ఇలా ఈ ఇద్దరే కాదు. ఉచిత విద్య కింద ప్రైవేటు పాఠశాలల్లో
● పేద పిల్లల ఉచిత కార్పొరేట్
విద్యకు ఎసరు
● ఫ్రీ సీటు అయినా ఫీజు కట్టాలంటున్న
ప్రైవేట్ విద్యాసంస్థలు
● గత ప్రభుత్వంలో విద్యాహక్కు చట్టం
పటిష్టంగా అమలు
● ప్రస్తుతం పట్టించుకోని
కూటమి సర్కారు
● జిల్లాలో ఉచిత విద్యకు
దరఖాస్తు చేసుకున్నది 1,862
● 3 విడతల్లో 945 మందికి
ప్రవేశం కల్పించినట్లు ప్రకటన
● అందులో 50 శాతం కూడా అడ్మిషన్లు
ఇవ్వని ప్రైవేట్ విద్యాసంస్థలు
● ఇప్పుడు వారిని సైతం
ఫీజుల కోసం వేధిస్తున్న వైనం
● ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
ఇక్కడ కుమారుడితో కనిపించే వ్యక్తి పేరు షేక్షావలి. డోన్ పట్టణానికి చెందిన ఇతను కుమారుడిని ప్రైవేట్ స్కూల్‌లో చదివించేందుకు ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోగా పట్టణంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో సీటు కేటాయించారు. ఉబ్బితబ్బైన షేక్షావలి వెంటనే అక్కడికి వెళ్లి అడ్మిషన్ చేయించారు. పదో తరగతి వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆనందపడుతున్న సమయంలో పాఠశాల యాజమాన్యం పిలిచి ఉచిత విద్యకు సంబంధించిన ఫీజు చెల్లింపుపై ఇంకా సర్కారు నుంచి స్పష్టత రాలేదు. కావున మీరే ఫీజు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తుందని షేక్షావలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాడు
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం సెక్షన్ – 12 (1), (సి) ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏటా 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. ఈ చటం పకడ్బందీగా అమలయ్యేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా ధనికుల పిల్లలు మాత్రమే చదవగలిగే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలు సైతం దర్జాగా అడుగు పెట్టగలిగారు. విద్యనందించినందుకు స్కూల్ యాజమాన్యాలకు ఏడాదికి అర్బన్ ఏరియాలో రూ. 8 వేలు, రూరల్‌లో రూ 6,500 ఫీజుగా నిర్ణయించారు. ఈ మొత్తం ఫీజు విద్యార్థి తల్లిదండ్రులు చెల్లించలేని పక్షంలో వారికందించే అమ్మఒడి సాయం నుంచి సర్కారు చెల్లించింది. ఫీజు పోనూ మిగిలిన సొమ్మును తల్లి ఖాతాకు జమ చేసింది. విద్యార్థి 10వ తరగతి పూర్తయ్యే వరకు యాజమాన్యాలు పుస్తకాలకు, యూనిఫాం, ట్యూషన్, స్పోర్ట్స్ పేరుతో ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా చూసుకుంది.
జిల్లాలో 2024 – 25 విద్యాసంవత్సరం
రైపెవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో
ఉచిత విద్యకు ఎంపిక ఇలా..
మొత్తం దరఖాస్తులు: 1,862
విడతలు ఎంపికై ంది అడ్మిషన్
అయింది
మొదటి విడత 960 736
రెండో విడత 302 201
మూడో విడత 25 17
1287 945
దొర్నిపాడుకు ఈ చెందిన ఈ మహిళ వెంకటసుబ్బమ్మ. తన కొడుకు గంగారామ్‌కు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య సీటు వచ్చిందని సచివాలయ సిబ్బంది తెలపడంతో సంతోషంగా ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. పుస్తకాలు, యూనిఫాం ఇతర వాటికి కలిపి సుమారు రూ. 4,500 కట్టించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా జీఓ అమలు చేయడం లేదు. అందరు చెల్లించేలా మిగిలిన ఫీజు కూడా చెల్లించాలని పాఠశాల నిర్వాహకులు ఒత్తిడి చేస్తున్నారు. తొలుత ఉచితమని చెప్పి ఇప్పుడు కట్టాలనడంతో పాలు పోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నేడు
నీకు పది హేను వేలు.. నీకు పది హేను వేలు.. నీకు పది హేను వేలు.. ఇలా ఒక్కో కుటుంబంలో ముగ్గురే కాదు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ‘తల్లికి వందనం’ పేరుతో రూ. 15 వేల చొప్పున చెల్లిస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఎడాపెడా ఊదరగొట్టి అధికారంలో కొచ్చారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తకుండా పేదలపై ఫీజుల భారం మోపుతున్నారు. పైసా ఖర్చులేకుండా పేద పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా విద్య అందించాలనే విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచారు. ఉచిత విద్యపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో పాటు ‘తల్లికి వందనం’పై కూడా స్పందించక పోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఈ ఏడాది చేరిన వారితో పాటు రెండేళ్లుగా ఫ్రీ అడ్మిషన్ పొందిన వారిని ఫీజులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు.
ఆళ్లగడ్డ: ఆక్షర జ్ఞానంతోనే పేదల ఆర్థిక పరిస్థితి మారుతుందని భావించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో పైసా ఖర్చు లేని ఉచిత విద్య అందించేందుకు బంగారు బాట వేసింది. ఏటా ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించి సీట్ల కేటాయింపు, ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరిగేలా చూసింది. అయితే, ఏడు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ‘పేదలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య’ పై నీలినీడలు అలుముకున్నాయి. ఈ విద్యా సంవత్సరం సీట్లు పొందిన వారితో పాటు ఈ పథకం కింద ఇప్పటికే చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజుల వసూలుకు యాజమాన్యాలు ఒత్తిడి పెంచాయి. దీంతో తమ పిల్లలకు ఫ్రీ సీటు వచ్చిందనే ఆనందం పేదలకు కూటమి పాలనలో ఆవిరైంది.
నిబంధనలకు నీళ్లు
జిల్లాలో 314 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 2022 – 23 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతిలో సీట్ల సంఖ్యలో 25 శాతం పేదలకు కేటాయించేలా గత ప్రభుత్వం జీవో అమల్లోకి తీసుకు వచ్చింది. ఇందులో అనాథలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, ఎస్సీ – 10 శాతం, ఎస్టీ – 4 శాతం, ఇతర వర్గాలకు – 6 శాతం సీట్లు కేటాయించేలా విద్యాహక్కు చట్టం అమలు చేసింది. దీంతో తొలి ఏడాది 138 మంది, 2023–24 లో సుమారు 800 మంది చేరారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో 1,862 మంది దరఖాస్తు చేసుకోగా విడతలుగా వడపోసి కేవలం 945 మందిని ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఉచిత విద్యపై నోరు మెదపక పోవడంతో ఈ ఏడాది చేరిన విద్యార్థులతో పాటు గత రెండేళ్లుగా చేరిన విద్యార్థులను సైతం అందరిలాగా ఫీజులు చెల్లిస్తేనే ఉండాలంటున్నారు. ఈ మేరకు ఫీజు గురించి పిల్లల డైరీలో రాసి పంపిస్తున్నారు. ఉచిత విద్య అందుతుందనే ఆశతో తమ పిల్లలను చేర్పించిన పేదలు ఇప్పుడు కూటమి సర్కారు స్పందించకపోవడంతో బయట అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది.
ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు
ఉచిత విద్యకు ఎంపికై న విద్యార్థులను ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయం జిల్లా కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.వారి ఆదేశాల మేరకు ఉచిత విద్యకు అడ్మిషన్లు పొందిన పిల్లలపై ఫీజులు చెల్లించాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం – జనార్దనరెడ్డి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment