అదైర్యపడొద్దు.. అండగా ఉంటాం
అలంపూర్: మాజీ ఎంపీ మందా జగన్నాథం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఆయనను పరామర్శించారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీని మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చేరగా.. సమాచారం తెలుసుకున్న కేటీఆర్ ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment