Rashi Phalalu: ఈ రాశివారు శుభవార్తలు వింటారు | Horoscope Today: 04 September 2023 In Telugu - Sakshi
Sakshi News home page

Today Horoscope: దినఫలం: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. మిగతా రాశులవారికి ఇలా..

Published Mon, Sep 4 2023 6:31 AM | Last Updated on Mon, Sep 4 2023 9:21 AM

Horoscope Today 04 09 2023 Rashi Phalalu Telugu - Sakshi

గ్రహఫలం సోమవారం, 04.09.23
–––––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, నిజ శ్రావణ  మాసం,
సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.11. 
తిథి: బ.పంచమి రా.9.55 వరకు, తదుపరి షష్ఠి,
నక్షత్రం: అశ్వని ప.3.19 వరకు, తదుపరి భరణి,

వర్జ్యం: ఉ.11.26 నుండి 12.58 వరకు,
దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.40 వరకు,
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,

అమృతఘడియలు: ఉ.8.20 నుండి 9.55 వరకు;


మేషం: వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంభవం.

మిథునం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కర్కాటకం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

సింహం: దూరప్రయాణాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు.

కన్య: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కీలక నిర్ణయాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు.  ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

ధనుస్సు: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

కుంభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసత్తా నిరూపించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement