ఆయన అసాధారణ నేత: ట్రంప్
వాషింగ్టన్/న్యూయార్క్: మూడ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ అమెరికాకు వచి్చనపుడు ఆయనను కలుస్తానని అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్ గోల్ఫ్‌క్లబ్‌లో ఆగంతకుడు తనను చంపేందుకు విఫలయత్నంచేశాక ట్రంప్ తొలిసారిగా ఎన్నికల ప్రచారకార్యక్రమంలో పాల్గొన్నారు.
బుధవారం మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలోని టౌన్‌హాల్‌లో రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘అమెరికా దిగుమతుల విషయంలో అధిక సుంకాలు విధిస్తూ భారత్ భిన్నంగా వ్యవహరిస్తోంది. అయినాసరే వారి నేత, ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచి్చనపుడు ఆయనను కలుస్తా. ఆయన అసాధారణ వ్యక్తి’’అని అన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించలేదు.
కాబోయే అధ్యక్షులనే కాల్చుతున్నారెందుకో..
తనపై జరిగిన దాడి యత్నాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ‘‘వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ప్రచారంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అయితే కార్ రేసింగ్‌లో బుల్ రైడింగ్‌లో పాల్గొనడం ఎంత ప్రమాదకరమో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం కూడా అంతే ప్రమాదకరం. అసలు కాబోయే అధ్యక్షులను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారో అర్థంకావట్లేదు’’అని ట్రంప్ అన్నారు. కాల్పుల యత్నం తర్వాత కమల తనకు ఫోన్ చేశారని ట్రంప్ వెల్లడించారు. ‘‘ఆమె అలా ఫోన్ చేయడం చాలా బాగుంది. ఇలాంటి పద్ధతిని మనం ఖచి్చతంగా అభినందించాల్సిందే’అని అన్నారు. అమెరికాలో హింసకు తావులేదు అని ట్రంప్‌కు ఫోన్‌చేసిన సందర్భంగా చెప్పానని కమల హారిస్ వెల్లడించడం తెల్సిందే.
పరస్పర ఆరోపణలు
ట్రంప్‌పై యత్యాయత్నాలకు మీరంటే మరే కారణమని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తాను అధ్యక్షుడినైతే డెమొక్రాట్లపై కేసులు బనాయించి, జైల్లో పడేస్తానని, శరణార్థులను బలవంతంగా దేశం నుంచి బహిష్కరించి పంపించేస్తానని ట్రంప్ చేస్తున్న ప్రకటనలే ఆయన ప్రాణాల మీదకు తెచ్చాయని డెమొక్రాట్లు ఆరోపించారు. డెమొక్రాట్ల ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై విద్వేష వ్యాఖ్యలు చేయడం వల్లే ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment