మైసూరు: అగ్నిసాక్షిగా కట్టుకున్న భర్త తనను కాదని మరో యువతితో జల్సా చేస్తుండగా అది భార్యకు తెలిసింది. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని వెళ్లిన భార్యను భర్త కారు ఢీకొట్టి పరారయ్యాడు. మైసూరులోని విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. కేసీ లేఔట్‌కు చెందిన మహిళకు స్థానికుడు సుదీప్ అనే వ్యక్తితో పెళ్లయింది.
మూడేళ్ల నుంచి సుదీప్ మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగి జయలక్ష్మీ పురం, మహిళా పీఎస్‌లో భార్య కేసులు కూడా పెట్టింది. అయినా కూడా ఆ భర్తలో ఏమాత్రం మార్పు రాలేదు. విజయనగరలోని 3వ స్టేజ్‌లో ఉన్న ఒక ఇంటిలో భర్త, ప్రియురాలితో కలిసి ఉన్నట్లు తెలిసి భార్య అక్కడికి వెళ్లి వీడియో తీయాలనుకుంది. ఇంతలో భర్త ప్రియురాలిని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి ఉడాయిస్తూ అడ్డువచ్చిన భార్యను ఢీకొని వెళ్లిపోయాడు. గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment