ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్
ధరూరు: ఏడాది కాలంగా మండలంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబందించి నిర్వహించిన సోషల్ ఆడిట్‌లో రూ.2.40లక్షల రికవరీకి అధికారులు ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ మంజుల అధ్యక్షతన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు జరిగింది. మొత్తం 14 రౌండ్లలో సోషల్ ఆడిట్ అధికారులు గ్రామాల వారీగా తమ నివేదికలను చదివి వినిపించారు. అదే విధంగా జరిగిన అవినీతిని గ్రామాల వారిగా చదివి వినిపించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి అడిషనల్ కలెక్టర్, డీఆర్‌డీఓ నర్సింగ్‌రావు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఏడాది పాటు మండలంలో రూ.6.65 కోట్ల పనులు జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో రూ.2.40లక్షలను ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీల నుంచి ఫైన్‌లు మరియు, రికవరీల ద్వారా తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో సోషల్ ఆడిట్ ఎస్‌ఆర్‌పీ బద్రునాయక్, ఎంపీఓ శరత్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు.
రూ.2.40 లక్షల రికవరీకి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment