సర్కారు భూమి కబ్జా
మైసూరు: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను అధికారులు అడ్డుకున్నారు. తాలూకాలోని కసబా ఫిర్కా హెబ్బాళు గ్రామ సర్వే నంబర్–221లోని 1.25 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందిన ఆస్తి. ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేసి అక్రమంగా భవనం నిర్మిస్తున్నారు. జిల్లాధికారి లక్ష్మీకాంతరెడ్డి ఆదేశాల తహసీల్దార్ మహేష్ కుమార్ దాఖలాలను పరిశీలించారు. పోలీసుల సహకారంతో పనులను ఆపివేయించారు. ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డును పెట్టారు. త్వరలోనే అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయిస్తామని తహసీల్దార్ తెలిపారు.
సర్కారీ ఆస్పత్రుల్లో అధ్వానం
● మహిళా కమిషన్ నివేదిక
బనశంకరి: గత ఏడాది నుంచి బళ్లారి, బెళగావి, రాయచూరు తో పాటు ఇతర జిల్లాల్లో వరుసగా బాలింతలు మృతులు సంభవిస్తున్నాయి. బాలింతలు మృతులపై రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీచౌదరి శనివారం సీఎం సిద్దరామయ్య కు నివేదిక అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని తీవ్ర సమస్యలను బహిర్గతం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పౌష్టికాహార కొరత, వైద్య సౌలభ్యాల కొరత ఉందని నివేదికలో తెలిపారు. ఎమర్జెన్సీ వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు. నీటి ట్యాంకర్లు పాచికట్టడంతో నీరు కలుషితమైంది. అదే నీరు ప్రసూతి వార్డులకు సరఫరా అవుతోంది. ఆ నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉండటంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. నీటి ట్యాంకులను నిత్యం శుభ్రపరచడం, నీటిని శుభ్రం చేయాలని తెలిపారు.
ఈడీ అంటూ
బీడీ వ్యాపారికి టోపీ
దొడ్డబళ్లాపురం: ఈడీ లేదు, బీడీ లేదు అని కొంతమంది నాయకులు సవాల్ చేస్తుంటారు. ఈ డైలాగు కొందరు మోసగాళ్లలో దోపిడీ యోచనకు బీజం వేసినట్లుగా ఉంది. ఈడీ పేరు చెప్పి దుండగులు రూ. 30 లక్షలు దోచిన సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. నగరంలో సులేమాన్ హాజి అనే వ్యాపారవేత్త అనేక సంవత్సరాలుగా బీడీ కంపెనీ నడుపుతున్నారు. ఇతడి గురించి పూర్తి వివరాలు సేకరించిన దుండగులు శుక్రవారం రాత్రి ఈడీ అధికారులమంటూ ఆయన ఇంటికి వచ్చారు. సోదాలు చేస్తున్నట్లు నటించారు. ఇంట్లో ఉన్న రూ.30 లక్షల నగదును సీజ్ పేరుతో తీసుకెళ్లారు. కొంతసేపటికి తేరుకున్న సులేమాన్ మోసగాళ్ల పని అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆర్టీసీ కొత్త చార్జీలు !
శివాజీనగర: కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలను ప్రభుత్వం 15 శాతం పెంచడం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి నుంచే టికెట్ ధర పెరిగినట్లు తెలిసింది. కేఎస్ ఆర్‌టీసీ, కేకే ఆర్‌టీసీ, ఎన్‌డబ్ల్యూకే ఆర్‌టీసీ, బీఎంటీసీతో పాటుగా అన్ని నాలుగు రవానా కార్పొరేషన్‌లు పెంపుతో టికెట్లను సవరించాయి. ఆ మేరకు టికెట్ యంత్రాల్లో మార్పులు చేశారు. ఇందుకోసం ప్రతి డిపోలో సాంకేతిక సిబ్బంది బిజీగా ఉన్నారు. చిల్లర సమస్యతో పాటుగా కొన్ని సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు.
డ్రగ్స్ విక్రేత అరెస్టు
దొడ్డబళ్లాపురం: ఉడుపి జిల్లాలో ఓ డ్రగ్స్ విక్రేతను పోలీసులు అరెస్టు చేసి రూ.3.25 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రహ్మావర పట్టణ ఉప్పూరు నివాసి నాగరాజు (25) అరైస్టెన నిందితుడు. నిందితుని నుంచి ఎండీఎంఏ, చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు. శివళ్లి గ్రామం వద్ద బైక్‌పై డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఉడుపి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment