నిఘా నీడలో కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్షలు
కర్నూలు: కానిస్టేబుల్ నియామక పరీక్షలో ద్వితీయ ఘట్టం శారీరక, దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10,143 మంది ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తర్ణులయ్యారు. అందులో మొదటి రోజు సోమవారం 600 మందిని దేహదారుఢ్య పరీక్షలకు ఆహ్వానించగా 280 మంది హాజరయ్యారు. మొదట ధ్రువపత్రాలు, శారీరక కొలతల పరిశీలన (పీఎంటీ), దేహదారుఢ్య పరీక్ష (పీఈటీ) నిర్వహించారు. ఇందులో అర్హత పొందినవారికి లాంగ్‌జంప్, పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ప్రారంభించారు.
వేకువజామునే మైదానానికి
పరీక్ష విధులకు నియమించిన పోలీసు, సాంకేతిక, పోలీసు కార్యాలయ పరిపాలనా విభాగం సిబ్బందితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (పీడీ) వేకువజామున 5 గంటలకే ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలం మైదానానికి చేరుకున్నారు. అప్పటికే క్యూలో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలించి బయోమెట్రిక్ అథెంటికేషన్ ట్యాగ్‌లు, క్యూఆర్ కోడ్‌తో ఉన్న టీషర్టులు ధరింపజేసి పోటీలు నిర్వహించారు. ఇదిలా ఉంటే రిక్రూట్‌మెంట్ నిర్వహణ జరుగుతున్న మైదానం చుట్టూ భారీ పోలీసు బందోబస్తుతో పాటు ప్రతి ఈవెంట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి నిఘా నీడలో పరీక్షలు జరిపారు.రిక్రూట్‌మెంట్ బోర్డు కేటాయించిన తేదీల్లో అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ వరకు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
మొదటి రోజు 280 మంది హాజరు
పరుగు పోటీలను ప్రారంభించిన ఎస్పీ
నెల రోజుల పాటు సాగనున్న ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment