ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎకై ్సజ్ కాలనీలో పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి రూ. 14,750 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో హనుమకొండ, విజయపాల్‌కాలనీకి చెందిన బండా రమణరెడ్డి, కనకదుర్గాకాలనీకి చెందిన పల్లెపాటి రాజిరెడ్డి, శ్రీనగర్‌కు చెందిన ముప్పిడి భాస్కర్, ఉనికిచర్లకు చెందిన మైస ఏలియా, చాపలతండాకు చెందిన గుడిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారన్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. దాడిలో ఇన్‌స్పెక్టర్ బాబులాల్, సిబ్బంది పాల్గొన్నారు.
గుట్కా పట్టివేత..
వరంగల్: వరంగల్ చౌర్‌బౌలి ప్రాంతానికి చెందిన వ్యాపారి సింగారపు సతీశ్ వద్ద రూ.20,645 విలువైన నిషేధిత గుట్కాలు, జర్దాలను పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు అదుపులోకి తీసుకున్న సతీశ్‌ను తదుపరి చర్యల నిమిత్తం ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
రూ. 14,750 నగదు,
ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment