బాధిత కుటుంబ సభ్యులు
యశవంతపుర: ముప్పై ఏళ్ల నుంచి బహిష్కార శిక్షను అనుభవిస్తున్న ముస్లిం కుటుంబం న్యాయం కోసం మొరపెట్టుకుంది. ఈ సంఘటన కాఫీనాడు కొడగు జిల్లాలో జరిగింది. వివరాలు.. విరాజపేట తాలూకా బేటోళి గ్రామానికి చెందిన రఫీక్ అనే వ్యక్తి 30 ఏళ్ల క్రితం కేరళకు చెందిన మహిళను వివాహం చేసుకుని తీసుకొచ్చారు. గ్రామంలోని మసీదులో మహిళలు ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు, దీంతో వారు విరాజపేట పట్టణంలోని మసీదుకు వెళ్లి ప్రార్థన చేసేవారు.
దీంతో స్థానిక మత పెద్దలు రఫీక్ కుటుంబాన్ని బహిష్కారం చేశారు. ఊరిలోని ముస్లింలు ఎవరూ వారితో మాట్లాడరాదు, ఆటోలో ఎక్కించుకోరాదని ఆదేశించారు. కట్టు తప్పితే రూ. ఐదు వేల జరిమానా వేస్తామని చాటింపు వేశారు. అప్పటినుంచి వెలి మధ్యనే జీవిస్తున్నారు. ఈ బాధతోనే కుటుంబం పెద్ద రఫీక్ గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహం అప్పగింతపై కూడా గొడవ జరిగింది. ఇప్పటికై నా బహిష్కారం తొలగించాలని బాధిత కుటుంబం మీడియా ముందు డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment