెటింగ్ వ్యయాలు పెద్దగా లేకపోవడం వల్లే పోటీలో ముందున్నామని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. మార్కెటింగ్ ఖర్చులు లేకుండా.. దాదాపు అన్ని కంపెనీలు మార్కెటింగ్‌పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. మా వ్యాపార విధానం దీనికి భిన్నం. నాణ్యతలో రాజీ లేకుండా మంచి మోడళ్లను తేవడంపై, సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుపైనే ఫోకస్ చేశాం. మార్కెటింగ్ ఖర్చులు లేవు. కేవలం 300 మంది ఉద్యోగులే ఉన్నారు. దేశీయంగా తయారీ చేపట్టాం. కాబట్టి ఫోన్లను పోటీ ధరలో ప్రవేశపెట్టగలుగుతున్నాం. ఇబ్బడిముబ్బడిగా సరుకు నిల్వ ఖర్చులు లేవు. తక్కువ మార్జిన్‌తోనే వ్యాపారం చేస్తున్నాం. కొన్ని మోడళ్లతోనే పోటీలో.. ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకం. తక్కువ మోడళ్లతోనే మార్కెట్లో నిలదొక్కుకుంటాం. 2017లో 8 మోడళ్లే తీసుకొచ్చాం. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో కొత్త మోడళ్లుంటాయి. షావోమి కస్టమర్లలో 85 శాతం మంది 18–35 ఏళ్ల వయసువారు. వీరంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారే. మోడళ్ల తయారీలో 20 లక్షల పైచిలుకు ఫ్యాన్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 650కి పైగా సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 17 కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఎక్స్‌పీరియెన్స్ జోన్స్ అయిన ‘మి’ హోమ్స్ 13 వరకూ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియాలో మేం కూడా... ఇప్పటి వరకు భారత్‌లో రూ.3,000 కోట్లదాకా పెట్టుబడి పెట్టాం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రెండు, నోయిడాలో ఒక ప్లాంటు ఉన్నాయి. దశలవారీగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం. విడిభాగాల తయారీ కంపెనీలను భారత్‌కు ఆహ్వానిస్తున్నాం. రెండేళ్లలో పూర్తి తయారీ ఇక్కడే చేపట్టాలన్నది మా లక్ష్యం. స్టార్టప్స్‌లో పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నాం. అయిదేళ్లలో 100 స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టడమేగాక, మోడళ్ల తయారీలో ఆ కంపెనీలను భాగస్వాముల్ని చేస్తాం. ఆఫ్‌లైన్‌లో అంచనాలను మించి విక్రయాలు... కంపెనీ విక్రయాల్లో ఆఫ్‌లైన్ వాటా 20 శాతానికి చేరుకుంది. 2018 ప్రారంభంలో ఇది 30 శాతానికి ఎగబాకుతుందని అంచనా. ఆఫ్‌లైన్ బాగుంది. ప్రిఫర్డ్ పార్టనర్లు 15 నగరాల్లో 1,000కిపైగా ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో భాగస్వాములను నియమిస్తాం. ఆన్లైన్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 50.8 శాతం వాటాతో షావోమి టాప్‌లో నిలిచింది. 2014 మూడో త్రైమాసికంలో లక్ష యూనిట్లు మాత్రమే విక్రయించాం. 2017 మూడవ త్రైమాసికంలో 92 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాం. పండుగల సీజన్లో 40 లక్షల స్మార్ట్ఫోన్ల అమ్మకాలతో సంచలనం సృష్టించాం. వచ్చే ఏడాది షావోమి ఐపీఓ! స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ, షావోమి/లిటిల్ రైస్ త్వరలో చైనాలో ఐపీఓకు రానుంది. ఐపీఓ విషయమై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్‌తో చర్చలు జరుపుతున్న ఈ కంపెనీ తమ కంపెనీ విలువ కనీసం 5,000 కోట్ల డాలర్లు ఉండాలని కోరుతోందని సమాచారం. బీజింగ్‌కు చెందిన ఈ కంపెనీ ఐపీఓ వచ్చే ఏడాది హాంగ్‌కాంగ్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. 2010లో ప్రారంభమైన ఈ కంపెనీ సంప్రదాయ రిటైల్ స్టోర్స్ అమ్మకాలను తోసిరాజని ఆన్లైన్ ద్వారా జోరుగా అమ్మకాలు సాధించింది. ఫ్లాష్ సేల్స్‌తో ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ఆన్లైన్ మార్కెటింగ్‌లో తనదైన ముద్రను వేసింది. 2014లో ఈ కంపెనీ చివరి సారిగా నిధులు సమీకరించింది. అప్పుడు ఈ సంస్థను 4,600 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. -
షావోమి దేశ్ కా స్మార్ట్‌ఫోన్..రేపే
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో దిగ్గజ కంపెనీలకు సైతం దడ పుట్టిస్తూ దూసుకుపోతున్న చైనా మొబైల్ మేకర్ ఇపుడు మరో సంచలనానికి నాంది పలికింది. దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ రేపు (నవంబరు 30)న విడుదల చేస్తోంది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇది లభ్యంకానుంది. షావోమి వై 1, వై 1 లైట్ స్మార్ట్‌ఫోన్ ల తరువాత వెంటనే లాంచ్ చేస్తున్న ఈ డివైస్‌ను సుమారు రూ. 5,900 లకు విక్రయించనుందని సమాచారం. ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్న రెడ్మి 5ఏ తరహాలోనే దీని ఫీచర్లు ఉండవచ్చని అంచనా. 5 అంగుళాల డిస్ప్లే 1280x720 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 13ఎంపీ ప్రైమరీ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
ధరలు తగ్గించిన షావోమి
చైనాకు చెందిన షావోమి, ఎంఐ యాక్ససరీస్‌పై భారత్‌లో ధరలు తగ్గించింది. జీఎస్టీ తగ్గింపుతో, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు పేర్కొంది. తాజా ఈ నిర్ణయంతో ఎంఐ పవర్ బ్యాంకు, ఎంఐ బిజినెస్ బ్యాక్‌ప్యాక్, ఎంఐ ఛార్జర్, 2-ఇన్-1 యూఎస్బీ ఫ్యాన్, పలు స్మార్ట్‌ఫోన్ కేసులు ప్రస్తుతం సమీక్షించిన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ చైనీస్ కంపెనీ దేశంలో మూడో తయారీ సౌకర్యాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ఈ ప్రకటనను వెలువరించింది. ''జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ రేటును తగ్గించింది. ఈ ప్రయోజనాలను మా ప్రియమైన ఎంఐ అభిమానులకు అందించే సమయం ఆసన్నమైంది. మీరు కోరుకున్న ధరలో మీకు ఇష్టమైన యాక్ససరీని కొనుగోలు చేయవచ్చు'' అని షావోమి తన ఎంఐ కమ్యూనిటీ ఫోరమ్స్ ఒక పోస్టు చేసింది. సమీక్షించిన ధరల అనంతరం 10000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2 రూ.1,099కే అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర 1,199 రూపాయలు. 10000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ ప్రొ రూ.1,499కు(అసలు ధర రూ.1,599), 20,000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2 రూ.1,999కు(అంతకముందు దర రూ.2,199) తగ్గించినట్టు షావోమి తెలిపింది. రూ.1,499గా ఉన్న ఎంఐ బిజినెస్ బ్యాక్‌ప్యాక్ ధర రూ.1,299కు తగ్గింది. ఇలా ఎంఐ ఛార్జర్, పలు స్మార్ట్‌ఫోన్ కేసులపై కూడా ధరలను తగ్గించింది. అన్ని యాక్ససరీస్, కేసులు, స్క్రీన్ ప్రొటెక్టర్స్ కొత్త ధరలతో ఎంఐ ఇండియా స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని షావోమి తెలిపింది. అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంఐ యాక్ససరీస్ ధరలను అప్డేట్ చేశాయి. -
ఐఫోన్ ఎక్స్‌కు పోటీగా షావోమి స్మార్ట్‌ఫోన్
షావోమి.. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ కంపెనీ పేరు మారుమోగుతోంది. ప్రతి సెగ్మెంట్లోనూ ఈ కంపెనీ స్మార్ట్ఫోన్లు తమ హవా సాగిస్తున్నాయి. కానీ ఫ్లాగ్షిప్ల దగ్గరికి వచ్చేసరికి షావోమి తన మార్కును చూపించుకోలేకపోతుంది. ముఖ్యంగా భారత్‌లో హైఎండ్ వేరియంట్ల విషయంలో వన్‌ప్లస్, హువాయ్ నుంచి గట్టి పోటీ, ఈ కంపెనీ తన సత్తాను చాటలేకపోవడం ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై షావోమి దృష్టి సారించింది. షావోమి ఎంఐ 7 పేరుతో వచ్చే ఏడాది ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. బెజెల్-లెస్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఇది రూపొందుతుంట. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్, వన్‌ప్లస్ 5టీకి గట్టిపోటీ ఇవ్వగలదని తెలుస్తోంది. మైడ్రైవర్స్ రిపోర్టు ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తారని, క్వాల్కామ్ అప్‌కమింగ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్సెట్తో రూపొందుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6.01 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే కూడా ఉంటుందట. 6జీబీ ర్యామ్, 16ఎంపీ సెన్సార్లతో వెనుకవైపు రెండు డ్యూయల్ కెమెరాలు, తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోగ్రఫీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ దీనిలో ఫీచర్లుగా ఉండబోతున్నాయని మైడ్రైవర్స్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.26,600గా ఉండబోతుందని అంచనా. దేశీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి షావోమికి ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో సహకరిస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. -
షావోమి స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్
షావోమి ఎంఐ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఢిల్లీకి చెందిన క్యాషిఫై సంస్థతో కలిసి, ఈ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. దీని కింద కొత్త షావోమి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు, తమ పాత హ్యాండ్సెట్లతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్చేంజ్ చేసుకునే క్రమంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ లభిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్ విలువను క్యాషిఫై టీమే నిర్ణయించనుంది. ఆ విలువ మేర కొత్త స్మార్ట్‌ఫోన్‌పై ధర కూడా తగ్గుతుంది. ఎంఐ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్ కింద పాత ఫోన్ రిటర్నులో కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు, దగ్గర్లోని ఎంఐ హోమ్ స్టోర్‌కు విచ్చేయాల్సి ఉంటుంది. ఎంఐ హోమ్ స్టోర్‌లో మొత్తం నగదును చెల్లించి కొత్త ఫోన్‌ను కొనుగోలుచేసిన అనంతరం, పాత మోడల్ మొత్తాన్ని క్యాషిఫై టీమ్ తర్వాత చెల్లించనుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు క్యాషిఫై నుంచి పికప్ సర్వీసునూ ఎంచుకోవచ్చు. దీనికోసం యూజర్ క్యాషిఫై వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎంఐ హోమ్ కేవలం ఒకే ఒక్క షావోమి స్మార్ట్‌ఫోన్ మాత్రమే ఈ ఎక్స్చేంజ్లో అందుబాటులో ఉండనుంది. అంతేకాక ఎక్స్చేంజ్ చేయాలనుకునే యూనిట్ క్యాషిఫై పోర్టుఫోలియోలో లిస్టు అయి ఉండాలి. 2015లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన షావోమి, భారత్‌లో బలమైన పునాదులను ఏర్పరుచుకుంది. ఏడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 13 ఎంఐ హోమ్ అవుట్లెట్లను ఏర్పాటుచేసింది. -
రెడ్ మి నోట్ 5 ఫీచర్లు లీక్
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో భారత్‌లో రారాజుగా దూసుకుపోతున్న షావోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో పాపులర్ రెడ్మి నోట్ 4కు కొనసాగింపుగా తీసుకొస్తున్న అప్ కమింగ్ డివైస్ రెడ్ మి నోట్ 5 ఫీచర్స్ , ఇమేజ్ తదితర సమాచారం లీకైంది. బెజెల్ లెస్ డిజైన్‌తో , డిస్ప్లే సైజ్, షేప్‌లో భారీ మార్పులతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుందని చైనా మీడియా తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే MIUI ఆధారంగా పనిచేసినా.. ఆండ్రాయిడ్7.1.2 ఆధారితం. అలాగే డబుల్ కెమెరాలతో లాంచ్‌కానుందని ఇటీవలి అంచనాలు వెలువడినా షావోమి అధికారిక ప్రకటన తరువాత మాత్రమే కెమెరాలకు సంబంధించిన వివరాలు భ్యం కానున్నాయి. రెడ్ మి నోట్ 5 ఫీచర్లు 5.99 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.2 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4000 ఎంఏహెచ్‌బ్యాటరీ