బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
నల్లగొండ క్రైం: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం నల్లగొండ పట్టణంలోని రామగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది. బొట్టుగూడకు చెందిన గంగిశెట్టి వెంకటేశం(50) రామగిరిలో ఆయుర్వేద మందుల దుకాణం నడుపుతున్నాడు. షాప్‌కు వస్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వెళ్లి కళ్లు తిరుగుతున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో వారు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్సై నాగరాజు తెలిపారు.
రాజాపేట నుంచి బంటుగూడెం వెళ్తుండగా..
రాజాపేట: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం పైనుంచి పడి తీవ్రగాయాలు కావడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రాజాపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మదిర గ్రామం బంటుగూడెం గ్రామానికి చెందిన గొళ్లెన భిక్షపతి (55) రాజాపేట నుంచి బంటుగూడెం గ్రామానికి సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ద్విచక్రవాహనం పైనుంచి పడడంతో..
కొడకండ్ల: బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని హక్యాతండా గ్రామ పంచాయతీ పరిధి వెలిశాల శివారులో శుక్రవారం చోటు చేసుకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గాంధీనగర్‌కు చెందిన పందుల నగేశ్(40) బైక్‌పై కొడకండ్ల వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై చింత రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment