జంగుబాయి ఉత్సవాలు విజయవంతం చేయాలి
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీల ఆరాధ్య దైవం రాయితాడ్ జంగుబాయి ఉత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రజా భవన్‌లో జంగుబాయి దేవస్థానం నిర్వహణ కమిటీ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవనరి 2న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోటపరంధోళి గ్రామంలో ఉత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్యాంరావు, గౌరవ అధ్యక్షుడు జాకు, సలహదారులు మరప బాజీరావు, భూమేశ్, నాగు, రామారావు కటోడ, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
మండలంలోని పెర్కగూడ, పిట్లగూడ, చీమనాయక్‌తాండ, వడోని, కుమ్మరితాండ, తదితర గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఖయ్యుం, మాజీ సర్పంచ్ జగదీశ్, లింగన్న, మల్లుబాయి, భరత్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment