ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.పి.రావు
విజయవాడస్పోర్ట్స్: నకిలీ క్రీడా సర్టిఫికెట్లను నిలువరించడానికి ఏర్పాటుచేసిన క్రీడా యాప్‌లో సవరణలు చేయాల్సి ఉందని ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.పి.రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం క్రీడా సంఘాలు క్రీడాకారుల పేర్లను నమోదు చేసుకుని పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్‌లు ఇస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లోనూ ఇదే తరహాలో పేర్లు నమోదు మాత్రమే చేస్తారని, ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. 40 ఏళ్లుగా క్రీడా సంఘాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూస్తున్నానని, గతంలో మాన్యువల్‌గా జరిగే అక్రమాలు.., ఇకపై యాప్‌లో స్మార్ట్‌గా జరుతాయన్నారు. స్పోర్ట్స్ కోడ్‌ను సమర్థంగా అమలు చేస్తే అక్రమాలు జరిగే అవకాశం ఉండదని, సర్టిఫికెట్‌ల దందాకు కొంత వరకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందన్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
యలమర్రు(పెదపారుపూడి): విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన యలమర్రులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యలమర్రులో ఉన్న శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో ముఖమండపం మరమ్మతుల కోసం ఊయ్యూరు మండలం కడవకొల్లు గ్రామానికి చెందిన దేవబత్తుల నాగభూషణం(45) తాపీ పనుల నిమిత్తం గోడ పగలకొట్టే మిషన్‌తో పనులు చేస్తున్నాడు. అతని షాక్ తగిలి ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment