రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
భైంసారూరల్: మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. కుంటాల మండలం మెదన్‌పూర్ గ్రామానికి చెందిన భోజారం తన బంధువు సిద్దేశ్వర్‌తో కలిసి బైక్‌పై భైంసా వెళ్తున్నారు. అదే సమయంలో భైంసా నుంచి నిర్మల్‌వైపు వెళ్తున్న లారీని వానల్‌పాడ్ వద్ద బైక్ ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భోజారం, సిద్దేశ్వర్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్సులో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment