స్పందనకు సలాం..
‘సాక్షి’ కథనాలకు కదలిన యంత్రాంగం
సీరియల్ కిల్లర్ గుట్టు రట్టు..
● బాలకార్మికుల విముక్తి, చెంచుల సమస్యలపై అక్షర పోరాటం
● 11 మందిని మట్టుపెట్టిన మాయల మాంత్రికుడి బాగోతం బట్టబయలు
● జిల్లావ్యాప్తంగా అనేక సమస్యలు వెలుగులోకి..
● స్పందించి చింత తీర్చిన అధికారులు
● ఈ ఏడాది ‘సాక్షి’ ఎఫెక్ట్ కథనాలపై ఇయర్ రౌండప్
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యలు, ఇబ్బందులపై ‘సాక్షి’ అక్షరయాత్రను కొనసాగిస్తోంది. ప్రజల ఇక్కట్లను ఎప్పటికప్పుడు వార్తాకథనాల రూపంలో ప్రభుత్వం, అధికారుల కళ్ల ముందు ఉంచింది. జిల్లాలో దుర్భర జీవితం సాగిస్తున్న చెంచుల ప్రధాన సమస్యలపై పలు కథనాలను ప్రచురించింది. నల్లమల ప్రాంతంలో వెట్టిచాకిరి బారిన పడిన చెంచు బాలకార్మికుల గోసను ప్రచురించి.. వారికి విముక్తి కల్పించింది. మాయలు మంత్రాల పేరుతో అమాయకులను బలి తీసుకుంటున్న మాయల మాంత్రికుడి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’ వార్తాకథనాలకు స్పందించిన అధికారులు.. ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది కాలంలో ‘సాక్షి’ ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించి.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసిన తీరుపై ఇయర్ రౌండప్.
చెర నుంచి బాలలకు విముక్తి..
అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే) తండాలో ఓ వ్యక్తి ముగ్గురు చిన్నారులను పశువుల కాపరులుగా పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా చెంచు చిన్నారులను పనిలో పెట్టుకుని, వారిని చిత్రహింసలు పెడుతున్న విషయం ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. బాలకార్మికులను పనిలో పెట్టుకుని హింసిస్తున్న వైనంపై గత జూలై 12న ‘బాలుడికి విముక్తి కల్పించండి’ శీర్షికన వార్తాకథనానాన్ని ప్రచురించి సమస్యను వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఐటీడీఏ అఽధికారులు, ముస్కాన్ టీం సభ్యులు ఘటనా ప్రదేశానికి వెళ్లి గ్రామంలో పనిచేస్తున్న ముగ్గురు బాలకార్మికులకు విముక్తి కల్పించారు.
చెంచులకు బాసటగా..
Comments
Please login to add a commentAdd a comment