బెంగళూరులో ఓ కోవిడ్ ఫీల్డ్ ఆస్పత్రిలో ఏర్పాట్లు
బీటెక్ విద్యార్థికి కోవిడ్
దొడ్డబళ్లాపురం: చాలా నెలల తరువాత రాష్ట్రంలో... రామనగర జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదయింది. ర్యాండమ్ టెస్టులో ఇంజినీరింగ్ విద్యార్థికి కోవిడ్ సోకినట్టు తేలింది. రామనగర జిల్లా బిడది క్లస్టర్ పరిధిలోని భైరమంగల గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి జలుబు, జ్వరం తదితరాలతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో రోగిని 2 రోజులు ప్రత్యేకంగా ఉంచినట్టు రామనగర జిల్లా ఆరోగ్యాధికారి కాంతరాజు తెలిపారు. యువకునితో కాంటాక్టు కలిగిన వారి కోసం గాలింపు చేపట్టారు.
శివాజీనగర: క్రిస్మస్ పండుగ, కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరించటాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. విమానాశ్రయాలలో నిఘా వహించటం, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించటంతో పాటుగా పలు సూచనలు చేసింది. పొరుగునున్న కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరగడంతో సర్కారు ఆందోళన చెందుతోంది. కోవిడ్ రాష్ట్ర సాంకేతిక సలహా కమిటీ ఈ నియమాలను రూపొందించింది. కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను హెచ్చరించింది.
రోగ పీడితులపై దృష్టి
కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మైసూరు, చామరాజనగర, కొడకు, దక్షిణ కన్నడ జిల్లాల్లో అధికంగా ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, వైద్య విద్యా కాలేజీ ఆసుపత్రుల్లో అన్ని సారి కేసులు, 20 ఐఎల్‌ఐ కేసుల్లో 1 ఐఎల్‌ఐ కేసులను కరోనా పరీక్షలు చేయించాలి. తీవ్ర రోగ లక్షణాలను కలిగినవారు, ఆసుపత్రిలో అడ్మిట్ అయినవారు, తీవ్ర శ్వాసకోశ జబ్బుల (ఎస్‌ఏఆర్‌ఐ– సారి) కేసులు, దగ్గు– జలుబు– జ్వరం సమస్యలు, కోవిడ్‌కు రెండు సార్లు గురైనవారు, టీకా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకొన్న తరువాత కూడా కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినవారు తదితరులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల జారీ
Comments
Please login to add a commentAdd a comment