బాబు మాట.. సద్దన్నం మూట
● ఇచ్చిన హామీలను నెరవేర్చని టీడీపీ కూటమి ప్రభుత్వం ● గత ఏడు నెలలుగా చంద్రబాబు కాలయాపన ● సంక్షేమ పథకాల్లేక.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి ● సూపర్ సిక్స్ పేరుతో మోసం ● జిల్లాలో పథకాలందక లక్షలాది మంది ప్రజలకు నష్టం ● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిని గుర్తు చేసుకుంటున్న జిల్లా వాసులు
ఎప్పుడిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి
ఎన్నిల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు. అవి ఇస్తాం.. ఇవి ఇస్తాం.. అంటూ ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా, చేదోడు, ఆసరా, డ్వాక్రా వడ్డీ మాఫీ తదితర పథకాలు మాకు అందాయి. మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన ఏటా క్రమం తప్పకుండా పడింది. ఈ ఏడాది ఒక్క పథకమూ లేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప ఎటువంటి లబ్ధి చేకూరలేదు. –ఎస్.కవిత, గృహిణి, ముడిపల్లె, నగరి మండలం
చిత్తూరు కలెక్టరేట్ : టీడీపీ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వ చ్చి ఆరు నెలలు పూర్తి అయి నా సంక్షేమ పథకాలను అమలు చేయకుండా గాలికి వదిలేసింది. కక్ష్య సాధింపులకు పెద్దపీట వేసిన కూటమి ప్రజా సంక్షేమ పథకాల అమలును పక్కన పెట్టింది. ఈ క్రమంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్‌సీపీ సర్కారు అమ లు చేసిన సంక్షేమ పథకాల చిత్తశుద్ధిని జిల్లా వాసులు గుర్తు చేసుకుంటున్నారు. జగనన్న పాలనకు ప్రస్తుత చంద్రబాబు నాయుడు పాలన పనితీరును బేరీజు వేసుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన మాటలన్నీ ఒట్టి మాటలేనని సంక్షేమమా...అదెక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పథకాలు అందక చితికిన జీవనం
జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జిల్లాలోని 32 మండలాల్లో 822 రెవెన్యూ గ్రామాలు, 697 గ్రామ పంచాయతీలు, ఒక నగరపాలక సంస్థ, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 18.73 లక్షల జనాభా ఉండగా, పురుషులు 9.40 లక్షలు, మహిళలు 9.33 లక్షల మంది నివసిస్తున్నారు. అర్బన్‌లో 3.29 లక్షలు, రూరల్‌లో 15.04 లక్షల మంది జనాభా ఉన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయినప్పటికీ సంక్షేమ పథకాలు అందక ప్రజల జీవితాలు చితికిపోయాయి.
వైఎస్సార్ సీపీ పాలనలో
ఏటా సంక్షేమ క్యాలెండర్
వైఎస్సార్ సీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం జగనన్న ప్రతి పథకాన్ని సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరిచి, ఎ ప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేసేవారు. ఈ పథకాల పొందే లబ్ధిదారులు ఆర్థికా భివృద్ధి చెంది, తమ కుటుంబాల ను సంతోషంగా పోషించుకునే వారు. ప్రస్తుతం ఆరు నెలలుగా పథకాలు అమలు కాకపోవడంతో అప్పులు చేసి, జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నా యని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పథకాలివీ..
కూటమి పాలనలో ఇదీ పరిస్థితి
విద్యాదీవెన రూ. 20 వేలు
వసతి దీవెన (రెండు దఫాలు) రూ.12,400
రైతు భరోసా రూ.13,500
చేదోడు రూ.10 వేలు
డ్వాక్రా వడ్డీ మాఫీ రూ. 2వేలు
ఆసరా రూ.20,900
మొత్తం రూ.78,800
ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు
నిరుద్యోగ భృతి లేదు
ఉచిత గ్యాస్ రూ.819
తల్లికి వందనం లేదు
కొత్త రేషన్ కార్డు లేదు
ఉచిత బస్సు ప్రయాణం లేదు
మహిళకు భృతి లేదు
మొత్తం రూ.819
ఇచ్చిన మాట నిలుపుకోవాలి కదా?
టీడీపీ కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంటే ఎలాంటి హామీలు నెరవేర్చడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేస్తారో కూడా తెలియజేయడం లేదు. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కేవలం గ్యాస్ డబ్బులు రూ.819, పింఛన్ మాత్రం అందాయంతే.
– కస్తూరి, గృహిణి, భరత్‌నగర్, వి.కోట.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పొందిన లబ్ధి
వైఎస్సార్‌సీపీ పాలనలో పొందిన లబ్ధి
అమ్మఒడి పథకం రూ.55 వేలు
ఆసరా రూ.18,260
డ్వాక్రా వడ్డీ రూ.2,060
మొత్తం రూ.75,320
అమ్మఒడి నాలుగు సార్లు రూ.55 వేలు
సున్నా వడ్డీ రూ.28 వేలు
వైఎస్సార్ ఆసరా రూ. 1.20 లక్షలు
వడ్డీమాఫీ రూ. 21 వేలు
మొత్తం 2.24 లక్షలు
అమ్మఒడి : రూ.71 వేలు
ఇంటి స్థలం : రూ.2.50లక్షలు
ఇంటి నిర్మాణం : రూ.1.10 లక్షలు
అత్త శాంతమ్మ పింఛన్ : రూ.1.80లక్షలు
మొత్తం : రూ.6.11 లక్షలు
అమ్మఒడి : లేదు
అత్త శాంతమ్మ పింఛన్
రూ.21 వేలు
దీపం పథకం
రూ.819
మొత్తం : రూ.21,819
సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటికో?
సీఎం చంద్రబాబు మాటలు నమ్మేందుకు వీలు లేదు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదు. పసుపు కుంకుమ పేరుతో మహిళలకు మొండి చేయి చూపించారు. ఇప్పటి పరిస్థితి అంతే. గత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి, ఆసరా, డ్వాక్రా రుణమాఫీ పథకాలు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఒక్క పథకం అమలు చేయలేదు.
– అంబిక, శివాలయం వీధి, కార్వేటినగరం
టీడీపీ కూటమి పాలనలో ఇదీ పరిస్థితి
మొహం చాటేస్తున్న ఎమ్మెల్యేలు
సంక్షేమ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు నిలదీస్తారనే భయంతో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండా మొహం చాటేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వెళితే ప్రజలు అభివృద్ధి పనులు ఎప్పుడు చేస్తారంటూ? నిలదీస్తున్నారని ఇటీవల డీఆర్సీ సమావేశంలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ బహిరంగంగా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితులే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొనడంతో కూటమి ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లకుండా మొహం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతో ఎమ్మెల్యేలు పర్యటనలకు వెళ్లలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే...ఐదేళ్లు ఇంకెలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment