విద్యార్థులకు క్రీడా పోటీలు
అరకులోయ టౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అరకు బ్లాక్ లెవెల్ పోటీలు నిర్వహించారు. నెహ్రూ యువకేంద్రం జిల్లా యువజన అధికారి జి. మహేశ్వరరావు పర్యవేక్షణలో వాలీబాల్, కబడ్డీ, లాంగ్ జంప్, ఖోఖో, రన్నింగ్ పోటీలను నిర్వహించారు. పీడీ ఎస్.అప్పారావు, అధ్యాపకుడు వి. కామేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ పోటీల్లో 110 క్రీడాకారులు పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పుష్పరాజ్, ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు పి. నాగబాబు, వై. విజయలక్ష్మి, ఎం. అనిలకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment