ఒకప్పుడు అబ్బాయిలకే గుత్తాధిపత్యంగా ఉన్న ఫుట్‌బాల్‌ను ఆమె తన చేతిలోకి తీసుకుంది. చదువుతో ΄పాటు క్రీడలనూ సాధన చేయడానికి సిద్ధమైంది. చుట్టుపక్కల వాళ్లు ‘ఆడపిల్లవి, ఇంట్లో గిన్నెలు కడుగుతూ, వంటవండుతూ కూర్చోక మగపిల్లల్లా ఆ ఆటలేంటి?’ అనేవారు. ఎగతాళి మాటలను, వ్యతిరేకతను లెక్కచేయలేదు. ఫుట్‌బాల్‌తో గ్లోబ్‌ను టచ్ చేయడానికి సిద్ధమైంది. ఫలితంగా కేరళ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా, భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఎదిగింది. ‘ఈ ఆటలు నీకెందుకు’ అని గేలిచే సినవారే ఇప్పుడు తమ పిల్లలకు కె.సున లాగా ఎదగాలని మరీ మరీ చెబుతున్నారు. పిల్లల ΄పాఠ్యపుస్తకంలో సునా కథ పాఠమై పిల్లలను ఉత్తేజపరుస్తోంది.
కేరళలోని ఐదవ తరగతి ΄పాఠ్య పుస్తకంలో..
ప్రతిభను చూపిన స్ఫూర్తిమంతమైన సునా కథ ఇలా మొదలవుతుంది.. ‘అంతర్జాతీయఫుట్‌బాల్‌లో పాల్గొనడానికి వెళుతున్న అబ్బాయిలలో టీమ్ కెప్టెన్ ఒకరు ‘‘ఎప్పుడైనా మాలాగా నువ్వు విదేశాలలో ఆడగలవా?’’ అని సునాని ఆటపట్టిస్తారు. అతని తల్లి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపిన సున పట్టుదలను చూపి కొడుకు ప్రవర్తనను సరిదిద్దుతుంది. టీచర్ చెబుతుంటే పిల్లలు సున కథను ఆసక్తిగా వింటుంటారు. ఆ కథకు ‘గర్ల్ అబౌట్ టు ప్లె బాల్ ఇన్ ది ఫిఫ్త్ కైండ్’ అనే టైటిల్‌ను పెట్టారు. ఐదవ తరగతి పాఠ్యపుస్తకంలోని ఈ కంటెంట్ కె.సున ది.
కున్నూర్‌లో పుట్టి పెరిగింది సున. పాఠ్యపుస్తకంలోని సున కథా రచయిత కలవూరు రవికుమార్. సునా, రవి కుమార్ చిన్ననాటి స్నేహితులు కూడా. ‘మొదట్లో స్కూల్, కాలేజీ స్థాయిల్లో సునను ఎగతాళి చేసినవారు. ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై ఆమెకున్న అభిరుచిని, ప్రతిభను అర్థం చేసుకొని జట్టులోకి తీసుకునేందుకు ΄పోటీ పడ్డార’ని రవికుమార్ చెబుతాడు. ఈ చిన్ననాటి జ్ఞాపకాలు కథగా రావడం, అది అందరినీ ఆకట్టుకోవడంతో రవికుమార్ ఈ రచన కూడా అందుకుంది.
మాజీ ఫుట్‌బాల్ స్టార్ ఎమ్‌ఆర్‌సి కృష్ణన్ వద్ద శిక్షణ ΄పోందిన సున 2022లో యాక్టివ్ ఫుట్‌బాల్ నుండి రిటైరైంది. తర్వాత, ఆమె ఓ ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ ఫోర్‌మెన్‌గా వర్క్ చేసి రిటైరైంది. అక్కడా అవార్డులు గెలుచుకుంది. వర్క్ ప్లేస్ నుంచి కూడా జాతీయ స్థాయిలో ΄ాల్గొన్న ఒక టోర్నమెంట్‌లో 21 గోల్స్ చేసింది.
ఐదో తరగతిలో పిల్లలు తమ ΄ాఠ్యపుస్తకంలోని పాఠాన్ని ఇలా చదువుతున్నారు.. ‘స్కూల్లో అబ్బాయిల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ల మధ్యకు వెళ్లి సున బాల్ కొట్టేది. దీంతో అబ్బాయిలు వెళ్లి ఈ విషయాన్ని టీచర్లకు కంప్లైంట్ చేసేవారు..’ఎగతాళి రోజులను తట్టుకొని, పట్టుదలతో శ్రమించి, సాధించిన ఘనతను రేపటి తరం పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తూ తనదైన ముద్రవేసేంతగా ఎదగడం ఎంతటి గొప్ప మార్పు. ‘హ్యాట్సాఫ్ సున’ అంటున్నారంతా.
Comments
Please login to add a commentAdd a comment