ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో ముంపు ఎదురుకాకుండా మున్నేటికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్ పనులను శనివారం వరంగల్ నిట్ ప్రొఫె సర్లు పరిశీలించనున్నారు. నిట్ ప్రొఫెసర్ రమణ మూర్తి నేతృత్వాన బృందం పనులను పరిశీలి స్తుందని అధికారులు తెలిపారు. రూ.690 కోట్ల అంచనా వ్యయంతో మున్నేటికి ఇరువైపులా 17 కి.మీ.మేర రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ సందర్భంగా నా ణ్యతను పరీక్షించి సలహాలిస్తారని వెల్లడించారు.
సొరంగ మార్గం పనులు..
సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజీ–16 ద్వారా జిల్లాలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనులను శనివారం సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్ట్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment