సొమ్మును కాజేసే క్రమంలో సైబర్ నేరస్తులు తన లేదా తన వారికి సంబంధించిన ఖాతాలకు నగదును బదిలీ చేస్తారు. అక్కడి నుంచి మరిన్ని ఖాతాలకు మళ్లించి.. అనంతరం ఏటీఎంల ద్వారా డ్రా చేస్తారు. ఈ మేరకు సైబర్ మోసానికి గురై సొమ్ము పోగొట్టుకున్న తొలిగంట (గోల్డెన్ అవర్) లోపు ఫిర్యాదు చేస్తే.. ఆ సొమ్మును వెంటనే రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాధితుడి ఖాతా నుంచి నగదు (తొలిసారి) ఎక్కడికి బదిలీ అయిందో గుర్తించి.. అక్కడి నుంచి మరో ఖాతాకు బదిలీ కాకుండా నిలిపివేయవచ్చు. ఆ సొమ్మును రాబట్టుకుని న్యాయప్రక్రియ ద్వారా తిరిగి బాధితులకు అప్పగించొచ్చు.
– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్
1930 లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలి..
సైబర్ నేరాలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సైబర్ మోసానికి గురైనట్లు తెలిసిన వెంటనే 1930 లేదా డయల్ 100కు ఫోన్‌చేస్తే నిందితుల ఖాతాలను స్తంభింపజేయవచ్చు. తద్వారా కోల్పోయిన సొమ్ము రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో కొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లు, మెసేజ్‌లకు స్పందించొద్దు. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్‌కర్నూల్
●
Comments
Please login to add a commentAdd a comment