కర్ణాటక: మాజీ ప్రియురాలి వేధింపులను తట్టుకోలేక టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తినగరలో జరిగింది. అతని సోదరుని ఫిర్యాదు మేరకు ప్రస్తుత ప్రేయసి, మాజీ ప్రియురాలిపై రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ప్రముఖ కంపెనీలో బీపీఓ విభాగంలో పని చేస్తున్న సంతోష్, అదే కంపెనీలో పని చేసే యువతిని ప్రేమించాడు.
వీరిద్దరూ నాలుగేళ్లుగా షికార్లకు కూడా వెళ్లారు, అయితే కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత సంతోష్ అదే కంపెనీలో మరో యువతితో ప్రేమలో పడ్డాడు. కొత్త ప్రియురాలితో సంతోష్ సరదాగా తిరగడం చూసి పాత ప్రియురాలు సహించలేకపోయింది. ఇతర ఉద్యోగుల ముందే సంతోష్‌తో పాత ప్రియురాలి ఘర్షణ పడి కొట్టింది. అంతేకాకుండా తనతో ప్రేమలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించింది. ఇదంతా చూసి కంపెనీ ఆమెను వేరే చోటికి బదిలీ చేసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
నీ కొత్త ప్రియురాలితో కలసి నన్ను బదిలీ చేయించావ్ కదా అని సంతోష్‌ను ఫోన్‌లో వేధించసాగింది. ఈ రగడపై కొత్త ప్రియురాలు కూడా సంతోష్‌ను గట్టిగా ప్రశ్నించింది. ఈ పరిణామాలతో విరక్తి చెందిన సంతోష్ 3వ తేదీన ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు, అయితే పరిస్థితి విషమించి మరణించాడు. ఆత్మహత్యకు ఆ ఇద్దరు యువతులే కారణమని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment