yadav
-
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం (ఫొటోలు)
-
వివాదాస్పద తీరు.. ఆగడాల్లో సరిలేరు!
ఎక్కడైనా ఒక పోలీసు అధికారికి మంచి పోస్టింగ్ ఇవ్వాలంటే పనితీరు, నిజాయితీ వంటివి చూస్తారు. కానీ ఆ సీఐకి ఈ అర్హతలే లేవు. పైపచ్చు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హత్య కేసుల్లో నిందితులకు సహకరిస్తారని, బాధితులపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, రాజకీయ నాయకులఅడుగులకు మడుగులొత్తడంలో ఘనాపాటిగా పేరుంది. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచి మరీ అందలం ఎక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: గతంలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన రెండు హత్యలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాయి. అనంతపురం రూరల్ మండలం కందుకూరులో 2018 మార్చి 30న వైఎస్సార్ సీపీ నేత శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఇటుకలపల్లి నుంచి స్వగ్రామం వెళ్తుండగా దారిలో కాపుకాచిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు వారం రోజుల ముందే రెండు వర్గాల నడుమ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివారెడ్డి సోదరుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందించగా, అప్పట్లో సీఐగా ఉన్న రాజేంద్రనాథ్ యాదవ్ దాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత వారం రోజులకే శివారెడ్డి హత్య జరి గింది. వినతిపత్రం ఇచ్చినప్పుడే నిందితులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే అసలు హత్యే జరిగి ఉండేది కాదని కందుకూరు గ్రామస్తులు నేటికీ చెబుతున్నారు. శివారెడ్డి హత్యకు పరోక్షంగా సీఐ కూడా కారణమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణ అధికారిగా రాజేంద్రనాథ్ ఉంటే బాధితులకు న్యాయం జరగదని మరో పోలీసు అధికారిని ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం.ప్రసాదరెడ్డి హత్య కేసులోనూ..2015 ఏప్రిల్ 29న ఏకంగా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే వైఎస్సార్ సీపీ కీలక నేత భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య నేపథ్యంలోనూ రాజేంద్రనాథ్ వ్యవహార శైలిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారును అప్పట్లో శివప్రసాద్ రెడ్డి హత్య కేసు నిందితులు వాడినట్టు తేలింది. ఆ సమయంలో దగ్గుపాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. ఇప్పుడు దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే కావడంతో రాజేంద్రనాథ్ ఏకంగా కీలకమైన వన్‌టౌన్‌కు పోస్టింగ్ తెచ్చుకోగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సెటిల్మెంట్లలో ఘనుడు!రాప్తాడుకు చెందిన ఓ విలేకరికి, ఆయన అన్నదమ్ములకు మధ్య భూ వివాదం నడుస్తోంది. వీరిలో ఒక వర్గానికి పరిటాల కుటుంబం మద్దతు ఉంది. దీంతో అప్పట్లో మంత్రి అయిన పరిటాల సునీత ఒత్తిడితో విలేకరిపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రెచ్చిపోయారు. విలేకరి చొక్కా పట్టుకుని ‘భూమి మీద నీకు హక్కులేదు, మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా లేదా’ అని బెదిరించారు. దీంతో బాధిత విలేకరి అప్పట్లో తన మిత్రులతో కలిసి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగగా సీఐ క్షమాపణలు చెప్పారు. ఇలా ల్యాండ్ సెటిల్మెంట్లలోనూ ఘనాపాటిగా రాజేంద్రనాథ్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు.తాజాగా స్టూడెంట్ యూనియన్ నేతలపై..నేటికీ రాజేంద్రనాథ్ యాదవ్ తన వివాదాస్పద వైఖరిని వీడలేదు. స్టూడెంట్ యూనియన్ నాయకులపై ఇటీవల తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. స్కాలర్షిప్లు మంజూరు చేయాలంటూ అనంతపురంలోని పెన్నార్ భవన్ వద్ద ధర్నాకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలపై చిందులు తొక్కారు. సీఐ వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, తమను కొట్టడానికి కూడా యత్నించారని, విద్యార్థుల పట్ల కూడా అమాన వీయంగా వ్యవహరించారని విద్యార్థి సంఘం నేతలు వాపోయారు. ఇలా తాను ఎక్కడ పనిచేసినా లెక్కలేనన్ని ‘ఘనతలు’ మూటగట్టుకున్న వ్యక్తికి నగరంలో కీలక స్థానాన్ని కట్టబెట్టడం ఉమ్మడి జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేసే పోలీసు బాస్‌లు రాజేంద్రనాథ్ యాదవ్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
తిరగలి పట్టిన మాజీ సీఎం రబ్రీదేవి
పట్నా: బీహార్‌లో ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపిస్తున్నారు. గోధుమలను తిరగలి పడుతూ, వాటిని జల్లెడ పడుతూ, శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్ ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి’ అని రాశారు.ఈ వీడియోను చూసిన రవి ఆనంద్ అనే యూజర్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన తల్లి ఆమె’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ రాశారు. जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024ఇది కూడా చదవండి: ‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు -
వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు నిధుల లభ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దానిని ఎలా అధిగమించాలో ఆలోచించిన తర్వాత పీపీపీ విధానంపై ముందుకు వెళ్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదని చెప్పారు. వైద్య రంగంలో అద్భుతాలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అన్నారు. వైద్య రంగంలో సమస్యల పరిష్కారానికి 30 అంశాలతో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. ముందుగా ప్రభుత్వాస్పత్రుల్లో వనరుల ఆవశ్యకతపై ఆడిట్ చేస్తామన్నారు. అనంతరం ఆరు నెలల్లోగా ఆస్పత్రుల్లో వసతులు, సాంకేతిక నిపుణుల కొరతను అధిగమిస్తామని చెప్పారు. ఏడాదిలోగా అవసరాల మేరకు సీటీ, ఎమ్మారై వంటి ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించేలా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా)తో చర్చించామన్నారు. ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేశామని, మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. నెలవారీగా బిల్లులు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు కోరినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదంటూనే.. గత ప్రభుత్వంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందింది ఏమీ లేదని, ఎక్కడ చూసినా సమస్యలున్నాయని ఆరోపిస్తూనే.. అనంతపురం జీజీహెచ్‌లో పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి చికిత్స పొందుతున్నారని, గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ, గుండె, లివర్ వంటి అవయవాల మారి్పడి సర్జరీలు కూడా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదుతరగతుల ప్రారంభానికి సిద్ధమైన పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, పాడేరు, ఆదోని వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రి స్పందించారు. వైద్య శాఖలో స్వల్ప కాలంలో పరిష్కరించదగ్గ సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో సరిపడా ఫ్యాకల్టీ లేరని, వసతులు పూర్తిస్థాయిలో కల్పించలేకపోవడంతో నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు నిరాకరించిందన్నారు. రెండు నెలల్లో పోస్టులేమీ భర్తీ చేయలేదని తెలిపారు. పులివెందుల వైద్య కళాశాలలో 50 సీట్లకు అండర్‌టేకింగ్ ఇస్తామన్నారు. ఐదు వైద్య కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు ఉంటాయని విద్యార్థులు ఎదురు చూస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తొలి, మలి, చివరి విడతల కళాశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. స్వల్ప వ్యవధిలో అద్భుతాలు సృష్టించలేమని పేర్కొన్నారు. -
యూపీలో మరో ఎన్కౌంటర్
యూపీలో మరో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ మన్నా సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన పంకజ్ యాదవ్‌పై యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) కాల్పులు జరిపింది. ఈ నేరస్తునిపై పై లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ మృతిచెందాడు. కాగా బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ, మాఫియా షహబుద్ధీన్లకు పంకజ్ యాదవ్‌లకు షూటర్‌గా పనిచేశాడు. అలాగే డబ్బుల కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గానూ పేరొందాడు. ఈ ఘటన గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ మధుర-ఆగ్రా హైవేలోని ఫర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని ఎస్టీఎఫ్ తమకు తెలియజేసిందన్నారు. నేరస్తుడు పంకజ్ యాదవ్ తన సహచరులలోని ఒకరితో కలిసి బైక్‌పై ఆగ్రా వైపు వెళ్తున్నట్లు ఇన్ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతనిని వెంబడించింది. ఆతను గ్రామం వైపు పరిగెడుతూ ఎస్టీఎఫ్ బృందంపై కాల్పులు ప్రారంభించాడు. దీనికి ప్రతిగా ఎస్టీఎఫ్ కూడా కాల్పులు జరిపింది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతని కోసం గాలిస్తోంది.గాయపడిన పంకజ్‌ను మధుర జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. యూపీ ఎస్టీఎఫ్ బృందం సంఘటనా స్థలం నుండి ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. పంకజ్ యాదవ్ మవులోని తాహిరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ గ్రామ నివాసి. మన్నా సింగ్ హత్యలో ప్రమేయమున్న పంకజ్ యాదవ్‌పై హత్య, దోపిడీ తదితర 36 కేసులు నమోదయ్యాయి. పంకజ్ యాదవ్‌ను అరెస్టు చేయడానికి యూపీ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సిబ్బంది చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
అక్క రాఖీకి వస్తానంది: శ్రేయ సోదరుడు
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ కావాలనే కలతో ఆ కోచింగ్ సెంటర్లో చేరిన శ్రేయ యాదవ్ కూడా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.టీవీలో వస్తున్న వార్తలు చూశాకనే తమ శ్రేయ ఈ లోకంలో ఇక లేదని తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన శ్రేయ సోదరుడు.. అక్క రాబోయే రక్షాబంధన్‌కు వస్తానని హామీ ఇచ్చిందని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు. ఇంటిలోని పెద్ద సంతానం మృతి చెందడంలో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.ఘజియాబాద్‌లో ఉంటున్న శ్రేయ మామ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన వార్త టీవీలో చూడగానే శ్రేయకు ఫోన్ చేశాను. ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చివరికి కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లగా, అక్కడి సిబ్బంది శ్రేయ మృతిచెందిందని చెప్పారుగానీ, ఆమె ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఇది పోలీసు కేసు అని చెప్పారని ధర్మేంద్ర తెలిపారు. -
లాలూకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గత రాత్రి(మంగళవారం) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగానే ఉంది. దీంతో వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.లాలూ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల ఆయనకు చికిత్స అందించారు. తరువాత అతని ఆరోగ్యం పరిస్థితి కుదుటపడింది. లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు రాత్రంతా ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం.లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీపీ పెరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు రాకేష్ యాదవ్ తెలిపారు. 2022లో లాలూకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆయన చాలా కాలంగా మధుమేహం, అధిక రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత లాలూ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్‌గా మారి, ఎన్నికల సమయంలో వేదికపై నుంచి ప్రసంగాలు కూడా చేశారు. -
ఇంగ్లిష్ యాదవ్ చాచా
ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇతడిని ‘ఆటోడ్రైవర్ యాదవ్ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్ యాదవ్ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్. -
కొత్త ఆటకు సీఎం నితీష్ తెరలేపుతున్నారా?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 243 సీట్లు వచ్చాయి. సంపూర్ణ మెజారిటీ సంఖ్యను ఒంటరిగా టచ్ చేయడంలో బీజేపీ విజయవంతం కాలేదు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల సాయంతో మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది.లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వచ్చింది. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈరోజు (బుధవారం) జరిగే ఎన్డీఏ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఇండియా కూటమి కూడా ఈరోజు(బుధవారం) భేటీ కానుంది.ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు పట్నా నుంచి బయలుదేరి వెళ్లారు. వీరిద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ 12 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. నితీష్, తేజస్వి కలసి వెళుతుండటం చూసిన రాజకీయ విశ్లేషకులు నితీష్ కొత్త ఆటకు తెరలేపుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నాగార్జున యాదవ్ ని మంత్రిని చేసి నన్ను పక్కన పెట్టిన పర్లేదు: కొడాలి నాని
-
సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ ముగిసింది. ఇంతలో బీహార్ రాజకీయాల్లో మరో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. లాలూ యాదవ్‌ను ఒకసారి ఓడించిన జేడీయూ అధినేత ఇప్పుడు ఆర్జేడీలో చేరబోతున్నారని సమాచారం. ఇది సీఎం నితీష్ కుమార్‌కు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రబ్రీ దేవి నివాసంలో లాలూ సమక్షంలో రంజన్ ఆర్జేడీలో చేరనున్నారని తెలుస్తోంది.లాలూ యాదవ్‌కు రంజన్ యాదవ్ అత్యంత సన్నిహితుడు. ఒకానొక సమయంలో రంజన్ యాదవ్ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో లాలూకు అండగా ఉన్నారు. రంజన్ యాదవ్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. జనతాదళ్ అతనికి ఈ అవకాశాన్ని కల్పించింది. రంజన్ 1990 నుంచి 1996 వరకు ఆర్జేడీలో ఉన్నారు. ఆ తర్వాత ఆర్జేడీని వీడి జేడీయూలో చేరారు.2009లో పాటలీపుత్ర పార్లమెంటరీ స్థానం నుండి లాలూ యాదవ్‌పై పోటీకి జేడీయూ రంజన్‌ను నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో రంజన్ యాదవ్ లాలూను ఓడించారు. తరువాత రంజన్ బీజేపీలో చేరారు. దీనికి ముందు ఆయన రాష్ట్రీయ జనతాదళ్ (నేషనలిస్ట్) పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. ఇప్పుడు రంజన్ యాదవ్ మరోసారి బీహార్ రాజకీయాల్లో పునరాగమనం చేయనున్నారు. రంజన్ యాదవ్ రాకతో లాలూ పార్టీకి మరింత సత్తా వస్తుందని పలువురు భావిస్తున్నారు. -
లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్) గురించి తెలియనివారెవరూ ఉండరు. ఆయన కుమార్తె, సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన రోహిణి ఆచార్య ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు. మహాకూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన అఫిడవిట్లో తనకు రూ.15.82 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తన భర్తకు రూ.19.86 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయని తెలియజేశారు.వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె వివాహం తర్వాత సింగపూర్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడామె భారత్‌కు తిరిగివచ్చారు. ఆమె తన వద్ద రూ.2.99 కోట్ల చరాస్తులు, రూ.12.82 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భర్త దగ్గర రూ.6.92 కోట్ల చరాస్తులు, రూ.12.94 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే తన వద్ద రూ.20 లక్షల నగదు, భర్త వద్ద రూ.10 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం ఆమె దగ్గరున్న స్థిరాస్తులలో పట్నాలో రూ.68.62 లక్షల విలువైన వాణిజ్య పరమైన ఆస్తి కూడా ఉంది. రోహిణి ఆచార్య గతంలో తన తండ్రి లాలూ ప్రసాద్‌కు కిడ్నీ దానం చేసి, వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటారు. మే 20న ఐదవ దశ లోక్‌సభ ఎన్నికల్లో సారణ్‌లో ఓటింగ్ జరగనుంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీపై ఆమె పోటీ చేస్తున్నారు. రోహణి ఆచార్య .. లాలూ ప్రసాద్, రబ్రీ దేవిలకు నాల్గవ సంతానం. గతంలో లాలూ ప్రసాద్ సారణ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. -
యాదవుల కోసం ప్రత్యేక జీవో..!
-
‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారు’
వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని భరత్ యాదవ్ తెలిపారు. వివేకా కేసులో జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది అని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, భరత్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు దస్తగిరి వైఎస్ కుటుంబంపై బురదజల్లుతున్నాడు. దస్తగిరి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?. ఇది వరకు.. ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్దితి ఎంటీ?. సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుంది. డబ్బు కూడా అమె ద్వారానే దస్తగిరికి అందుతోంది. అందుకే సునీత మాట్లాడమన్నట్లు దస్తగిరి మాట్లాడుతున్నాడు. దస్తగిరికి ప్రాణహానీ ఉన్నప్పుడు.. వంట మనిషి బీబీ ద్వారా ప్రాణహానీ ఎందుకు ఉండదు. ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేంత డబ్బు ఎలా వస్తుంది?. ఐస్ బండి నడిపే దస్తగిరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?. ఖచ్చితంగా దస్తగిరి వెనక సునీత, అమె భర్త రాజశేఖర్ ఉండి మాట్లాడిస్తున్నారు. వైఎస్ వివేకా రెండవ భార్యకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆయన చంపించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి. వైఎస్ వివేకా హత్య తర్వాత దస్తగిరి, సునీల్, ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి డబ్బు రావాలి అని ఎర్ర గంగిరెడ్డి చెప్పేవారు. జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది’ కీలక వ్యాఖ్యలు చేశారు. -
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భోపాల్: బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్(58) పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల ఆధ్వర్యంలో బీజేపీ శాససనసభాపక్షం సోమవారం సాయంత్రం భోపాల్‌లో సమావేశమైంది. తమ నాయకుడిగా మోహన్ యాదవ్‌ను ఎన్నుకుంది. ఆయన పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. మోహన్ యాదవ్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఆయన ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన వారిలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు ఉండడం, రాష్ట్రంలో 48 శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంలో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా మోహన్ యాదవ్ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాజీనామా సమరి్పంచారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తానని యాదవ్ చెప్పారు. తనను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరడుగట్టిన హిందుత్వావాది మోహన్ యాదవ్ విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగారు. కరడుగట్టిన హిందుత్వావాదిగా ముద్రపడ్డారు. కళాశాలల్లో ‘రామచరిత మానస్’ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెడతామని 2021లో ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జని్మంచారు. 1982లో ఉజ్జయినిలోని మాధవ్ సైన్స్ కాలేజీలో జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1984లో అదే కాలేజీలో ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఎల్ఎల్బీ, ఎంబీఏతోపాటు పీహెచ్డీ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. 1993 నుంచి 1995 దాకా ఆర్ఎస్ఎస్ ఆఫీసు బేరర్‌గా పనిచేశారు. తొలిసారిగా 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. 2020లతో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు ఆయనే. -
విషాదాల్లోనూ వీడని రాఖీ బంధం
తిమ్మాపూర్, ముస్తాబాద్(సిరిసిల్ల), నర్సాపూర్ రూరల్: సోదరీ సోదరుల ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ రోజున గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు, ప్రమాదాల్లో ముగ్గురు సోదరులు దుర్మరణం పాలయ్యారు. రాఖీ కడదామని ఆనందంగా పుట్టింటికి వచ్చిన చెల్లెళ్లకు అన్నల మృతి తీరని శోకాన్ని మిగల్చగా.. అంతటి విషాదంలోనూ చివరిగా మృతదేహాలకు రాఖీ కట్టి సోదరులపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. రాఖీ కట్టేందుకు తన ఇద్దరు చెల్లెళ్లు వస్తున్నారని తెలిసి పొలం నుంచి స్కూటీపై ఇంటికి బయలుదేరిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన పోచమల్లు యాదవ్ (43)ను రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మరణవార్త విని చెల్లెళ్లు బోరున విలపిస్తూ ఇంటికి వచ్చి శవానికి చివరిసారిగా రాఖీ కట్టారు. చివరిసారి రాఖీ కడుతున్నా.. లేరా తమ్మీ.. ‘లేరా తమ్మీ.. రాఖీ కట్టేందుకు వచ్చిన.. ఒక్కసారి చూడురా.. ఇది నీకు కట్టే చివరి రాఖీరా తమ్మీ..’అంటూ తమ్ముడి మృతదేహంపై పడి సోదరి గుండెలవిసేలా రోదించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కౌలురైతు అనమేని నర్సింలు(37) బుధవారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం తరువాత బావిలో పడ్డట్లు గుర్తించి మృతదేహాన్ని బయటికి తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలో ఉండే సోదరి రాజవ్వకు ఈ విషయం తెలియక తన తమ్ముడు నర్సింలుకు రాఖీ కట్టేందుకు గురువారం ఉదయమే ముస్తాబాద్‌కు వచ్చింది. నర్సింలు బావిలో గల్లంతయ్యాడని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. రాఖీ కడదామని వచ్చి అంత్యక్రియల్లో.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచ గ్రామానికి చెందిన కొండి జగన్(45)కు నర్సమ్మ, అంబిక ఇద్దరు చెల్లెళ్లు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరూ పుట్టింటికి వచ్చారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ గురువారమే మృతి చెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాఖీ కడదామని వస్తే అన్న అంత్యక్రియలు చే -
'మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి'
లక్నో: కేంద్ర ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మణిపూర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు జీ20 సదస్సును అక్కడ నిర్వహించట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు 'జీ20 కా చునావ్ కనెక్షన్' సెషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. 'దేశవ్యాప్తంగా జీ20 సెషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్‌లను మణిపూర్‌లో నిర్వహించవచ్చు.' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మణిపూర్ సమస్యపై ప్రతిపక్షాలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అటు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే.. ఈ తీర్మాణంపై కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది. ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
యూట్యూబర్..కమెడియన్ ఎల్విష్ యాదవ్ కళ్లు చెదిరే లగ్జరీ కార్ కలెక్షన్ (ఫొటోలు)
-
యాదవులుకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు
-
మంచి మనసున్న మన్నెం
నల్గొండ: ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న గణేశ్‌కు చికిత్స అనంతర ఖర్చుల కోసం మండలానికి చెందిన ఎన్ఆర్ఐ, బీఆఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెందిన శంకర్ కుమారుడు గణేష్‌కు ఇటీవల నిమ్స్‌లో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న మన్నెం రంజిత్ యాదవ్ ఆదివారం నిమ్స్‌లో గణేష్ తల్లిదండ్రులను కలిసి వారికి రూ.20వేలు అందజేశారు. ఆయన వెంట మాడుగులపల్లి బీఆఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు కడయం సైదులు, ముద్ద నవీన్ ఉన్నారు. -
కేంద్ర అటవీశాఖమంత్రితో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
చంద్రబాబు ఏనాడు బీసీలను పట్టించుకోలేదు : నాగార్జున యాదవ్
-
గాందీభవన్ వద్ద యాదవసంఘాల ఆందోళన
-
దీక్ష భగ్నం చేయడం దుర్మార్గం
ఒంగోలు సెంట్రల్: యాదవ జాతి అభిభ్యున్నతి కోసం, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతి యుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేయడం దుర్మార్గమని యాదవ జేఏసీ జిల్లా కన్వీనర్ మిరియం శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం స్థానిక అంకమ్మపాలెంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సమస్యలపై స్పందించి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో దీక్షలు మొదలు పెడతామని చెప్పారు. కాపులకు బీసీ రిజర్వేషన్ ఆలోచన విరమించుకుని యాదవులు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచాలని డిమాండ్ చేశారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నాయకులకు మిరియం కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘ నాయకులు కుట్టుబోయిన కోటి, మల్లెబోయిన రాజు, తుమ్మకూరి దొర, మల్లవరపు లక్ష్మి, జాజుల కృష్ణ, దూళ్ల అప్పారావు, పిన్నిక శ్రీనివాస్, మిరియం శ్రీను పాల్గొన్నారు. -
సంఘటిత శక్తితోనే బలోపేతం
‘యాదవుల అలయ్– బలయ్’లో ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి సాక్షి, హైదరాబాద్: సమాజానికి యాదవ సంఘం దిక్సూచీలాగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి అన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో యాదవుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘యాదవుల అలయ్-బలయ్’కార్యక్రమం జరిగింది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్య క్షుడు మేకల రాములు యాదవ్ అధ్యక్షత న జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన చక్రపాణి..కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. సంఘటిత శక్తితోనే సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాదవుల్లో ఎవరైనా ఎదుగు తున్నారంటే వారి ని గౌరవించాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమాచార హక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. ఆర్టీఐ-2005 యాక్ట్ సామాన్యులకు ఎంతో బలాన్ని, అధికారాన్ని ఇచ్చిందని, పాలనలో పారదర్శ కతకు ఇది దోహదపడుతుందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేష న్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదవులందరం కలసికట్టుగా ముందుకుసాగి రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్, తమిళనాడు రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.ఆర్.దామోదరన్ యాదవ్, సినీ నటి కరాటే కళ్యాణి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, యాదవ్ సంఘం ఏపీ నాయకులు రామయ్య యాదవ్, ఎంఎం కొండయ్య యాదవ్, తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు బడుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.