ఉత్సాహంగా సీఎం కప్ పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలు నాలుగోరోజుకు చేరాయి. గురువారం టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కరాటే ఎంపిక పోటీలను ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి ప్రారంభించారు. డీవైఎస్వో వెంకటేశ్వర్లు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్, డీఆర్‌డీఏ సహాయ విజిలెన్స్ అధికారి రాజేశ్వర్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు హరిచరణ్, ఖాజిం, సాయి, స్వామి, కభీర్‌దాస్, రవికాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment