ఎలుకల మందు స్ప్రే.. 19 మంది ఆస్పత్రిపాలు
యశవంతపుర: హాస్టల్‌లో ఎలుకల మందు చల్లిన తరువాత భోజనం చేయడంతో 19 మంది అస్వస్థతకు గురైన ఘటన బెంగళూరు జ్ణానభారతి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ప్రైవేట్ కాలేజీ నర్సింగ్ విద్యార్థినీ విద్యార్థులు ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కింద ఫ్లోర్‌లో కరెంటు తీగలను ఎలుకలు కొరికేయడంతో యజమాని ఎలుకల మందును స్ప్రే చేయించారు.
ఆపై విద్యార్థులు భోజనం చేసి నిద్రపోయారు వెంటనే 19 మందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. బాధితులు ఆర్తనాదాలు చేయడంతో హాస్టల్ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. స్ప్రే ప్రభావమే కారణమని భావిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment