రేపటి నుంచి ‘ఆపరేషన్ స్మైల్’
ఆసిఫాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమారాజేశ్వరి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డీఐజీ మాట్లాడుతూ ప్రతీ డివిజన్‌లో పోలీస్, పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, కార్మిక, విద్య, ఆరోగ్య, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్జీవో సంస్థల నుంచి సభ్యులు ఉండేలా రెండు టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, బాలకార్మికుల సమస్యలు పరిష్కరించడం, అక్రమ రవాణాకు గురైన వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, చట్టపరమైన హక్కులు, రక్షణ కల్పిస్తామని వివరించారు. పోలీసు విభాగం, ఇతర విభాగాలు బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, ఇతర ప్రదేశాలను సందర్శించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment