రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి
యాదగిరిగుట్ట రూరల్: కారు ఢీ కొట్టడంతో తల్లీకుమారుడు మృతి చెందిన సంఘటన యాదగిరిగుట్టలోని హైదరాబాద్– వరంగల్ ప్రధాన జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మాదిరెడ్డి సంధ్య అలియాస్ శాంతి(35) ఆమె కుమారుడు మాదిరెడ్డి క్రాంతి (15), హైదరాబాద్‌లోని ఈసీఎల్ దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. శాంతి భర్త ప్రతాప్‌రెడ్డి ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. సంధ్య తన కుమారుడు, అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తి రాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి స్కూటీపై వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం సమయంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈక్రమంలో యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజీ సమీపానికి రాగానే, అదే రూట్లో వెళ్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెనుక నుంచి స్కూటీని ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఎగిరి కింద పడిపోయారు. దీంతో సంధ్య, ఆమె కుమారుడు క్రాంతికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న రాజుకు తీవ్ర గాయాలు కాగా, ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపారు.
ఫ బైక్‌ను ఓవర్ టేక్ చేస్తూ
వెనుక నుంచి ఢీకొట్టిన కారు
ఫ తాళ్లగూడెం సమీపంలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment