సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చేయకూడదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డివిజన్ శాఖ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మానవత్వం చాటుకున్న ఎస్పీ..
మదనపల్లి పట్టణానికి చెందిన ఆవుల రామచంద్ర సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వీల్‌చైర్‌లో వచ్చారు. ఎస్పీ విషయాన్ని తెలుసుకొని అతని వద్దకే స్వయంగా వెళ్లి సమస్యను సావధానంగా విన్నారు. సత్వరం విచారించి బాధితుని సమస్యను పరిష్కరించేలా చూడాలని మదనపల్లి డీఎస్పీని ఆదేశించారు. ఎస్పీ స్పందన పట్ల అక్కడికి వచ్చిన ప్రజలు అభినందనలు తెలిపారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment