గార్లదిన్నె: మండలంలోని మర్తాడు గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన హాజీబాషా తన ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి ఈ నెల11న అనంతపురంలో బంధువుల ఇంటికి వెళ్లారు. గమనించిన దుండగులు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి, బీరువాలోని 12 తులాల వెండి, ఒక తులం బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు అపహరించారు. ఆదివారం ఇంటికి చేరుకున్న హాజీబాషా చోరీ విషయాన్ని నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ బాషా అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment