బంజారాహిల్స్: ఇంకా వివాహం కావడం లేదని, వ్యసనాలకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఫిలింనగర్‌లోని ఎంజీనగర్‌లో నివసించే గోవర్దన్ చారి(32) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
బుధవారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారని పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన గోవర్దన్ చారి గత కొంత కాలంగా బస్తీలో ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment