డీఆర్‌ఎం కప్ విజేత ఎలక్ట్రికల్ ఆపరేషన్ జట్టు
ట్రోఫీ అందజేసిన డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో 8వ డీఆర్‌ఎం కప్ ఇంటర్ డిపార్ట్‌మెంట్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 12 నుంచి 20 వరకు రైల్వే స్టేడియంలో జరిగింది. ఇరవై ఓవర్ల ఫార్మెట్ లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో ఎలక్ట్రికల్ ఆపరేషన్ జట్టు, రాయనపాడు వ్యాగన్ వర్కషాపు జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఎలక్ట్రికల్ విభాగం తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. రాయనపాడు వ్యాగన్ వర్కుషాపు జట్టు 170 పరుగులు చేసి పది పరుగుల తేడాతో ఓటమి చెంది రన్నర్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ముగింపు వేడుకల్లో డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ పాల్గొని విజేత జట్టు కెప్టెన్, సీనియర్ ఏఎల్‌పీ కె.సాగర్‌కు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ డీఎస్‌సీ, డివిజన్ స్పోర్ట్స్ ఆఫీసర్ వల్లేశ్వర బి.టి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
జాతీయ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారుల సత్తా
విజయవాడస్పోర్ట్స్: జాతీయ స్కేటింగ్ పోటీల్లో ఏపీ క్రీడాకారులు సత్తా చాటారు. బెంగళూరు, మైసూరు, కోయంబత్తూరులో జరిగిన పోటీలకు రాష్ట్రం నుంచి 371 మంది స్కేటర్లు ఆర్టిస్టిక్, స్పీడ్, హాకీ, స్పెషల్ చిల్డ్రన్స్ విభాగాలకు ప్రాతినిధ్యం వహించి 168 పతకాలను సాధించారు. ఈ సందర్భం పురస్కరించుకుని విజేతలను ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, థామసయ్య, కోశాధికారి అనిర్భన్‌పాల్, సీఈవో డి.భగీరథ్‌కుమార్ తదితరులు అభినందించారు.
వాలీబాల్ పోటీల్లో ‘పీబీ సిద్ధార్థ’కు మూడో స్థానం
విజయవాడస్పోర్ట్స్: కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ మహిళల పోటీల్లో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్, సైన్స్‌కాలేజీ జట్టు మూడో స్థానం సాధించినట్లు కాలేజీ క్రీడా శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి.వి.బి.కృష్ణారెడ్డి తెలిపారు. వర్సిటీ పోటీల్లో పతకం సాధించిన జట్టును కళాశాల అధ్యక్షుడు డాక్టర్ సి.నాగేశ్వరరావు, కార్యదర్శి పి.లక్ష్మణరావు, కన్వీనర్ ఎస్.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వి.బాబురావు, డీన్ రాజేష్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment