యువత సన్మార్గంలో సాగాలి
శివాజీనగర: సమస్త మానవాళిని పాపకూపం నుంచి విముక్తులను చేసిన ఏసుక్రీస్తును స్మరిస్తూ బెంగళూరు నగరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరమంటుతున్నాయి. చర్చిలలో సామూహిక ప్రార్థనలు మార్మోగుతున్నాయి. చర్చిలలో క్రీస్తు పుట్టుక నాటికలను ప్రదర్శన, క్రైస్తవ భక్తిగీతాల ఆలాపన సంబరాలను నిర్వహిస్తున్నారు. నగరంలో తొలి తెలుగు క్రైస్తవ సంఘమైన మిస్పా తెలుగు చర్చిలో ప్రతి ఆదివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు భక్తులను అలరిస్తున్నాయి. ఇప్పటివరకు మహిళా క్రిస్మస్, పిల్లల క్రిస్మస్ జరిగాయి, ఈ ఆదివారం యూత్ క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహించారు. యువతీ యువకులు శ్రావ్యంగా భక్తి గీతాలు ఆలపించారు. నాటికలు, కోలాట పాటలు, నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. పాస్టర్ రెవరెండ్ బెరాకా హ్యాండీ దైవ సందేశాన్ని వినిపించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సన్మార్గంలో నడిపించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వారిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు దైవ వాక్యం చదివించడం, ప్రార్థనలు చేయించటంతో పాటుగా ఉత్తమ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ సంఘ పెద్దలను సన్మానించారు.
మిస్పా చర్చిలో యూత్ క్రిస్మస్
Comments
Please login to add a commentAdd a comment