తిరువూరు: తిరువూరు ప్రాంతంలో పోలీసు కానిస్టేబుల్‌గా, ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడిన వ్యక్తికి తిరువూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం 6 నెలల జైలుశిక్ష విధించింది. తిరువూరు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం వత్సవాయి మండలం కంభంపాడుకు చెందిన మాజీ హోంగార్డు బండి రామకృష్ణ పోలీసు కానిస్టేబుల్‌నని చెబుతున్నాడు. గ్రామాల్లో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. చింతలపాడు గ్రామస్తుల ఫిర్యాదుతో రామకృష్ణను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం పైవిధంగా జడ్జి తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment