ఆమని, రోజారమణిలకు పురస్కారాలను అందజేస్తున్న బండారు సుబ్బారావు తదితరులు
గన్‌ఫౌండ్రీ: అందాల నటుడు శోభన్‌బాబు సినీ ప్రేక్షకుల గుండెలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సీల్‌వెల్ కార్పొరేషన్ సీఎండీ బండారు సుబ్బారావు అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో శోభన్‌బాబు 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులు ఆమని, రోజారమణిలకు పురస్కారాలను ప్రదానం చేశారు. అంతకు ముందు గాయనీ గాయకులు ఆలపించిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.దామోదర్‌గుప్తా, కళాపత్రిక సంపాదకులు మహ్మద్ రఫి, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఆమని తదితరులు పాల్గొన్నారు.
డీసీఎం ఢీకొని ఒకరి మృతి
పోచారం: డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రాజు తెలిపిన మేరకు.. వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీ వైపు వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. కాళ్లు, చేతులకు తీవ్రంగా గాయాలు తగిలాయి. స్థానికుల సమీపంలోని నీలిమ ఆసుపత్రికి తీసుళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment