ఫ్లెక్సీలపై ‘అధికార’ జులుం
రాప్తాడు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాప్తాడులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదమైంది. ఈ నెల 21న బస్టాండు కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు సమయంలో వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం తొలగించాలని వైఎస్సార్ సీపీ నాయకులు ఆ సమయంలో పట్టుపట్టడంతో అప్పట్లో పంచాయతీ కార్యదర్శి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ అంశంలో తమకు చుక్కెదురు కావడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో మరుసటి రోజు వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట ఉన్న రెండు ఫ్లెక్సీలను వదిలి మిగిలిన ఫ్లెక్సీలకు అనుమతులు లేవంటూ అధికారుల ద్వారా తొలగించేలా చేశారు. అక్కడితో ఆగకుండా సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట ఉన్న రెండు ఫ్లెక్సీలనూ కోసేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ఫ్లెక్సీలను కోసేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ మంగళవారం ఉదయం సీఐ శ్రీహర్షకు వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, మండల కన్వీనర్ జూటూరు శేఖర్, వైఎస్సార్ సీపీ నాయకులు చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, సాకే చంద్ర తదితరులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మన్నల రవికుమార్, చిరుతల నాగేంద్ర, సింగారప్ప, సాకే జయన్న, బులగొండ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు వైఎస్సార్‌సీపీ వినతి
Comments
Please login to add a commentAdd a comment