కై లాస్‌నగర్: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నె ల 15, 16 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్యామలా దేవి ప్రకటనలో తెలిపారు. రెండు రోజులు, నాలుగు సెషన్లలో నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో 29 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 15న ఉదయం పేపర్–1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం పేపర్–2 (హిస్టరీ, పొలిటీ అండ్ సొసైటీ), 16న ఉదయం పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్), మధ్యాహ్నం పేపర్–4 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)పై పరీక్షలు ఉంటా యని తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను సోమవారం నుంచి టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలి పా రు. అలాగే అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని, గంటన్నర ముందుగానే లోనికి అనుమతించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment