అవినీతిపై అక్షర పోరాటం
జోగుళాంబ గద్వాల
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ తనవంతు కృషి
జనవరి 24
సెప్టెంబర్–03
సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
వివరాలు 8లో u
● అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం
● అపన్నులకు అండగా కథనాలు..
● ప్రజాప్రతినిధులు, అధికారుల స్పందనతో సమస్యల పరిష్కారం
గద్వాల: అవినీతి అక్రమాలపై అక్షరాలనే ఆయుధంగా చేసుకుని ‘సాక్షి’ అలుపెరగని పోరాటం చేస్తుంది. ప్రధానంగా గద్వాలలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కొందురు అక్రమార్కులు కబ్జా చేస్తుండగా వీటిిపై వరుస కథనాలు ప్రచురించి విముక్తి కల్పించింది. అదేవిధంగా కల్తీకల్లుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్లుమాఫియా, అవినీతి అధికారుల బాగోతంపై కదం తొక్కుతూ ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి కల్లుమాఫియా వెన్నులో వణుకు పుట్టించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యం అందించకుండా కొందరు ప్రభుత్వ వైద్యాధికారుల తీరుపై కథనాలు ప్రచురించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల స్పందనతో పరిష్కారానికి కృషి చేిసింది. అదేవిధంగా రాష్ట్రంలోనే దివి గ్రామంగా పేరుగాంచిన గుర్రంగడ్డ వాసుల సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చి వాటిపై కలెక్టర్ స్పందించేలా చేసి సమస్యల పరిష్కారానికి కృషిచేసింది. అధికారంలో ఉన్న కొందరు బడాబాబులు అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇసుక, మట్టి దందాలు చేస్తున్న వైనంపై వరుస కథనాలతో కట్టడి వేసింది. రేషన్ బియ్యం దందా, సీఎమ్మార్ రైస్‌లో జరుగుతున్న అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ.. అధికారులు వాటికి అడ్డుకట్ట వేసేలా జాగృతపర్చింది. ప్రజాసమస్యలను నిత్యం వార్తల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది. ఈ ఏడాది కబ్జాకు గురైన విలువైన ప్రభుత్వ స్థలాలు, అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందనతో బాధితుల సమస్యల పరిష్కారంతో పాటు, గద్వాల జిల్లా కేంద్రంలో కబ్జాకు గురైన కోట్ల విలువైన స్థలాలు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాలలో మౌళిక వసతులు సమకూర్చేందుకు దన్నుగా నిలిచింది. 2024లో కొన్ని ప్రజాసమస్యలు, భూకబ్జాలకు సంబంధించిన పరిష్కారానికి సంబంధించిన అద్దం పట్టే ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
రాష్ట్రంలోనే దీవి గ్రామమైన గుర్రంగడ్డ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కలెక్టర్ బీఎం సంతోష్ స్పందించారు. ఎస్పీ శ్రీనివాస్‌రావు వివిధశాఖలకు చెందిన అధికారులతో కలిసి కలెక్టర్ బోటులో ప్రయాణం చేసి గుర్రంగడ్డ గ్రామాన్ని సందర్శించారు. గ్రామం మొత్తం కలియతిరిగారు. నేరుగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అవరసమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కరించారు. దీనిపై గ్రామస్తులు ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞ తలు తెలియజేశారు.
¢ జిల్లా ఆస్పత్రిలో అత్యవసర సేవలు అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ప్రసవ సమయంలోనూ గర్భిణులను పట్టించుకోకపోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించగా.. రోగులు ఆందోళనకు దిగారు. ఈక్రమంలో వైద్యం అందక రోగులు, గర్భిణులు పడే ఇబ్బందులు, వారి బంధువుల ఆవేదనపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. వైద్యులు సకాలంలో హాజరుకాకపోవడం, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై పతాక శీర్షికల్లో కథనాలు రావడంతో సీనియర్ సివిల్ జడ్జి కవిత స్పందించి ఆస్పత్రిని తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది తీరు మార్చుకోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్యుల తీరుపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని అప్పట్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ నవీన్‌క్రాంతిని ఆదేశించారు.
జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణం నడిబొడ్డులో సుమారు రూ.2కోట్లు విలువైన స్థలాన్ని కొందరు అక్రమార్కులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకొన్నారు.ఇందులో మాజీ మున్సిపల్ నేత కీలకపాత్ర పోషించారు. కబ్జా చేయడంతోపాటు అక్రమంగా చేపట్టిన నిర్మాణంపై ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని జేసీబీలతో తొలగించారు.
జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్లు తనిఖీ చేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి కవిత
మే 17
న్యూస్‌రీల్
గద్వాల పట్టణంలోని బీరెల్లి చౌరస్తా, కుంటవీధిలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు సైతం చేపట్టారు. ఈ అంశాలను ‘సాక్షి’ ప్రత్యేక కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన అధికారులు సదరు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయడంతోపాటు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment