హేమంత్ కుమార్ (ఫైల్)
తుమకూరు: క్రీడా పోటీలు చూడటానికి వెళ్లిన విద్యార్థి చెరువులో శవమై తేలాడు. ఈఘటన చిక్కనాయకనహళ్లి తాలూకా హులియూరులో జరిగింది. గోపాలపుర గ్రామానికి చెందిన హేమంత్ కుమార్(15) హులియూరులోని కనకదాస పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. క్రీడా పోటీల కోసం ఈనెల 24న జేసీబీ ఆపరేటర్ చేతన్ వెంట బైకులో వెళ్లాడు. విద్యార్థి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఉపాధ్యాయులను ఆరా తీయగా వస్తాడులే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అయితే శనివారం సాయంత్రం హుళియూరులోని చెరువులో హేమంత్‌కుమార్ విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment