భూపాలపల్లి అర్బన్/కాటారం: జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ విద్యాలయాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కాటారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. భూపాలపల్లి పరీక్షా కేంద్రంలో 240 మంది విద్యార్థులకు గాను 167 మంది, కాటారం పరీక్షా కేంద్రంలో 115మంది విద్యార్థులకు గాను 92మంది హాజరైనట్లు తెలిపారు. డీఈఓ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌లు ఉమారాణి, లక్ష్మీప్రసన్న, సీఎల్‌ఓలు షకీల్ అహ్మద్, రమేశ్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment