ములుగు రూరల్: ఏజెన్సీ గ్రామాలలో గౌడ సొసైటీలను పునరుద్ధరించాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో కల్లుగీత కార్మికులకు గుర్తింపు కార్డులను అందించాలని, ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. కల్లుగీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వెంటనే పింఛన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంజాల భిక్షపతి, రాజు, మల్లేష్ పాల్గొన్నారు.
సుధాకర్‌కు సన్మానం
కన్నాయిగూడెం: మండల పరిధిలోని చింతగూడెంకు చెందిన గోస్కుల సుధాకర్ ఇటీవల కేయూ నుంచి రాజనీతి శాస్త్ర విభాగం నుంచి డాక్టరేట్ పొందాడు. ఈ క్రమంలో సోమవారం గ్రామానికి చెందిన పలువురు సుధాకర్‌ను కలిసి సన్మానించారు. పేదరికంలో పుట్టి పెరిగి ఉన్నత చదువు చదివి డాక్టరేట్ పొందడాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కావిరి సంతోష్, దుర్గం ప్రభాకర్, జంగ కృష్ణ, జనగం నవీన్, వంగల సుమన్, మండప మహేష్, బొమ్మరాజు శివాజీ తదితరులు పాల్గొన్నారు.
హ్యూమన్‌రైట్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వీరస్వామి
మంగపేట: హ్యూమన్‌రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మండలంలోని చెరుపల్లి గ్రామానికి చెందిన వీరస్వామిని ఆ సంస్థ ఫౌండర్ ఆండ్ చైర్మన్, సుప్రీంకోర్టు అడ్వకేట్ బరిగే అయ్యప్ప నియమించి అభినందించారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి నేరేడ్‌మెట్ అంబేడ్కర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో బాధ్యతలను అప్పగించినట్లు వీరస్వామి తెలిపారు. ఈ సందర్బంగా వీరస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఫౌండర్ అయ్యప్ప, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధ్యాయుల టీం విజయం
ఏటూరునాగారం : జిల్లా కేంద్రంలో తెలంగాణ టీచర్స్ క్రికెట్ అసోసియేషన్ (టీటీసీఏ) వారి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన టీచర్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో జిల్లా ఉపాధ్యాయుల బృందం విజేతగా నిలిచిందని ఏటూరునాగారం ఎంఈఓ కొయ్యడ మల్లయ్య తెలిపా రు. ఈ టీంకు ప్రాతినిథ్యం వహించిన ఏటూరునాగారం నార్త్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోతు రాజశేఖర్‌ను సోమవారం మండల కేంద్రంలో ఎస్‌టీయూ సంఘం ఆధ్వర్యం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంచర్ల వీరభద్రం, ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ రాంబాబు, అసోసియేట్ అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యాయులు ఉట్నూ రి రాంబాబు, గుమ్మల రవీందర్ పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాలయంలో సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవతి అమావాస్య పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ అనంతరం స్వామి వారికి, నందీశ్వరుడికి పంచమృతాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం గణపేశ్వరస్వామి వారితో పాటు భవాని మాతను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment