దేశీయంగా రికార్డు స్థాయిలో ఆదాయం
న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో తమ భారత విభాగం ఆదాయాలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో నమోదైనట్లు ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐప్యాడ్‌ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. సమీక్షాకాలంలో రెండు కొత్త స్టోర్స్‌ను (ముంబై, ఢిల్లీ) ప్రారంభించినట్లు కుక్ చెప్పారు. కొత్తగా మరో నాలుగు స్టోర్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
పుణె, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబైలో ఇవి ఏర్పాటు కానున్నాయి. సెపె్టంబర్ క్వార్టర్‌లో కంపెనీ మొత్తం ఆదాయం 6 శాతం వృద్ధి చెంది 94.93 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు 43.8 బిలియన్ డాలర్ల నుంచి 5.5 శాతం వృద్ధితో 46.22 బిలియన్ డాలర్లకు, ఐప్యాడ్ అమ్మకాలు 8 శాతం పెరిగి 6.95 బిలియన్ డాలర్లకు చేరాయి. సర్వీసుల విభాగం ఆదాయం 22.31 బిలియన్ డాలర్ల నుంచి 24.97 బిలియన్ డాలర్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment