తల్లులను మోసగించిన కూటమి ప్రభుత్వం
లక్ష్మీపురం: తల్లికి వందనం అమలు చేయకుండా కూట మి ప్రభుత్వం విద్యార్థుల మాతృమూర్తులను మోసగించిందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారని, ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్ప డం తగదన్నారు. 85 లక్షల మంది తల్లులను మోసం చేసిందని ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. తల్లికి వందనం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని, ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం నుంచి ఏఐఎస్‌ఎఫ్ గుంటూరు జిల్లా విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెండింగ్‌లో ఉన్న రూ.3,580 కోట్ల బకాయిలు విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో లక్షలమంది తల్లులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు డేవిడ్, అమర్నాథ్, నాయకులు అజయ్, ప్రసన్న, దిలీప్, పవన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బందెల నాసర్ జీ
Comments
Please login to add a commentAdd a comment