కర్ణాటక: తనను ప్రముఖ క్రికెటర్ కేసీ కరియప్ప ప్రేమించి వివాహం చేసుకుంటానని శారీరకంగా లోబరచుకుని, గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, అతడు డ్రగ్స్, గంజాయి తీసుకుంటాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలికి ఆర్టీ నగర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. జరిగిన సంఘటనలకు సంబంధించి ఉన్న సాక్ష్యాధారాలతో పూర్తి స్టేట్‌మెంట్ ఇవ్వాలని పోలీసులు ఆమెను నోటీసులో కోరారు. ఆమె వాంగ్మూలం రికార్డు చేసుకున్నాక కరియప్పకు నోటీసులు ఇవ్వాలని ఆర్టీ నగర పోలీసులు భావిస్తున్నారు.
వేధిస్తోంది: కరియప్ప
మరోవైపు కరియప్ప కూడా తన ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఏడాదిన్నర క్రితం పరిచయమైన మహిళ తనతో పలు ప్రాంతాలకు వచ్చిందని, అయితే ఆమె పూర్తిగా మద్యానికి బానిసగా మారిందని, ప్రవర్తన కూడా మంచిదికాదని, అందువల్ల ఆమెను దూరంగా ఉంచానని, ఇప్పుడు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, తన భవిష్యత్తు పాడుచేయాలని వేధిస్తోందని ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment