ఇష్ట దేవతలకు స్వచ్ఛమైన పూజలు
● నేడు ఓంరాజ్ వంగెపురి భీమయ్యక్‌కు పూజలు ● రేపు రాజుల్ దేవునికి కూడా.. ● హాజరుకానున్న కొలాం ఆదివాసీలు
గతంలో మూడేళ్లకోసారి..
గతంలో మూడేళ్లకోసారి ఈ ఉత్సవాలను నిర్వహించే వాళ్లం. రెండేళ్ల క్రితం ఏటా నిర్వహించాలని నిర్ణయించాం. మూడేళ్లకోసారి అగ్ని గుండంలో నడిచే కార్యక్రమం ఉంటుంది.
– సిడాం భీంరావు, గ్రామ పెద్ద
కోరికలు తీర్చే దేవతలు
మూడ్రోజులపాటు పా ట్నాపూర్ సమీపంలోని ఆలయంలో నిర్వహించే షష్టి పూజలకు కొలాం ఆదిమ గిరిజనులు వస్తారు. వంగెపురి భీమయ్యక్, రాజుల్ దేవతలు కోరికలు తీర్చుతారు.
– ఆత్రం భీంరావు, గ్రామస్తుడు
కెరమెరి: అడవితో పాటు సూర్యచంద్రులు, నీరు, నిప్పును పూజించే స్వభావం కొలాం ఆదివాసీలది. వీరు భీము దేవున్ని కొలుస్తారు. తమ సంస్కృతిని కాపాడుతున్న కొలాం ఆదివాసీలు నేడు, రేపు ఇష్ట దేవతలకు మొక్కు తీర్చుకోనున్నారు. మండలంలోని జోడేఘట్ పంచాయతీ పరిధి పాట్నాపూర్ గ్రామంలో కొలువైన ఓంరాజ్ వంగెపురి భీమయ్యక్ స్వామి, రాజుల్ దేవతలకు మూడురోజులు ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఆ గ్రామంలో కొలు వై ఉన్న ఈ దేవతలను ఒక్కరోజు ముందే గ్రామంలోకి తీసుకువచ్చారు. సమీప గ్రామాలతోపాటు ఇంద్రవెల్లి ఉట్నూర్, ఆదిలాబాద్, కెరమెరి, వాంకిడి, దండేపల్లి, లింగాపూర్, సిర్పూర్(యు)(టి), ఇచ్చోడ మండలాల్లోని అనేక గ్రామాలతో పాటు మహారాష్ట్రకు చెందిన వందలాది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు.
నేటి నుంచి ప్రత్యేక పూజలు
గురువారం నుంచి నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఇష్ట దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే కొత్త కోడళ్ల బేటింగ్ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. వంగెపురి భీమయ్య క్, రాజుల్ దేవతలకు సమష్టిగా పూజల చేస్తారు. అనంతరం పెద్దల ఆశీర్వాదం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment