పేదల బతుకులు బుగ్గిపాలు | - | Sakshi
Sakshi News home page

పేదల బతుకులు బుగ్గిపాలు

Published Sun, Jan 26 2025 7:09 AM | Last Updated on Sun, Jan 26 2025 7:09 AM

పేదల

పేదల బతుకులు బుగ్గిపాలు

కై కలూరు: చిన్న నిర్లక్ష్యంతో క్షణాల్లో జరిగిన పొరపాటు తొమ్మిది కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేసింది. మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులు చెట్ల కిందకు చేరారు. ఇదే ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఆరుగురు కాలిన గాయాలతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మూడేళ్ల బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు.

35 ఏళ్లుగా గుడిసెల్లో.. ఆక్వా చెరువుల్లో చేపలు తినడానికి వచ్చే పక్షులను బెదిరించడానికి నక్కలొళ్లుగా పిలవబడే కొన్ని కుటుంబాలు సుమారు 35 ఏళ్లుగా భైరవపట్నం సమీపంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి వద్ద నాటు తుపాకులు ఉంటాయి. ఉదయం ఆక్వా రైతుల వద్దకు వీరు పనికి తీసుకెళతారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటాపురం చెముడుగంటకు చెందిన తొమ్మిది కుటుంబాలు, సమీపంలో నెల్లూరుకు చెందిన మరో 14 కుటుంబాలు కలిపి మొత్తం 23 కుటుంబాల్లో సుమారు 120 మంది ఇక్కడ జీవిస్తున్నారు. నెల్లూరు ప్రాంతంలో వీరు పూసలు, దండలు విక్రయిస్తారు. షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వీరు ఆక్వా చెరువులపై పక్షులను బెదిరించే పనులకు ఈ ప్రాంతంలో అలవాటు పడ్డారు.

గన్‌ పౌడర్‌ ఉందా ? నక్కల కుటుంబాలు రోజూ చేపల చెరువులపై వాలే పిట్టలను బెదిరించానికి నాటు తుపాకీలు వినియోగిస్తారు. వీటికి లైసెన్సులు ఉండవు. భాస్కరం వంటి ముడి పదార్థాలతో వీరే గన్‌పౌడర్‌ను రహస్యంగా తయారు చేస్తారు. అందరి వద్ద గన్‌పౌడర్‌ నిల్వ ఉన్న కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అగ్నిమాపకశాఖ అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా ఎస్పీ పరిశీలన

మండవల్లి: అగ్నిప్రమాద ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ కె.శివకిషోర్‌, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, కై కలూరు రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.రవికుమార్‌, మండవల్లి ఎస్సై రామచంద్రరావుతో కలిసి శనివారం పరిశీలించారు. ప్రమాద కారణాలను ఫోరెన్సిక్‌ నిపుణులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాణాలను కాపాడండి

అయ్యా.. తీవ్రంగా కాలిన మా బంధువుల ప్రాణాలను ముందు కాపాడండయ్యా. వీరిలో మూడేళ్ల బాబు ఉన్నా డు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటు న్నాం. ఎప్పుడూ ఇటువంటి ప్రమాదం చూ డలేదు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. మా వాళ్లను క్షేమంగా ఇంటికి పంపించండి.

– నక్కల మెటికరాణి, బాధితురాలు, భైరవపట్నం

డబ్బులు కాలిపోయాయి

పైసా.. పైసా కూడబెట్టిన డ బ్బులు కాలిపోయాయి. నా కుటుంబం వీధిన పడింది. సమీపంలో చెట్టు నీడకు చే రాం. అపురూపంగా పెంచుకున్న కోళ్లు కాలిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. మాకు ప్రభుత్వం స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించాలి. దాతలు ఆదుకోవాలి.

– నక్కా రోళి, బాధితుడు, భైరవపట్నం

అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలి

మండవల్లి: భైరవపట్నంలో అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఘటనా స్థలికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గాయపడిన ఆరుగురికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని తహసీల్దార్‌ బి.గోపాల్‌ను కోరారు. నిరాశ్రయులైన తొమ్మిది కుటుంబాలకు తక్షణమే కావాల్సిన మౌలిక అవసరాలను అందజేయాలన్నారు. బాధితులకు అండగా ఉంటానని డీఎన్నార్‌ పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా ఆర్గనైజేషన్‌ కార్యదర్శి జయమంగళ కాసులు, మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి ఏసేబురాజు, సీనియర్‌ నాయకులు కె.వాసురాజు, వి.యేసు, కె.రమేష్‌, ఎస్‌.అంజి, పి.అనిల్‌, ఫిర్దోజ్‌ఖాన్‌ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

చిన్న నిర్లక్ష్యం.. 9 కుటుంబాలకు శాపం

భైరవపట్నం అగ్నిప్రమాద బాధితుల ఆక్రందనలు

సర్వం కోల్పోయిన వైనం

క్షతగాత్రులకు గుంటూరులో చికిత్స

గన్‌పౌడర్‌ కూడా పేలిందనే అనుమానం

No comments yet. Be the first to comment!
Add a comment
పేదల బతుకులు బుగ్గిపాలు 1
1/4

పేదల బతుకులు బుగ్గిపాలు

పేదల బతుకులు బుగ్గిపాలు 2
2/4

పేదల బతుకులు బుగ్గిపాలు

పేదల బతుకులు బుగ్గిపాలు 3
3/4

పేదల బతుకులు బుగ్గిపాలు

పేదల బతుకులు బుగ్గిపాలు 4
4/4

పేదల బతుకులు బుగ్గిపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement